Tuesday, December 25, 2018

అల్పమైన యానకాలు-ప్రేమకు ముద్దు ఆలింగనాలు
విశదపరచవే కవనాలు-మమతలకల్పనలో తడబడగా అక్షరాలు
భాష వ్యక్త పరుచలేదు-స్పర్శ తృప్తి కలిగించదు
పుక్కిట బంధించలేము-అనురాగ సాగరాలు
గ్రక్కున ప్రకటించలేము-ఉప్పొంగే మమకారాలు

1.చూపుల తూపులు సంధించినా
పెదవుల నవ్వులనే చిందించినా
తీయనైన పలుకులతో లాలించినా
అనునయ చర్యలతో సాంత్వనకూర్చినా
ధారపోయలేము సర్వస్వము
హృదయభరితమైన ప్రణయము
శూన్యపరచలేము మనో సరసము
తోడుతుంటె ఊరేటి ఆబంధము

2.స్వీయ చిత్రికలతో బంధించినా
కానుకలు బహుమతులు అందించినా
హస్తసంతకాలనే సేకరించినా
సన్మానం సత్కారం సమకూర్చినా
అసంపూర్ణమెప్పటికీ మనోగతము
పంచినా  తరిగిపోదు ఆ భావము
వింతవింత సంగతులకు ఆలవాలము
ఎనలేనిది ఘనమైనది అభిమానము

Friday, December 21, 2018

ఎంత ప్రేమ కొలవలేనంత ప్రేమ
ఎంత ప్రేమ చెప్పరానంత ప్రేమ
ఒక్కచోటనే కుప్పబోసిన సృష్టిలొ ఉన్నంత ప్రేమ
కాలానికి రెండు కొసలదాక వ్యాపించి ఉన్నంత ప్రేమ
సుందరా నీవంటే ప్రేమెంతో ఉందిరా
సుందరా నీవెంటే నా ప్రేమంత ఉందిరా

1.దశరథ మహరాజు రాముణ్ణి ప్రేమించింది చిన్నగా
చిన్నిశిశువుపై యశోదమ్మకున్న ప్రేమకన్న మిన్నగా
బ్రతుకు మీద ఉన్న తీపికన్న మారుగా
పంచ ప్రాణాలూ నీవే అయిన తీరుగా
సుందరా నీవంటే ప్రేమెంతో ఉందిరా
సుందరా నీవెంటే నా ప్రేమంత ఉందిరా

2.లోకమంత ఒకవైపుపెట్టి తూచిన నీవైపె మొగ్గుగా
బంధాల ప్రేమలు మరుగౌనుగాని నా ప్రేమ అక్షయపాత్రగా
జన్మలు దాటి అల్లుకున్న ఆత్మబంధంగా
త్వమేవాహమై రూపుదిద్దుకున్న చందంగా
సుందరా నీవంటే ప్రేమెంతో ఉందిరా
సుందరా నీవెంటే నా ప్రేమంత ఉందిరా
https://www.4shared.com/s/fsKY_Sa1Rda
ఏదో కావాలి ఇంకేదో పొందాలి
తెలియని అది ఏదో తెలుసుకో గలగాలి
తెలుసుకొన్న పిదప మదిసేద తీరాలి

1.తెలుసుకొన్న కొలది
తెలివి పెరుగుతున్నది
తెలివి తెచ్చుకొన్నకొలది
తెలసిందే లేదని తోస్తోంది

2.ఆటలు పాటలు చదువులు
పోటీలు గలాటలు పదవులు
యంత్రాలుగ మార్చుతున్న కొలువులు
ప్రేమలు పెళ్ళిళ్ళు సుడులకు నెలవులు

3.దాహం పెంచుతున్న కోరికలు
మోహం ముంచుతున్న జీవికలు
అహమై చెలరేగుతున్న ఏలికలు
విశ్వరచన ముందు పిపీలికలు

4.అంతర్ముఖంగా చూడాలి
చింతపైన చింతననే వీడాలి
ఎంతమందిలో ఉన్నా ఏకాంతులమవ్వాలి
మన మనముతో మనమెప్పుడు గడపాలి

Thursday, December 13, 2018

కళ్యాణి రేవతి మధ్యమావతి
ఏరాగమైతేమి నీ దివ్యగీతి
మోహనము  వలజి తోడి
నిన్ను గానాభిషేకాల కొలిచి
తరియించెదము  మారుతి
నీ ధ్యానమున మేనుమరచి

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

1.మా భాగ్యనగరాన దయ మీరుపేటన
సుఖశాంతులకు తావైన ప్రశాంతి మలన
నెలకొని యున్నావు కనికరముతోడ
పిలిచినంతనే బదులు పలికేటి వాడ

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

2.ఉరుకుపరుగుల జరుగు మా జీవితాన
పాపపుణ్యము మరచు ప్రజల పక్షాన
కల్పవృక్షమువోలె  మమ్మాదుకుంటావు
అభయహస్తముతోడ కాపాడుతుంటావు

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి

3.నోములు వ్రతములకు తావు నీకోవెల
పండుగలు పర్వాల నెలవు నీ సన్నిధి
భక్తి తత్వము మాలొ ఉప్పొంగునట్లుగా
ఆయత్తపరచుము అనుదినము మమ్ము

అభయాంజనేయా శుభ హారతి
ప్రసన్నాంజనేయా ప్రియ హారతి
వీరాంజనేయా జయ హారతి
భక్తాంజనేయా మంగళ హారతి
వేదనా బాధలూ అనాధలు
ఎవరైనాఏవగించుకొనే గాధలు
నేనాదరించుతానని-అక్కునజేర్చుకుంటానని
నా పంచన చేరాయి-ప్రపంచమింక మించి
నన్నల్లుకపోయాయి-నా ప్రేమనాశించి

1.తానుకూడ దూరింది దురదృష్టము
తోడువీడలేకుంది అనారోగ్యము
కన్నీటి వానలతో ఇల్లంతా వరదలు
విధిరేపే జ్వాలలతో గుండెల్లో మంటలు
అగ్ని నీరు చిత్రంగా నా కడనేస్తాలు
పరస్పర ప్రేరణతో ఇనుమడించు కష్టాలు

