Saturday, December 17, 2022

 

https://youtu.be/hyAToMyzAJE?si=uLFm9VePZ3eZbYS4

22) గోదాదేవి ఇరవై రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:చారుకేశి


సురలు భూధరులు మునివరులు

నీ మేలుకొలుపుకై పడుదురు పడిగాపులు

అధికార మదమునొదిలి దేహమోహమూ వీడి

నీదరి కరుదెంచి నీ దయనాశించెడి పగిది

మేమంతా కూడివచ్చి నిలిచితిమి నీదివ్య సన్నిధి


1.విచ్చిన తామరల తీరు తెరువు ప్రభూ- నీ నేత్ర యుగళి

చల్లని కరుణను ప్రసరించు స్వామి-గొని వేగమే జాలి

మువ్వగోపాలా అలరించనీ అందమైన నీ నవ్వుల సరళి

మ్రోగించవో హృదయాను రాగాల తేల నీ మోహన మురళి


2.జగద్రక్షకా చాలించు నీ పరీక్ష ఓపలేము ప్రతీక్ష

సత్ఫలితమునందగా పూర్తిచేయనీ  శ్రీ వ్రత దీక్ష

నీ కృపాకటాక్ష వీక్షణతో పాపములే హరించ నీవె రక్ష

మేలుకొనవయ్య మమ్మేలుకొనగ నమో పుండరీకాక్ష

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హంసానంది


నేలబాట పట్టింది మేఘమాలిక

నీ కురులు చూస్తె తోచిందీ పోలిక

సుందరాంగుల లోకానికి నీవే ఏలిక

దిగిరావే ఒదిగిపోవే నీతోడే కావాలిక


1.నీ పలువరుసే ముత్యాల పేరు

నగవులందు వెన్నెల సెలయేరు

చెంపల సొట్టలలో పుట్టతేనెలూరు

కెంపులే పెదాలకే అరుణిమనే కూరు


2.చుక్కే దాక్కుంది ముక్కుపుడకతో పడక

కనుబొమలే సుమధనువై దోగాడిన వేడుక

నీ కనులే మీనాలై నా చూపుల వలలలో పడక

నీ తలపుల తూపులతో అంపశయ్య నా పడక

 https://youtu.be/m49YERE0gAU?si=vX_j5hT_FUYxJD82

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాడిందే పాడి పాడి-వేడిందే వేడి వేడి

విసిగినాను విప్పలేక బ్రతుకులోని చిక్కుముడి

అనుకున్న ప్రతిసారీ అడుగులు తడబడి

వేంకటేశ పనికిరాద వసతికి నా గుండెగుడి

మొక్కుచుంటి మొరవినమని స్వామీ సాగిలబడి


1.పడగెత్తి బుసకొట్టు పాము నా కోపము

పవళించవయ్యా చేకొని నీ  శయ్యాతల్పము

రెక్కలను సాచి ఎక్కడికొ ఎగిరేటి పక్షి నా కామము

ఎక్కి తిరుగవయ్యా చక్కని గతి వదలక ఏ క్షణము

చెలఁగేనా గుణగణములు చేయనీ నీకై కైంకర్యము


2.నా జీవితదశలు నీ దశావతారాలుగను

తల్లిగర్భాన చేపను శిశువుగ తాబేలును

ఉచితా నుచితములెరుగని వరాహము మృగమును

మరియాద రామునిగా మనుటకొరకు వగచెదను

గీతా కృష్ణునిగా జీవన పరమార్థమెరుగ ప్రార్థించెదను

 

https://youtu.be/xQ8YVPH04lU?si=Trr0j6UDdRXoAtPv

21) గోదాదేవి ఇరవైఒకటవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:చక్రవాకం


గోవర్ధన గిరిధారి గోకుల శౌరి

గోవింద నామాంకిత కృష్ణా బృందావిహారి

అభివందనచందనాలు నీకు మురారి

నిను లేపగ వచ్చితి నీ నీలను గోదా బృందముచేరి

నిదురలేచి సిద్దపడగ నోముఫలముకై నిను కోరికోరి


1.కుండలు నిండిపోగ దండిగ పాలుపొరలెడు

ఆవులమందలకే అధిపతి మా నందగోపుడు

యశోదానందులకే గారాల సుతుడవు

ఈ నీలా సుందరికే  ప్రియతముడవు నీవు

నిదురలేవవయ్యా నీవే నిజమగు ఆశ్రితవరదుడవు


2.సర్వస్య శరణాగతివేడి అంకితమైతిమి

శత్రుంజయ సురేంద్ర విజయ నమోనమామి

నీవారము మేము వరమిచ్చేవని వచ్చితిమి కరుణించెదవని నిన్నూ మనసారా నమ్మితిమి

కనికరించి నిదురలెమ్ము తరించెదము నోమునోమి

 

https://youtu.be/qiIMpX9cFUg?si=fGdpeq34vVl7QVVL

20) గోదాదేవి ఇరువదవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30 రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధనం

దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:ఆనంద భైరవి


నగుమోము రూపుడు నారద వినుతుడు నిరంజనుడు నీల శరీరుడు నులివెచ్చని దేహుడు నూఱుతప్పులు సైచినవాడు నృత్యప్రియుడు నెచ్చెలులు మెచ్చువాడు నేరేడు కనులవాడు నైకమాయు మిత్రుడు నొడుగు తేనియవాడు /

నోము ఫలమువాడు- నౌచరుడు భవజలధికివాడు/

నందకుమారుడు ఆనందకరుడగువాడికి నమో నమః


1.సురలకు సైతం భయహరుడు శ్రీ కృష్ణుడు

తెల్లారినా తెగదా గోపాలా నిను మేలుకొలుపుడు

స్వర్ణ కలశస్తని ప్రవాళ అధర భామిని నీలామణీ

నాజూకు నడుమున్న నీలాదేవీ నీవే భూ సిరివి

హరిని మనోహరుని మేల్కొపి సిద్ధపరచు జాగుమాని


2.నగధరునికి ప్రియ సతివని కోరితిమి శరణము

అందీయవె నోముకై వలయు ఆలవట్టం,దర్పణము

సపర్యలే చేయుచు సహకరించవే నందకిషోరునికి

నీరాడగ జేయవే నీ ప్రియ వరదుడిని మాతో కూడి

మదనగోపాలుని పదిలముగా లేపవే బ్రతిమిలాడి