Wednesday, January 18, 2023

 

https://youtu.be/rz9qbE770l0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:జోన్ పురి


ఆపక తప్పదు ముందుకేగు నా పయనం

వదలక తప్పదు ఈ బాహ్యం ఏదో ఒక శుభోదయం

సాగాలి నాలోని అంత రాల లోనికి

వీడ్కోలు చెప్పాలి వ్యామోహాల లోకానికి


1.త్యజించటం సాధన చేయాలి ఒకటిఒకటిగా

విదిలించుకోవడం అలవర్చుకోవాలి పరిపాటిగా

ఎంతగా  భారాలు తగ్గించుకొంటే అంతటి సౌఖ్యం

బంధాలు బంధనాలుగా మారకుండుటే ముఖ్యం


2.అరవయ్యేళ్ళ జీవితాన ఆటుపోటులెన్నెన్ని

అనుభవాలు అనుభూతులు కావలసినన్ని

రేపు మాపని వాయిదాలు వేయుటే పిచ్చిపని

మీనమేషాలేలా నను కనుగొన శషభిషలాపని