2.జన్మహక్కు తనదంటూ ఆక్రమించె దరిద్రము
ప్రతిపనిలో తలదూర్చకమానదు అవమానము
ప్రయత్నాన్ని పరిహసించు ఆదిలోనె అపజయము
అనునిత్యం తలుపుతట్టు అలసిపోక పిరికి తనము
బెదిరిపోదు చెదిరిపోదు బ్రతుకు పట్ల నమ్మకము
ఏశక్తీ హరియించదు చిరంజీవి ఆనందము-నా ఆనందము

తరగని గని నీ అందం
ఆమని వని అలరారు చందం
విరిసిన విరి మకరందం
వలపన్నును వలపుల బంధం

1.కోయిల  ఇల గానపు వైనమై
చిలుకల కల తెలిపే చిత్రమై
పురివిప్పిన మయూరి నృత్యమై
కలహంసల కదలికల కల వయారమై
ఎదన దించినావే మదన శరములు
కలను చెలగు మరువని కలవరములు

2.నీ మేను  హరివిల్లుకు ఈర్ష్యగా
నీ హొయలే ఖజురహో మార్గదర్శిగా
నీ కన్నులు వెన్నెల పుట్టిల్లుగా
నీ నవ్వులు ముత్యాల విలాసంగా
ఇంద్రజాలమే చేసి బంధించుతావు
చంద్రతాపమే రేపి పొందీయరావు

Tuesday, December 11, 2018


రచన:గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)-9849693324

సార్థక నామధేయ-చంద్రశేఖర రాయ
కలువకుంట్ల చంద్ర శేఖర రాయ
తెలంగాణ రాష్ట్ర సాధకా-తెలంగాణ ప్రగతి రథ చోదకా
'భారత రాష్ట్ర సమితి' నిర్దేశకా
భావి భారత దేశ ఆదర్శ ఏలికా
జయహో జయహో జయ జయ జయహో

1.నీ తల'పుల జీవగంగ-దేశమంత పారంగ
నేల సస్యశ్యామలంగ-దాహార్తీ తీర్చంగ
మార్చితీరుతుంది-మహిని సుభిక్షంగా
జయహో జయహో జయ జయ జయహో

2.మనసంతా భోళాగా-చూపులు వెన్నెలగా
నవ్వడం ఇవ్వడం నీకు భూషణాలుగా
నిరంతరం నీధ్యానం -జన శ్రేయమే కాగా
జయహో జయహో జయ జయ జయహో

3.జగతికి సుధ పంచనెంచి-గరళమంత నువు మ్రింగి
బయలుదేరినావు-ప్రమధ గణాల స'హితంగా
త్రిపురాసుర హరుడిగా-భరతావని మెచ్చే నరుడిగా-అపురూప నరుడిగా
జయహో జయహో జయ జయ జయహో

Monday, December 3, 2018

గెలుపుకు తొలి రూపమే సడలని సంకల్పము
నెగ్గుటకై వెన్నుతట్టు నేస్తమే ప్రయత్నము
విజయానికి మార్గదర్శి చెదరని విశ్వాసము
సాధన ఓపిక నెరవేర్చును లక్ష్యము
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం

1.స్వాతంత్ర్యోద్యమమే చరిత్రలో నిదర్శనం
తెలంగాణ సాకారమె చక్కని తార్కాణము
దెబ్బతినీ కోలుకున్న జపాన్ దేశ మెక ప్రతీక
మనుగడకై పోరాటమె బ్రతుకుల్లో వెలుగు రేఖ
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం

2.థామస్ ఆల్వా ఎడిసన్ విధానమే ఉదాహరణ
అబ్దుల్ కలాం ఒడుదుడుకుల పయనమే నిరూపణ
స్టీఫెన్ హాకింగ్ లోని తపనయె ఆదర్శము
పివి నరసింహరావు రీతియె ప్రామాణ్యము
ఇది గీతాగోవిందం ఇదె జీవిత మకరందం
https://www.4shared.com/s/f80y3CoAigm
ఆనంద నిలయం మహదానంద నిలయం
జీవిత చరమాంకాన సేదదీర్చు సదనం
అనురాగం నోచని అనాథ బాలలను
అక్కునజేర్చుకొనే అమ్మ హృదయం
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం

1.కో అంటే కో అనే కొమురవెల్లి మల్లన్న కనుసన్నలలో
ఋషులు సత్పురుషులు నడయాడిన పునీత నేలలో
సిద్ధులూ సాధ్యులూ తిరుగాడిన పుణ్యభూమిలో
వెలసింది వైకుంఠధామం నెలకొంది భూలోక స్వర్గం
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం

2.పచ్చదనం స్వచ్ఛదనం ప్రకృతి'రమణీ'యం కనువిందుగా
ఆరోగ్యకారకం ఆహ్లాదదాయకం మదికే పసందుగా
ఇంటికన్న పదిలంగా వసతులు సౌకర్యంగా అలరారుతున్నది
వేంకట రమణుని కోవెల పెన్నిధిగా పారమార్థికమ్మైనది
వృద్ధుల గుడిగా చదువుల బడిగా
మమతల ఒడిగా ఆదరించు ఆశ్రమం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సుందరేశ్వరా నీ మందహాస వదనమే
ఆనంద సదనము
చంద్రశేఖరా నీ నర్తిత పాదాలకిదే
వందనము అభివందనము
ఓం నమఃశివాయ నమో నమఃశివాయ

1.జటాఝూట గంగాధర ఫాలనేత్ర పురహర
నీకు నమోవాకము
నీలకంఠ ఫణిభూషణ చితాభస్మ ధర శరీర
నీకు నా ప్రణామము

2. శూలపాణి చర్మధారి గౌరీ మనోవిహారి
నీకిదె అభివాదము
దీనపాల భక్త పోష దీర్ఘ రోగ పరిహారి
నీకు నమస్కారము

https://www.4shared.com/s/feIKxC4LOda

Friday, November 30, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మిథ్యా జగత్తులో నిత్య సత్యము నీవు
అగమ్య గోచరాన పరంజ్యోతివి నీవు
ఇహపర సాధకమౌ బ్రహ్మత్వము నీవు
స్థితప్రజ్ఞ సంస్థితమౌ అస్తిత్వము నీవు
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

