Saturday, July 30, 2022

 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలియుగ వరద కల్మషనాశా

కరుణాంతరంగా నిజ భక్తపోషా

తిరుమలవాసా శ్రీ వేంకటేశా

సరగున వరమీయరా శ్రీ శ్రీనివాసా

వదలను పదములు స్వామీ వందన శతములు

గోవిందా ముకుందా నెరవేర్చు మా ఇతములు


1.అలుపులేదు విసుగు రాదు

నిను వేడగ మా వేడ్కలు

అదుపులేదు కొదవలేదు

నిను కోరగ మా కోర్కెలు

ఇచ్చేవాడివనే నిను సాధించేది

మముగన్నవాడివనే వేధించేది


2.తృప్తియన్నదే లేదు ఎన్నున్నామాకు

ఉన్నతపదవులు తరగని సంపదలు

ఆశచావదాయె అందుకొనగ మాకు

సత్కారాలు బిరుదులు పురస్కారాలు

యాగీ చేసినా నీవు యోగించవాయే

హఠము చేసినా మాకు ప్రాప్తించవాయే