Tuesday, January 3, 2023

 https://youtu.be/Dln0O6J3yNs


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


భక్తి నాలొ ఇనుమడించనీ భక్తాంజనేయా

శక్తివంతమవనీ నా దేహం వీరాంజనేయా

అహము నాలొ నశించనీ దాసాంజనేయా

నీ అనుగ్రహము పొందనీ ప్రసన్నాంజనేయా

నమోస్తుతే జితేంద్రియా నమో మృత్యుంజయా


1.రామాయని అనెడి పదము నీకిష్టమే కదా

  శ్రీ కృష్ణుని ఆదేశము అని పాటించలేదా

రామకృష్ణ యుగ్మమే నా నామము భక్తవరదా

నన్ను బ్రోవగ హేతువిదియే స్వామీ చాలదా

నమోస్తుతే జితేంద్రియా నమో మృత్యుంజయా


2.నా చంచల మానసాన్ని నీ పంచన చేరనీ

నిశ్చలంబగు భక్తి నదిని నామదిలో పారనీ

కోరికపై విముఖతనే హరీ ఇక నను కోరనీ

కొండగట్టు మారుతీ నను నీ ధ్యాసతో కడతేరనీ

నమోస్తుతే జితేంద్రియా నమో మృత్యుంజయా