1.పురంధర దాసుని పుణ్యమే పుణ్యమయా
అన్నమయ్య భాగ్యమేమొ చెప్పనలవి కాదయా
త్యాగరాజు శ్యామశాస్త్రి తరియించినారయా
ముత్తుస్వామి దీక్షితులు నీ సేవలొ మునిగిరయా
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

2.భవబంధాల నుండి విడుదల చేయవయా
భవసాగరమీదగా సత్తువ నొసగవయా
భవతారక మంత్రమై నాలోన చెలగవయా
అనుభవైకవేద్యమై నను కడతేర్చవయా
తిరుమలగిరిరాయా శరణుశరణుశరణమయా
అష్టాక్షరి దివ్యనామ ఓంనమో నారాయణాయ

https://www.4shared.com/s/fMof2IgCkda

Sunday, November 25, 2018

ఎంత హాయిగొలుపుతుంది అమ్మ ఒడి
ఎంత కమ్మనైనదీ నాన్న కౌగిలి
అంతులేని అనురాగం అమ్మ చెంతన
చింతలేని ధైర్యమెంతొ నాన్న కౌగిలింతన
తిరిగిరాని బాల్యంలో తీపి గురుతులే అవి
కరుగుతున్న కాలంలో మధురానుభూతులవి

కొసరి కొసరి నాకు మీగడ పెరుగేసి
పలుచనైన చల్లనే అమ్మ పోసుకునేది
పండుగల్లొ కొత్తబట్టలు నాకు కుట్టించి
ఉన్నవాటితో నాన్న సరిపెట్టుకొనేది
నాసంతోషం కోసమెంత త్యాగం చేసారో
నా సౌఖ్యాల కొరకె బ్రతుకు ధారపోసారు

నన్ను నిద్ర పుచ్చుతూ ఎంతసేపు మేల్కొనేదొ
నా అల్లరి భరియిస్తూ అమ్మ ఎంత అలసేదో
నా ముచ్చట నెరవేర్చగ ఎంత ఖర్చుచేసాడో
నా చదువులకైతె నాన్న శ్రమనెంత ఓర్చాడో
ఏమి చేసినా తీరదు కన్నతల్లితండ్రి ఋణం
మలిసంధ్యలొ చేరదీసి సేవచేయి అనుక్షణం 

https://www.4shared.com/s/fhbDIeKTJgm

Saturday, November 24, 2018

అందనంత ఎత్తులో
అందమైన నేస్తము
మాటలే కరువాయె
తెలుపగ ప్రాశస్త్యము

1.విశ్వకర్మ విస్తుపోయె చిత్రకారిణి
మయబ్రహ్మ చకితుడయే రూపశిల్పిణి
తుంబురుడే తలవంచు గాయనీమణి
భారతి వరమందిన రచనాగ్రణి

2.అందానికి రతీదేవి
అపర పార్వతీదేవి
మనసైన స్నేహశీలి
ఎప్పటికీ నా నెచ్చెలి

3.అపురూపమే రూప
కళలకు కనుపాప
పూర్వపుణ్య కానుక
తన చెలిమొక వేడుక
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

వజ్రఖచిత మకుటము-నిండునిలువు నామము
కృపాకటాక్ష వీక్షణము-మందస్మిత వదనము
సుందరాకార నిన్ను వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

తిరుమలేశ గోవిందా వేంకటేశ గోవిందా
శ్రీనివాస గోవిందా పాపనాశ గోవిందా

1.శంఖచక్ర హస్త భూషితా!
వైజయంతీ మాలాలంకృతా!
శ్రీనివాస హృదయ శోభితా
అభయ ముద్ర హస్తాన్వితా

సుందరాకార నిన్ను  వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

2.తులసీదళ వనమాలీ! పీతాంబర ధారీ!
రత్నకాంచనా భరణ రాజిత మురారి!
భక్త సులభ వరదా భవహర శౌరీ!
భవ్యపద్మ పాదయుగ్మ -శ్రిత శరణాగత శ్రీహరీ!

సుందరాకార నిన్ను -వర్ణించగ ఎవరి తరము
గోవిందనామ ప్రియ అందుకోర వందనము

https://www.4shared.com/s/ffK6ntrL3da
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మనమన్నది కాదనితోసేస్తూ-తామన్నదె సరియని వాదిస్తూ
తిరకాసుల మెలికెలువేస్తూ-తికమకలే మరి కల్పిస్తూ
తమ భావం మనతో పలికిస్తూ-జవదాటని భ్రమ సృష్టిస్తూ
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

1.సింగారించు చీరలు మనకోసమే నంటూ
అలంకరణ సాధనాలు మన మెప్పుకేనంటూ
ప్రతికొట్టుకు తిప్పుతూ డ్రైవరుగా మారుస్తారు
బేరమాడి మేల్చేసామని డబ్బంతా గుంజుతారు
పిల్లలనాడించమంటూ హుకుం జారి చేస్తారు
బరువుమోయలేమంటూ బ్యాగులెన్నొ మోపిస్తారు
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

2.కాస్త రిలాక్సౌతుంటే కూరలన్ని తరిగిస్తారు
వంటబాగ చేస్తారంటూ చాకిరెంతొ చేపిస్తారు
చుట్టాలొస్తారంటూ ఇల్లు సర్దిపిస్తారు
ఉన్నఫళంగా తెమ్మంటూ సరకుల లిస్టిస్తారు
మీవైపు వాళ్ళేనంటూ చూపొకటి విసిరేస్తారు
మీ అత్తామామలె అంటూ టెక్నిగ్గా బుక్చేస్తారు
ఇంతింత కాదయా ఇల్లాలి లీలలు
ఇలలోని పతులంతా తోలుబొమ్మలు,కీలుబొమ్మలు

https://www.4shared.com/s/fTNo8TGiUda

Wednesday, November 21, 2018

రచన.స్వరకల్పన&గానం:రాఖీ

నీ పాదాల్లో పుడతాయి నదీనదాలు
నీ పలుకుల్లో ఒలుకుతాయి నాల్గు వేదాలు
నీ కరుణతొ మనగలుగుతాయి జీవజంతుజాలాలు
నీ ఆజ్ఞతొ తిరుగుతాయి విశ్వాంతర గోళాలు
సాయి నీవు సాక్షాత్తూ పరమాత్మవే
నాలోనూ వెలుగొందు జీవాత్మవే

