Monday, March 13, 2023

 


https://youtu.be/WvxGYSwvO-c

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సారమతి

సింగార నరసింగరాయా
అనంగజనకా రసికశేఖరాయా
చెంచులక్ష్మి పై మనసుపడి
మనువాడిన ధర్మపురి నరహరిరాయా
ఆనందకరమౌఈ శుభ తరుణానా
కనికరించు మము కరుణాభరణా

1.సిరితో ఏకాంత సేవకు వేళాయే
శ్రీకాంత నీ కిది పరవశ సమయమాయే
విరిమాలలతో అలరించిన నీ సుందర రూపం
కనినంత అనంతా మా జన్మ కడుపావనం

2.వివిధ విధులతో విధిగా నిను వినోదింతుము
వైదిక మంత్రాల సంగీత గానాల నర్తింతుము
సప్త పరిక్రమల పరిపరి రీతుల సేవింతుము
పవళింపుసేవతొ స్వామీ నిను ఆరాధింతుము

 

https://youtu.be/cyM4IjpLCnw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

జైత్రయాత్రకు  బయలు దేరిరి ధర్మపురి మీ మిత్రత్రయము
నరహరి హర వేంకటేశ్వర స్వాములకు జయము
శిష్టరక్షణ దుష్టశిక్షణమీకు సర్వదా ప్రథమ ధ్యేయము
దనుజ సంహారమొనరించి కూర్తురు లోక కళ్యాణము

1.వైరులకు వెన్నుజూపని క్షత్రియత్వము నీదినరసింహా
చతురతను జూపి నెగ్గగలిగిన గుప్తభావన నీది శ్రీనివాసా
3.అరివీర భయంకరుడవు త్రిపురహరుడవు నీవు శివశంకరా
విజయోత్సవము  దివ్యమగు మీ రథ ఉత్సవము
ధర్మపురీశా ఈశా శ్రీవేంకటేశా

2.వీర తిలకము దిద్ది సమరానికంపిరి మీ వీరపత్నులు
హారతులు వెలిగించి స్వాగతించిరి  మిమ్ము మా ఊరి భక్తులు
కనుల పండుగ మాకు కలలు పండగ బ్రతుకు అభయమిచ్చును మీ దయాదృక్కులు
తొలగిపోవును మిమ్ము నమ్మి వేడితిమేమి విడరాని మా చిక్కులు

 


https://youtu.be/e__rTLxAcPI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:లలిత

రాజేశ్వరా నటరాజేశ్వరా
రాజరాజేశ్వరా రాజేశ్వరీ వరా
రారా నన్నేలరా రాజశేఖరా
కైలాస శిఖరాలు కడచిరారా
కైవల్యమార్గాన నను నడపగరా
నందీవాహనమెక్కి వందీమాగధులగూడి
భృంగిశృంగి ఆదిగా సేవక జనములతోడి

1.క్రిమి కీటకాలకు పశుపక్ష్యాదులకు
దారిచూపినావు శివా మోక్షలోకాలకు
అజ్ఞాన భక్తులకు చోరశిఖమణులకు
అనుగ్రహించి చేర్చావు  అక్షరములకు
ఉత్కృష్టమే కదా నరజన్మ ఉద్ధరించరా
అదృష్టములేదా ఈజన్మకు అవధరించరా

2.దమనచిత్త దానవులను దయజూశావు
   భిల్లుడైన తిన్నడినీ నీ అక్కున జేర్చావు
బాలకులను సైతం బిరాన కాచావు
కిరాతావతారమెత్తి కిరీటినింక బ్రోచావు

నిరతము నీ ధ్యాన మగ్నుడనే కదా శంకరా
కనికరమున ననుగాంచగ నాకేదిక వంకరా

 


https://youtu.be/ygMeKTfZiIo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రీతిగౌళ

శాంకరీ శాంభవీ శివాని
భగవతి బార్గవీ భవాని
నతించెద ప్రీతిగా నుతించెద
మతిలో సతతము జపించెద

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

1.శ్రుతియు స్మృతియు ద్యుతియునీవే
చరాచర గోచరము నీవే అగోచరమునీవే
విశ్వవ్యాపిని విమల హృదయిని
జ్ఞానదాయిని మోక్ష ప్రదాయిని

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

2.దైహికవాసన దహింపజేయవే
ఐహిక వాంఛల నిక త్రుంచవే
చండ ముండ శమని చాముండేశ్వరి
వైష్ణవి వారాహి అఖిలాండేశ్వరి

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

 


https://youtu.be/AxmiDRW7JNg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:భీంపలాస్

వీనులవిందాయే గోవిందా
నీ గానమె మందాయే భవరుగ్మత బాపంగ
పాడినవారి గళము పావనగంగ
భక్తుల హృదయమే ఉప్పొంగే సంద్రంగా

1.పలికించిరి హరిపద మకరందము
ఒలికించిరి సంకీర్తనామృతము
చిలికించిరి ఆరాధన నవనీతము
ఆస్వాదించిరి ఇహపర సౌఖ్యము

2.భక్తిభావ సుధకై  కవనం మధించిరి
సంగీతమె జీవితమని సదా భావించిరి
నీ మహిమల నభినుతించి అనుభూతించిరి
కృతులనెన్నొ లిఖించి నిరతమాలపించిరి

 

https://youtu.be/sWjmN8wBE2U

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:నాగ గాంధారి

సరసిజ నాభా సిరివల్లభా
శ్రీ శ్రీనివాసా శ్రితజనపోషా
సరసహృదయ దయామయా
నిను కీర్తించి తరించె అన్నమయా
కరుణను నను చేగొనవయా
తాత్సారమేలనయా తిరుమలనిలయా

1.కాంచనమణి మకుటము-తిరునామ లలాటము
  కాంచగ కౌతుకము నీ కౌముది సమ హాసము
  తడబడచుంటిని స్వామి పొగడగ కాదునాతరము
నిను చూడనీ కడతేరగా నీ కడనే నిరంతరము

కౌస్తుభ వక్షాంకితము వైజయంతిమాలాలంకృతము
కర యుగళ భూషణము శంఖ చక్ర విరాజితము
పద్మ హస్త శోభితము కౌమోదకి ఆయుధ సహితము
కౌశికాయుధమే కమలలోచనా నీ నఖశిఖపర్యంతము

@every one