https://youtu.be/BiaqGO2liwQ?si=oWvGLIURD1tLy5X3
రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ
రాగం:దర్భార్ కానడ
నా భక్తిని సడలనీకు భక్తవ శంకరా
అనురక్తి నీ ఎడల ఇనుమడించు అర్ధనారీశ్వరా
ఆసక్తిని ద్రుంచు విషయవాంఛలందు అరుణాచలేశ్వరా
ముక్తి ద్రోవ నను చేర్చు ప్రభూ వారాణసీ పురపతే నమో విశ్వేశ్వరా
1.ఇల్లూ పట్టుయని మోహపడే సాలీడును
మదము మీరి ప్రవర్తించు మత్తేభమును
బుసలుకొట్టు క్రోధమున్న కోడెనాగును
తిన్నని యోచన లేని క్రూర భిల్లుడను
కడతేర్చి కరుణించు శ్రీ కాళ హస్తీశ్వరా శ్రీశైల మల్లీశ్వరా
2.ఉచితానుచితములసలెంచని రావణుడను
స్వార్థము మూర్తీభవించిన గజాసురుడను
శరణాగతి కోరుకున్న మార్కండేయుడను
గుడ్డిగా నమ్ముకొన్న దీనుడ శిరియాళుడను
సరగున వరమీయర శ్రీ రాజ రాజేశ్వరా శ్రీరామలింగేశ్వరా