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

1.నీ కను సన్నలతో ఋతువులు కాలాలు
నీ దయాభిక్షతోనె చావులు పుట్టుకలు
ఊపిరిలో ఊపిరివై చైతన్యం నింపేవు
మనసులో మసలుతూ భావుకతను వొంపేవు
సాయి నీవు జగత్తుకే పరంజ్యోతివి
నాలో తిమిరాలు బాపు జ్ఞానజ్యోతివి

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

2.రాగద్వేషాలు నీ మాయా విశేషాలు
భవబంధాలు నీ జగన్నాటకాలు
ప్రలోభాల పొరలుగప్పి మమ్ము పరీక్షస్తావు
మర్మమెరుగునంతలోనె మరపులోకి తోస్తావు
అలసినాను ఆటలాపు ఓ సూత్రధారీ
శరణాగతి నీవయ్య నా మానస విహారీ

సాయిరాం శ్రీ సాయిరాం సాయిరాం షిర్డీ సాయిరాం
సాయీరాం ఓం సాయిరాం సాయిరాం జయజయ సాయిరాం

https://www.4shared.com/s/fBXxSJI_lda

Tuesday, November 20, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మనసా వాచా కర్మణా-
నిను నమ్మితిరా గిరిజారమణా
నిన్నా నేడూ రేపూ-
నీవే దిక్కురా కరుణా భరణా
ఏలమానినావురా అవధరిండం
నీకు కొత్త కాదురా కనికరించడం

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

1.చిన్ననాటినుండి నీవెన్ని కథలు విన్నానో
నీవరాలు పొందిన వారి వార్త లెరిగానో
పురాణాలు స్థలమహత్మ్యా లెన్ని తెలుసుకున్నానో
పంచాక్షరి జప మహిమల నాలకించియన్నానో
అనుభవానికేలరావు భవానీ ప్రియ పతి
తాత్సారమేలనయ్య నీ తనయుడె విఘ్నపతి

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

2. కాళేశ్వర ముక్తీశ్వర దర్శనమే నేగొంటి
కాళహస్తీశ్వరుణ్ణి కనులారా కనుగొంటి
శ్రీశైల మల్లన్న శిఖరమునే చేరుకొంటి
వేములాడ రాజన్న లింగమునే అంటుకొంటి
కాశీ విశ్వనాథ హారతులే నే కంటి
ధర్మపురీ రామలింగ ఇకనైన దయగను ముక్కంటి

మార్కండేయ పోష ఈశ్వరా
శిరియాళ ప్రాణరక్షా పరీక్ష'నా'పరా

https://www.4shared.com/s/f63WF3wbrgm
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కనులు కనులు కలపకున్నా
పెదవులసలేం పలకకున్నా
నా గుండెవిన్నది నీ హృదయ స్పందన
మనసు కనుగొన్నదీ ప్రణయ ఆరాధన

చేరలేనీ దూరమున్నా
కాలమే కరుణించకున్నా
తలపులకు తొలి వలపుసోకే
కలలు అలలై నిన్ను తాకే

నీది నాదీ ఒకే భాష
లలిత కళలే మనకు శ్వాస
కుంచె దించే అపురూప మీవు 
కలము వెలయించు కవితనేను

https://www.4shared.com/s/fwSGbelougm

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నా ఊహకు రూపం నీవే
నా ఆశల దీపం నీవే
నా కలలకు సాక్ష్యం నీవే
నా జీవిత లక్ష్యం నీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

1.నా కవితల కల్పన నీవే
నా గానపు మధురిమ నీవే
నా చిత్రపు ఆకృతి నీవే
నా భవితకు అతీగతి నీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

2. నా  గుండెకు సవ్వడి నీవే
నా బ్రతుకున ఊపిరి నీవే
నా మనసున దేవత నీవే
ఏడేడు జన్మల జతవీవే

చెలీ నీవేలే నా లోకం
ప్రియా నీ వలపే ఓ మైకం

https://www.4shared.com/s/fQMaraYadfi

Saturday, November 10, 2018

రచన:రాఖీ

మల్లెవిరిసె వేళ ఇది –కన్నెమురిసె కాలమిది
ఎదలు కలిసె తరుణమిది
ఇదే ఇదే వసంతము-మరులొలికే కాలము

1.మావి చివురు వేసేది పికము కోసమే
చెలియ మురిసి వేచేది ప్రియుని కోసమే
పికము కొసరి కోరేది చివురు మాత్రమే
ప్రియుడు చేయి సాచేది ప్రేమ యాత్రకే

2.మధురిమల మల్లియ మధువు గ్రోలు మధుపం
మనసిచ్చిన చెలియ వలపుకోరు ప్రియుడు
అనురాగ జగానికి ఎదురులేని ఏలికలు
ప్రేమమందిరాన వారే ఆరాధ్య దేవతలు

Tuesday, November 6, 2018



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పెదవుల దివ్వెలపై నవ్వులు దీపిస్తే దీపావళి
కన్నుల ప్రమిదలలో వెన్నెలలే పూస్తే దీపావళి
అగమ్యగోచరమౌ జీవితాన జ్ఞానజ్యోతి వెలిగిస్తే దీపావళి
ప్రతి బ్రతుకున ఆనందం వెల్లివిరియ దీపావళి
దీపావళి నిత్య దీపావళి-దీపావళి విశ్వ దీపావళి

1.ఆకలి చీకటి తొలగించే కంచమందు అన్నమే అసలు 'రుచి'
అంధులకిల దారి చూపు చేతి ఊతకర్ర రవిని మించి
మిరుమిట్ల కాంతులు దద్దరిల్లు ధ్వనులు అంతేనా దీపావళి
అంబరాల సంబరాలు విందులు వినోదాల వింతేనా దీపావళి
ఒక్కనాడు జరుపుకుంటె అదికాదు దీపావళి
ప్రతిరోజూ పండగే సంతోషం నిండిన జీవన సరళి

2.సుదతులంత సత్యలై నరకుల దునిమితే దీపావళి
సిరులొలికే ధనలక్ష్మి జనుల ఎడల హాయికురియ దీపావళి
పాడీపంటలతో పిల్లాపాపలతో  శోభిస్తే దీపావళి
చదువు సంధ్యలతో పరువు సంస్కృతితో విలసిల్లితె దీపావళి
ఒక్కనాడు జరుపుకుంటె అదికాదు దీపావళి
ప్రతిరోజూ పండగే సంతోషం నిండిన జీవన సరళి

https://www.4shared.com/s/fALbrLmoUfi

Monday, October 29, 2018

కన్నుల ఆనందం
మదివిరిసెను పూగంధం
పెదవుల దరహాసం
నా బ్రతుకున మధుమాసం
రాధవే రసగాధవే మధురానుభూతివి నీవే
మాధవా ప్రియ బాంధవా సుధలందుకోగ రావా

1.కళ్ళలోని కాంతులు
చెంపల్లోని కెంపులు
ఇంపైన నీ వంపులు నా వే లే

గుండెలోని తలపులు
గొంతులోని పిలుపులు
ఒంటిలోని మెరుపులు నీ వే లే

2.చిన్న చిన్న ఆశలు
చిన్ననాటి బాసలు
చిన్నదాని అన్ని ఊసులు నీవేలే

నా పంచ ప్రాణాలు
నా ప్రేమ గానాలు
అందాల నందనాలు నీవేలె

Thursday, October 25, 2018


పదరాపోదాం కలల పడవనే ఎక్కి ఆనంద తీరాలకూ
తావేలేదు ఆ నందనవని లో ఏఘోరాలకూ ఏనేరాలకూ

1.మన ప్రమేయమేలేక మన విధానమేకాక బలియౌతున్నాము
పరోక్షంగ కారణమై వికాసమే ఓ తృణమై మనుగడ కోల్పోతున్నాము
ఎదిరించలేకా భరియించలేకా సతమతమౌతున్నాము గతిగానకున్నాము

పదరాపోదాం కలల హంసనే ఎక్కి ఆనంద గగనాలకూ
తావేలేదు ఆ రోదసిదరి లో ఏ కల్మషాలకూ అనారోగ్యాలకూ

2.గతమంత మరిచి వెతలన్ని విడిచి సుఖ నిద్ర పోవాలిరా
రేపటిదిగులువీడి ఆశల జట్టుకట్టి  ఊహల్లొ తేలాలిరా
తెల్లారితేచాలు అగచాట్లువేలు ఈరేయి మనదేనురా ఇక హాయి నొందాలిరా

పదరా పోదాం కలల పల్లకీ ఎక్కీ ఆనంద లోకాలకు
తావేలేదు ఆ సుందర దివిలో ఏ బాధలకూ ఏశోకాలకు

Saturday, October 20, 2018

బురదలోనె పుట్టినా మకిలి అంటనీయదని
పరిమళమే లేకున్నా  పునీతగా ఉంటుందని
కళ్ళకద్దుకొన్నాము ఒంటిగా కమలాన్ని
నెత్తినెట్టి కొలిచాము దైవమంటు అబ్జాన్ని
జన నమ్మిక వమ్ముచేయనది యే వి ధా న మో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటె ప్ర ధా న మో..

1.మానలేని రోగాలకు చేదు మాత్ర మింగించి
కుంటుకుంటు నడుస్తుంటె రెండుకాళ్ళు విరిచేసి
ఉన్నదేదొ తినబోతే నోరుకాస్త కుట్టేసి
దాచుకున్న సొమ్మంతా దయ్యంలా మాయచేసి
లోకమంత తిరుగుతూ ఇంటి ధ్యాస మరిచేసి
లాభమేంటి కచ్చేరికై గొప్పలెన్నొకోసి
కొండంత రాగంతీసి పల్లవితో వదిలేసీ
జన నమ్మిక వమ్ముచేయనది యే విధా'నమో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటే ప్రధా'నమో..

2.తాతల నేతుల ఘనతను జాతిపట్ల పంచి
అవినీతి అంటుకొన్న చేతిని కడిగేయనెంచి
ఏ అతుకులబొంతైనా చింతేయని భావించి
అతులిత ప్రతిభను గతచరితనగాంచి
పదవుల అందలాల అవలీలగ ఎక్కించి
కొందరికేకొమ్ముకాచి సామాన్యుల విదిల్చి
జన నమ్మిక వమ్ముచేయనది యే విధా'నమో
ప్రగతిలేక నీతిగా జాతి మనుటే ప్రధా'నమో..

3.భావి భవనమేమొ గాని బ్రతకు బజార్ పాల్జేస్తే
పన్నుకట్టి దున్నెద్దును అదే పనిగ పొడుస్తుంటె
సగటుజీవి సొంతసొమ్ము నందని ద్రాక్షగజేస్తే
పెద్దలింక పెద్దలై పేదలు నిరుపేదలైతె
రద్దుల పద్దులెగాని ఫలితాలు వ్యర్థమైతె
అంతర్జాలమాయలో వికాసంనల్లపూసైతే
దిక్కులేక ఆముదమె  వృక్షంగా తలపోస్తే
ఓటు తెలుపు గుణపాఠం చరితే పునరావృతం
మేలుకొనిన మేలుగలుగు చేసుకోగ ప్రాయశ్చిత్తం

Thursday, October 18, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సమాధి సైతం మాట్లాడుతుంది
చిత్రపటమైనా సరె బదులిస్తుంది
ధునిలో విభూతి ఐశ్వర్యమిస్తుంది..
ఆరోగ్యమిస్తుంది
ద్వారకమయితాను మనశ్శాంతి నిస్తుంది..
సంతృప్తి నిస్తుంది

సాయి రూపదర్శనం పరవశ నిదర్శనం
సాయినామ భజనం భవతాప భంజనం
వర్ణనాతీతము సాయి లీలామృతము
మానవసేవయే సాయీసేవగా తరించు జీవితము

1.ఇటుకను గురువుగా భావించిన వైనము
 సకల చరాచరజగత్తు దైవమే అను తత్వము
 ఖండయోగ సాధనలో సాయి అంతరార్థము
 ఆత్మను దేహమును వేరుపరచు  బోధనము
 వర్ణనాతీతము సాయి లీలామృతము
 మానవసేవయే సాయీసేవగా తరించు జీవితము

2.ప్రతిగ్రామము నగరము ఆ షిరిడీ సరిసమము
జంతు జీవ జాలమంత బాబా ప్రతి బింబము
చేయబడెడి కర్మలన్ని సాయి ప్రేరితమ్ములే
ప్రతిఫలమేదైన మానె సాయి ప్రసాదించినదే
వర్ణనాతీతము సాయి లీలామృతము
మానవసేవయే సాయీసేవగా తరించు జీవితము

https://www.4shared.com/s/fG5dXka6Pfi

Tuesday, October 16, 2018

శ్రావణమాసాన శ్రేష్టము
శ్రీ లక్ష్మీ శ్రీగౌరి అర్చనము
నిత్యజీవితాన ఎంతొ ప్రాశస్త్యము
గృహలక్ష్మిని ఆదరించు సంస్కారము

అడిగితె వరమిచ్చును అమ్మవారు
విడువక సేవించును  ఇల్లాలు

1.లోకానికంతటికీ వరలక్ష్మి
సౌభాగ్యమొసగుతుంది పూజలంది
పతియును సంతతియే లోకంగా
భావించును ఇంతి ఎంతొ సంతసమొంది
చిరునవ్వుల సిరులు పంచుతుంది
అన్నపూర్ణగా ఆకలి తీర్చుతుంది

అడిగితె వరమిచ్చును అమ్మవారు
విడువక సేవించును  ఇల్లాలు

2.సేవించిన పలుకుతుంది మంగళగౌరి
కంటికి రెప్పలా కాపాడుతుంది
సేవయే బాధ్యతగా తలపోయును కులనారి
కాపురాన్ని నడుపుతుంది చూపు తానుగామారి
కర్పూరము తానై కరుగుతుంది
ఇంటికి హారతిగా వెలుగుతుంది

అడిగితె వరమిచ్చును అమ్మవారు
విడువక సేవించును  ఇల్లాలు

Friday, October 12, 2018

మాతా మహాశక్తి జయహో-కరినగర వరదాతా మహాశక్తి జయహో

మంగళ హారతి గొనవే- మహాశక్తి మాతా
మనోరథపు సారథి నీవే-జై త్రిశక్తి దాతా
అర్థము శాస్త్రము శస్త్రము నీవే- భాగ్యము జ్ఞానము విజయము నీవే
మాతా మహాశక్తి జయహో-వరదాతా మహాశక్తి జయహో

1.కూటికి లేనివాడిని కూడ కోటికి అధిపతి జేసే లక్ష్మీ
కరుణిస్తే సరి కనకధారలే కురిపించేటి మాతా శ్రీ సిరి
          అర్థము శాస్త్రము శస్త్రము నీవే- భాగ్యము జ్ఞానము విజయము నీవే
           మాతా మహాశక్తి జయహో-వరదాతా మహాశక్తి జయహో

2.కాళిదాసుకు కవితలు కూర్చిన అమ్మా భారతీ
త్యాగరాజుకు గళమున నిలిచిన మాతా సరస్వతి
          అర్థము శాస్త్రము శస్త్రము నీవే- భాగ్యము జ్ఞానము విజయము నీవే
          మాతా మహాశక్తి జయహో-వరదాతా మహాశక్తి జయహో

3.రామకృష్ణుడికి దర్శనమిచ్చిన కాళికాదేవి జనని
ఛత్రపతి రాజు శివాజికి ఖడ్గమొసగిన దేవీ భవాని
          అర్థము శాస్త్రము శస్త్రము నీవే- భాగ్యము జ్ఞానము విజయము నీవే
          మాతా మహాశక్తి జయహో-వరదాతా మహాశక్తి జయహో
మహాలక్ష్మి కరుణించరావే-మాపూజలే అందుకోవే
ప్రతివారము నిన్ను దర్శించుకొంటాము
ప్రతి క్షణము నిన్నే స్మరియించు చుంటాము

అమ్మలగన్న అమ్మవు నీవే మమ్ముల గన్న అమ్మవు నీవే
నీ పిల్లలపై దయలేదా- నీ భక్తులపై కృపరాదా
ఆదిశక్తి వీవే మహా శక్తివీవే- మహా కాళి వీవే శార్వాణివే
ముంబాయి నగరిన వెలసిన తల్లీ ఉమాదేవి నీవే మహాలక్ష్మినీవే

క్షీరసముద్రుని పుత్రికవీవే- మా నరసింహుని పత్నివి నీవే
వేంకటేశ్వరుని మంగవు నీవే-సిరులనొసగే ధనలక్ష్మివే

ఓంకార సంభవి నీవే అయితే
శ్రీకారమే నీ రూపమైతే
మాకోరికలే తీర్చవే మామిదిలో నిలువవే
అమ్మా మహాలక్ష్మీ-అమ్మా ఆది లక్ష్మీ
అమ్మా అష్టలక్ష్మీ- అమ్మా కనక మహాలక్ష్మీ
దేవీ శ్రీ దేవీ మంగళ హారతి గైకొనుమా
మము కావగ రావేమీ-మము బ్రోవగ రావేమీ

నీ భజనలు చేసి-నిన్నే పూజించి
నీకు హారతులిచ్చి-నిన్నే కొలిచెదము
మాపై దయలేదా మాపై దయ రాదా
మము కావగ రావేమీ-మము బ్రోవగ రావేమీ

నరసింహుని సతివై మాపురమున వెలసితివి
మాకు సిరులే ఇచ్చీ మమ్మే రక్షించుమా
నిన్నే వేడెదము-నీకై వేచెదము
మము కావగ రావేమీ-మము బ్రోవగ రావేమీ

Wednesday, October 10, 2018

జయము నీవే జగన్మాత
వరములీయవె శ్రీ లలిత
కరుణజూడవె కామరూప
వెతలు బాపవె విశ్వజేత

1.ఆదిమధ్యయుఅంత్యమీవె
సత్య శివ సుందరియునీవే
సత్వరజస్తమో తత్వమీవే
సృష్టిస్థితిలయ కర్తవీవె
కరుణజూడవె కామరూప
వెతలు బాపవె విశ్వజేత

