Wednesday, October 30, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శివరంజని

అక్క అంటె మెరిసే చుక్క
చెల్లియంటె విరిసిన మల్లి
స్నేహానికి ప్రతిరూపం సహోదరే
అనురాగ దీపమంటే ఆడకూతురే

అన్నంటే ఆరో ప్రాణం
తమ్ముడంటె తానే సర్వం
కంటిరెప్ప తానే సోదరుడు
చంటిబిడ్డ లాంటి సహజుడు

1.అమ్మలాగ లాలిస్తుంది
నాన్నలాగ నడిపిస్తుంది
ఆటపాటలెన్నో నేర్పుతుంది
అంతలోనె అత్తారింటికి తుర్రుమంటుంది

గొడుగులాగ నీడౌతాడు
అడుగడుగున తోడౌతాడు
కళ్ళు తడుచు చేయి తానౌతాడు
కన్నుమూసి తెరిచేలోగా వదినమ్మకు జతఔతాడు

2.పండుగ శుభహారతి తానే
ఆడపడుచు అధికారంతానే
పుట్టినింటి గౌరవం తానే
 మెట్టినింటి ఆర్భాటం తానే

ఆపదసంపదకు ఆప్తుడుతానే
కష్టసుఖాల్లో కాచే తోబుట్టువు తానే
ఏకాకిని కాదను ధైర్యం తానే
బామ్మర్దుల బలమైన అనుబంధం తానే
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అప్సరసల అందం నీది
మిసమిసల పరువం నీది
రుసరుసల అలకే నీది
శషభిషల పలుకే నీది
ఆగలేను వేగలేను  సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను

1.ఉన్నచోట ఉండీలేకా ఉండనీవు
నన్ను నా మానానా బ్రతుకనీవు
తప్పుకోబోతే ఎరవేసి లాగేవు
పట్టుకోబోతే నిన్ను కన్నెర చేసేవు
ఆగలేను వేగలేను  సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను

2.నీవు చూపే చొరవ వల్లనే ఎదలోకి చొరబడతాను
నిజాయితీ ప్రేమ నీదని ప్రతిసారీ పొరబడతాను
కోపముంటె  చంపివేయి-నీ కౌగిట నలిపేసి
పబ్బమింక గడిపివేయి నన్నిపుడే బలిచేసి
ఆగలేను వేగలేను  సతమతమయ్యేను
విడువలేక పట్టలేకా నీతో చిక్కేను