Tuesday, March 21, 2023

 https://youtu.be/o-zz2IccnEw


*శుభోదయం*


*శోభకృతు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం: కళ్యాణ వసంతం


రవినై మీవాకిటి తొలిపొద్దుగా అడుగెడుతా/

కవినై నాగీతితో మీ ఎద తలుపు తడుతా/

ఈ శోభకృతు ఉగాది శుభవేళ షడ్రుచుల కవితను పంచిపెడతా/

ఈ శుభోదయ నవ రస మయ సమయానా మీగుండెలో జేగంటకొడతా/


1.తెలుగులంత ఒకటని చాటే ఉగాది పండుగ నా మది/

రెండు రాష్ట్రాలు సందడిగా చేసుకొనే  సంబరాలకిది నాంది/

మూడు కాలాలు పాడి పంటలతో నిండాలి ప్రతి ఇంటి గాది/

నాలుగు దిక్కులా చెలఁగాలి  తెలుగు ప్రజల ప్రజ్ఞా ప్రఖ్యాతి


2.పంచాంగ శ్రవణంతో కలగాలి అందరికి సుఖము శాంతి/

ఆరురుచులను ఆరగించి పొందాలి విందుభోజన తృప్తి/

ఏడు వ్యసనాలు విడనాడగా జనావళికి ఆరోగ్య సంప్రాప్తి/

ఆష్టవిధ ఐశ్వర్యాలతోబాటు వికసించాలి మానవత్వ వ్యాప్తి/



https://youtu.be/1HY-fLc2sk4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:కీరవాణి


అడవి గాచిన వెన్నెలా  నా గేయ రచన

అరణ్యరోదన కోయిలా నీ గాన నివేదన


1.సభికులే కొరవడి  సరసతే వెనకబడి

సందడే లేక మొక్కుబడిగ నేడీ సమారాధన


2.పదగుంఫన మూలబడి భావుకత కాలబడి

సాహితీ సౌరభమే చచ్చీ చెడీ సాగే ప్రదర్శన


3.గొంతు కాస్త పిడచబడి శ్రుతీలయా పలచబడి

గాత్రధారణ యధేచ్ఛగా మలచబడే గర్భవేదన


4.భావరాగతాళాలు రాఖీ నీపాటకైతె పొసగబడి

ఎద ఎదలో  అలజడి రేపబడితేనే తేనె ఆస్వాదన



 https://youtu.be/apkIYpGZ1tM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నిదురోయిన మధురోహల జాగృత పరచకు

పదపడి నా స్తబ్దుమదికి అతురతను పెంచకు


1.శతమర్కట సమమైనది అతివన వాసన

వాలము కటిఒంపు కరవాలముతో ఖండించకు


2.వయసులో వరాహమూ సుందరమను నానుడి

సొగసుకత్తెవాయె మరి నారీ వలపు తూపులిక దించకు


3.మగువ ఎదురు పడితేనే మధిరానది తీరమది

వాలుచూపులే విసరుతూ కైపుసుడిలొ ముంచకు


4.ఎటు కొరుకూ చెఱకుగడను గ్రోలు తీపి మారదు

సోకులార బోసి మరీ దీక్ష భగ్నమొందించకు


5.చరితలందు చదివితివే వనితల వంచన రీతులు

మూణ్ణాళ్ళ మురిపెం రాఖీ ముగ్ధానను విశ్వసించకు