2.ఓంకార నాదమీవె
హ్రీంకార రూపమీవే
శ్రీంకార మూలమీవే
యంత్రమంత్రతంత్రమీవే
కరుణజూడవె కామరూప
వెతలు బాపవె విశ్వజేత

3.ఇచ్ఛాశక్తివి నీవె నీవె
జ్ఞాన శక్తివి నీవె నీవే
క్రియాశక్తివి నీవె నీవె
కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలినివీవే
కరుణజూడవె కామరూప
వెతలు బాపవె విశ్వజేత

https://www.4shared.com/s/fGM326Q1wee


Tuesday, October 9, 2018

మరణిస్తేమాత్రమేమి షిరిడీ దర్శించి
తనువుచాలిస్తెనేమి సాయి పాదం స్పర్శించి
జన్మలెన్నెత్తితేమి సాయిచూపు సోకగా
యాతన భరియిస్తె నేమి బాబా కైతపించగా
సద్గురునాథా సాయిరాం
సచ్చిదానందా పాహిమాం

1.రెండురూకలిస్తెనేమి సాయికీ
శ్రద్ధా సహనములవి ఏనాటికీ
ఏకాదశబోధలు ఆచరించు హాయికీ
జడవనే జడవము బ్రతుకు మాయకీ
బ్రహ్మాండనాయకా సాయిరాం
యోగిరాజ పరబ్రహ్మ పాహిమాం

2.భేదభావమేది లేదు సాయికీ
ప్రేమ పంచమన్నాడు ప్రతిజీవికీ
ఉన్నంతలొ కొంతైనా చేసిచూడు వితరణ
పొందగలవు అంతులేని శ్రీ సాయికరుణ
ద్వారకామయివాస సాయిరాం
సబ్ కామాలిక్ తూహై పాహిమాం

Sunday, October 7, 2018

ఓ ఓంకారేశ్వరా శివా
ఓ లయకార ఈశ్వరా భవా
కామదహన అజ్ఞాన హనన
గౌరీ రమణ కరుణాభరణా
ఆదియు అంత్యము నీవేనయ్యా
నాహితునిగ నెరనమ్మితినయ్యా

1.నాసేవలు గొన జనియించితివి
నేతరించగ అవతరించితివి
ఋణము తీర్చగ కొమరుడవైతివి
ఓర్పును నేర్పగ ఇడుములనిడితివి
ఎరుగజాలనూ నీ జాలమును
తాళజాలనూ నీ మాయలను
దయగని వేగమె ఉద్ధరించరా
భవ సాగరమును దాటించరా

2.అలసినాను నే బ్రతుకు పోరులో
చితికినాను ఈ ముళ్ళదారిలో
నువు తలచుకొంటె సవరించలేవా
నువు కనికరిస్తే భవితే పూదోవ
తట్టుకొనకనే నిను తిట్టినేమో
బెట్టువీడి నను చేపట్టు ప్రభో
నిర్లక్ష్యమేలా నా మొరలను సరి విన
గతిలేదు రుజహర నాకిల నిను వినా


Wednesday, October 3, 2018

https://youtu.be/spJ066nt6Fo?si=qgACaugXGoI0GJZC

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

శ్రద్ధా సహనము నీ బోధలు సాయీ
నీ అడుగుజాడల్లో మా బ్రతుకే హాయి
త్రికరణ శుద్ధిగా నిను నమ్మితిమోయి
త్రిగుణాతీతా విడవకు మా చేయి
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

1.నువు ధరియించిన చిరుగుల వస్త్రాలు
జీర్ణమయే కాయానికి తార్కాణాలు
నువు చూపిన జీవకారుణ్యాలు
'ఆత్మైక తత్వానికి' నిదర్శనాలు
దేహము పై మోహాన్ని వీడమన్నావు
సర్వులకూ రాగాన్ని పంచమన్నావు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

2.కులమతాల భూతాలను వదిలించావు
జన హితమును చేతలలో చూపించావు
ప్రతివారిని బంధువులా భావించావు
వేడగనే వేగిరంగ వేదనలే తీర్చావు
నీనామ స్మరణయే తారక మంత్రం
నీ జీవన సారమే గీతా మకరందం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

https://www.4shared.com/s/fQhiQ2tMMgm

Tuesday, October 2, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ


వెన్నెలొలుకు కన్నులున్న కన్నయ్యా
మా కన్నులా దయను కురియనీయవయ్యా
నిండార నీ రూపము వర్ణించగా
నీ నిజ దర్శనభాగ్యమే కలుగజేయవయ్యా
మోహన కృష్ణా మన్మోహన కృష్ణా
చిద్విలాస చిన్మయ విస్మయ కృష్ణా

అందమైన లోకమని అందురే
అందానికి అర్థమే నీవు కదా
జగమే మాయ అని అందురే
మాయనే నీచెంత మాయమవదా
మది పులకరించుగా నీ భావనలుదయించగా
అణువణున నీవై అగుపించరా నాకగుపించరా

వసుదేవుని దెంత పుణ్యము
పసిబాలునిగా నిను మోసె గదా
యశోదమ్మ  బ్రతుకె కడుధన్యము
బ్రహ్మకైన దొరకని లీలలెన్నొ చూసె కదా
నీపెదవుల ఒదగనైతి నే వేణువుగా
కనికరించి మననీయి నీపద రేణువుగా

https://www.4shared.com/s/fYkJ4-N2Oda

Friday, September 28, 2018

కొండాకోనా వెదికి వెదికి-గండశిలను గాలించి
గుండెలోని భావానికి-అందమైన రూపమిచ్చి
ఏడుకొండలమీద-నిలిపినాము భక్తిమీర
అండగా ఉంటావని-నమ్మినాము మనసారా
వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

1.వైకుంఠ దర్శనము -మాకు గగన కుసుమమని
వాసిగా తిరుమలలో -స్థిరవాసమున్నావు
రానుపోను దూరమయ్యే -కాలమింక భారమయ్యే
కల్మషాలు తొలగించి శుద్దిచేసి సిద్దపరిచాం
కనికరించి మాఎదలో సిరితొ కూడి ఉండరా

వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

2.మానవత నింపుకుంటాం-  అభిషేకపు పాలుగా
సుగుణాలు పెంచుకుంటాం-నీ పూజకు పూలుగా
నైవేద్యమిచ్చుకుంటాం-పండంటి జీవితాలను
కైంకర్య మొనరిస్తాం- రెప్పపాటు కాలమైననూ
హారతులేపడతాం-మా ఆత్మ జ్యోతులను
వమ్ము చేయబోకురా వేంకటేశ్వరా
మమ్ము మరువ బోకురా మా హృదయేశ్వరా

https://www.4shared.com/s/f1HLMQ3BKgm






రచన,బాణీ,వాణీ:రాఖీ
"జీవన యానం"

మౌనం దాల్చిన భావాలెన్నో
కన్నుల జారిన అశ్రువులెన్నో
తీరం చేరని స్వప్నాలెన్నో
కంచిని చూడని కథలెన్నెన్నో
నేస్తమా
పరిచయమెరుగని బాటసారులం
కలయిక తెలియని రైలు పట్టాలం

పయనం ఎక్కడ  మొదలయ్యిందో
గమ్యం ఎప్పుడు చేరరానుందో
దారంతా ఊహకు అందని మలుపులు ఎన్నో
దాహంతీర్చి అక్కునజేర్చే చలివేంద్రాలెన్నో
అలసటతీర్చి బాసటనిలిచే మజిలీలెన్నెన్నో
ఎందాక కలిసుంటామో ఏనాడు మరుగయ్యేమో
నేస్తమా
వాడనీకు మైత్రీ సుమం
వీడినా ఆరనీకు స్నేహదీపం

అనుభవాలను అనుక్షణం పంచుకుంటూ
అనుభూతులనే పరస్పరం నెమరేసుకొంటూ
నవ్వుల వెన్నెల  పూయిద్దాం అమాసనాడూ
ఆనందాలను తెగ పారిద్దాం ఎడారిలోను
రెప్పపాటు ఐతేనేం గొప్పనైనదీ జీవితం
నేస్తమా
సాగిపోని పాటగా ప్రయాణము
మిగిలిపోనీ స్మృతులే ఆసాంతము

https://www.4shared.com/s/fdrhnXriffi

Thursday, September 27, 2018

ఈ ఉదయం జగతికి శుభోదయం
ప్రతి హృదయానికి నవోదయం
భానుడు భాసిలు అరుణోదయం
ప్రకృతి రమణీయ హరితోదయం

పలకరింపుల మిత్రోదయం
చిత్రవిచిత్రాల చిత్రోదయం
పెదవుల విరిసే హసితోదయం
మనసుల మహదానందోదయం

అనుభవాల సంధాత్రోదయం
అనుభూతుల సంధానోదయం
వింతలు తెెలిసే ఉషోదయం
చింతలు మరచే రసోదయం
                  నవరసోదయం

మా ఇంటి బతుకమ్మ
మాకు బతుకీవమ్మ
తంగేడు పూవుల
బంగారు బతుకమ్మ
రంగారు బంగారు
భవిత మాకీవమ్మ

1.తెలంగాణ ఉనికికి
గురుతు నీవమ్మ
తెలంగాణ ప్రజలకు
ఊపిరివి నీవమ్మ
తొమ్మిది రోజులు
నెమ్మది పూజలు
ఆటలు పాటలు
అతివల సయ్యాటలు
సుద్దులు సద్దులు
సంస్కృతికి పద్దులు

2.గునుగు పూవులు
గుమ్మడీ పూవులు
బంతులు చామంతులు
తీరొక్క వర్ణాల
సుమకాంతులు
ఇంపైన ఆకృతులు
ఇంతులలంకృతులు
బృంద గానాల
వలయ సంగతులు
కనులకు విందిది
చెవుల పసందిది

Wednesday, September 26, 2018


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
(ఉదయ రవి చంద్రిక రాగంలో...)

మళ్ళీ ఒకసారీ ... బాబా నువు పుట్టాలి
లేండీ వనాన్ని మా ఎదల్లోన నాటాలి
కోల్పోయిన దయాగుణం మా తలుపు తట్టాలి
నీవల్ల జనమంతా ప్రేమబాట పట్టాలి
ఉదయించరా మా హృదయాల షిరిడీసాయీ
వెలయించారా మది మమతల ద్వారకమాయి

1.అడుగుకో గుడిని సాయి నీకు కట్టినాము
అనురాగం పునాదుల్లొ పాతిపెట్టినాము
ఘనముగా ఉత్సవాలు తలపెట్టినాము
మనుషులుగా ఎంతగానొ దిగజారినాము
ఉదయించరా మా హృదయాల షిరిడీసాయీ
వెలయించారా మది మమతల ద్వారకమాయి

2.చందాలకు దానాలకు కొదవనేలేదు
అవినీతి దందాలకు అదుపన్నదేలేదు
హారతులు అందలాలకు లోటేలేదు
మనుషుల్లో బంధాలకు చోటేలేదు
ఉదయించరా మా హృదయాల షిరిడీసాయీ
వెలయించారా మది మమతల ద్వారకమాయి

https://www.4shared.com/s/fu43rfewRgm


Tuesday, September 25, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సుఖించనీయవే సఖీ
నీపరిష్వంగ పంజరాన విహంగమై
రమించనీయవే చెలీ
నీ అనంగ రంగానా మయూరమై
తపించనీ అధరసుధలు గ్రోలగా భ్రమరమై
జపించనీ కపోల కిసలయాల కొసరు పికమునై

1.చెరిపేయనీ అంతరాల్ని చంద్రికాచకోరమై
చెలరేగనీ ఆదమరిచి శుకశారిక మిథునమై
మరిమరి మురియనీ శకుంతాల యుగళమై
రసజగమేలనీ పెనవేసీ నాగ ద్వయ చందమై

2.నెరవేరనీ కలలన్నీ సీతాకోక చిలుకలై
కొనసాగనీ జీవనాన్ని సరోవర మరాళమై
ముడివడనీ బంధాన్నీ చక్రవాక యుగ్మమై
తడవనీ తపనలనీ వర్షకారు చాతకమై

https://www.4shared.com/s/fhFk0jkxmgm

https://youtu.be/n-5pwABwdbA?si=nIRG_-xXnb0n0Uot


ప్రజల కొరకు పజల చేత ప్రజాపాలన
సాధ్యమైతీరుతుంది మన ