Saturday, February 11, 2023

 


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 


కావాలనుకొని ప్రేమిస్తే ప్రాణాలైనా అర్పిస్తా

విలువనీయక తోసేస్తే నీ పేరు సైతం చెరిపేస్తా

ఎదిగితే ఒదగకపోతే పడిపోక తప్పదు నీకు

బ్రహ్మరథం పట్టినవాళ్ళే ముంచగలరు మూణ్ణాళ్ళకు


1.నిను నెత్తిన పెట్టుకుంటే అలుసుగా భావించావు

కాలికింద నలిపేసి హీనంగా తలపోసావు

మందీ మార్బలాలూ ఏవీలేని సామాన్యుడిని

వందిమా గధులతొ నిన్ను అందలం ఎక్కించనివాణ్ణి


2.మాయలోన మునిగాను నీవన్నెచిన్నెలకు

భ్రమలోనె బ్రతికాను పైపైని నీ మెరుగులకు

ఎన్నాళ్ళు నీతోఉన్నా నీకునేను ఒక పిచ్చోడిని

దేవతగానే కొలుచుకున్నా నీదృష్టిలొ గుదిబండని


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ 



ఆశీస్సులు చిన్నారి ఆశ్రిత్ రోహన్ కు

మా అందరి దీవెనలు దీర్ఘాయుష్మాన్ భవా అంటూ నీకు

మా కన్నుల దివ్వెలతో ఇచ్చేము ప్రేమ నీరాజనాలందుకో 

మానవ్వుల అక్షతలివిగో ఉన్నత శిఖరాలనికపై నీవుచేరుకో


శుభాకాంక్షలివిగో నీపుట్టిన రోజున

శుభహారతులందుకో ఈ ఆనంద సమయాన


1.సుందరాంగ నీకిదే నిండుచంద్రహారతి

సూక్ష్మబుద్ధిగల నీకు దివ్య సూర్యహారతి

నవ్వుల వెదజల్లే నా తండ్రీ నక్షత్రహారతి

పరవశాన్ని కలిగించే నీమోముకు పరంజ్యోతి హారతి


2.దినదినము వర్ధిల్లగ నీకిదే శుభహారతి

దిష్టన్నది తగులకుండా నీకు కుంభ  హారతి   

గెలుపు నీ తలుపు తట్టగా అందుకో జయహారతి

వంశానికే మంచిపేరుతేగా గొను మంగళ హారతి

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


చిత్తరువైపోయాను నీ చిత్తరువునిగాంచి

మత్తులో కూరుకపోయాను నీ మధరగాత్ర మాస్వాదించి

భువికే అందాలు పెంచావే ఏదివ్యలోకాలనుండో ఏతెంచి

సలాంచేస్తానే మీ అమ్మానాన్నలకు నినుకన్నందుకు తలవంచి


1.నీకేశ సంపద నను నిలువున ముంచదా

కురుల వంకీ మోమున వాలి ఎదలయ పెంచదా

నిగారింపు బుగ్గలు చూసి నిమురాలనిపించదా

వన్నెలెన్నొ ఒనగూరిన నీమేను హరివిల్లును మించదా

ప్రణామాలివే మీ నాన్నకు నీవంటి సుందరికి జనకుడైనందుకు


2.ఇంద్రనీల మణులేనే దీపించే నీ కనులు

చంద్రకాంత సదృశాలు నీ అజిన జానులు

పొందికగా నీకమరింది అప్సరసల దేహసౌష్ఠవం

మంత్రముగ్దులవ  జేస్తుంది నీ గాత్ర సౌరభం

వందనాలివే మీ అమ్మకు వాసిగ నిను కని ఇచ్చినందుకు

 https://youtu.be/GWb2beg4d3Y


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


నీది చేతకానితనమో

నీకు న్యూనతా భావమో

పదే పదే నిన్ను ప్రార్థించిన ప్రతిసారి

నీ పదముల తలనిడి నేనర్థించిన తూరి

శ్రీ వేంకటాచలపతి ఏదీ నీ చమత్కృతి

వ్యర్థయత్నమా వేడగా నీ శరణాగతి


1.పుక్కిటి పురాణాలా నీ మహిమలు

అక్కరకే రాకుంటే ఎందుకు నీలీలలు

ఉబుసుపోక రాసినవా నీ పావన చరితలు

ఉత్తుత్తి కథలేనా నీ అవతార గాథలు

జయహో వేంకటపతి ఏదీ నీ చమత్కృతి

నీరుగారి పోయిందా నీ శరణాగతి


2.దోపిడి దొంగవు నీవు ఆరోగ్యం దోచావు

పోకిరి పోరంబోకువు ఆనందం త్రుంచావు

నీ జోలికి వచ్చామా మమ్ముల ముంచినావు

కోరికేమి కోరామని బ్రతుకు బుగ్గి చేసినావు

నమోనమో తిరుమల శ్రీపతి ఏదీనీ చమత్కృతి

పునరుద్ధరించుకో స్వామీ నీ శరణాగతి

 https://youtu.be/xszbhtdb3WA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మగ్గిన మామిడి పండే నీ సోయగం

గుప్పను సిరి మల్లెచెండు నీ సౌరభం

పరిపక్వమైన నీ పరువం శృంగారనైషధం

విరహాగ్నిన కాలే నాగుండెకు నీవే పరమౌషధం


1.నిండు చంద్రబింబమే ప్రియా నీ వదనం

  పండువెన్నెల వర్షించేనది నాపై అనుదినం

మచ్చల జాబిలి తూగదు నెచ్చెలీ నీకుపమానం

పుట్టుమచ్చ తెచ్చేను నీమోముకు మిక్కిలి చక్కదనం


2.నవ్వితే రాలు పారిజాతాలే  నీ పెదవంచుల్లో

వెతికినా అగోచరాలు నీ వయారాలు రాయంచల్లో

ముంచేయవే సుధ గ్రోలగా హద్దెరుగని ముద్దుల్లో

బంధించవే సందిట ప్రేయసీ నన్ను సందెపొద్దుల్లో

 https://youtu.be/1UIQnCZ68Cw


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రేమ స్వరూపుడు కాముని జనకుడు

మదన గోపాలుడు గోపికా లోలుడు

ప్రణయారాధకుడు రాధా మాధవుడు

నాకు ఆరాధ్యుడు అనుభవైకవేద్యుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


1.నవనీత చోరుడు వరాసి చోరుడు

మీరా మానస చోరుడు మచ్చిచ్చోరుడు

మురళీధరుడు శిఖిపింఛ ధరుడు

వైజయంతి మాలాధరుడు శ్రీధరుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


2.నందనందనుడు ఆనందవర్ధనుడు

మన్మోహనుడు ఘనశ్యామసుందరుడు

గోవర్ధన గిరిధరుడు గోవిందనామాంకితుడు

లీలామానుష వేషధరుడు మురహరుడు


వందే బృందావన సంచారి

వందే భక్తాంతరంగ విహారి


https://youtu.be/1UIQnCZ68Cw

 https://youtu.be/P_iz-SKtS6k


రచన,స్వరకల్పన&గానం:డా గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:యమన్ కళ్యాణి


శివ కళ్యాణము విశ్వ కళ్యాణమే

శివరాత్రి వ్రతముతో జీవకైవల్యమే

కనరండి కనులారా శివభక్త జనులారా

తరించండి తిలకించి తనువుల తపనలార

ఓం నమః శివాయ,జయ శ్రీరామలింగేశ్వరాయ


1.శివరత్న క్షేత్రమౌ అయ్యంకి పవిత్ర ధాత్రిన

వరలుచున్నాడు ఇల మొరలాలకించుతూ

శ్రీరామలింగేశ్వరుడు గంగా పర్వతవర్ధినియుతుడు

శరణాగతవత్సలుడా శంభుడు భక్తవ శంకరుడు భక్త వశంకరుడు


2.గంగను భరించి భర్తగమారిన భవహరుడు

లింగోద్భవ ఘట్టాన హరి బ్రహ్మల కందనీ దురంధరుడు

చెంబుడు నీళ్ళకే సంబరపడు గంగాధరుడు

అంబరమును అంబరముగ మేన దాల్చె దిగంబరుడు


3.మతితప్పి గతిగానక సతికై దుఃఖించిన భవుడు

పార్వతినే తపమాచరించి వరించిన అర్ధనారీశ్వరుడు

శ్రుతి లయ తామై జగతినే మురిపించగా మా ఉమాధవులు

వధూవరులై పరిణయమాడిరి విధిగా భవానీ భార్గవులు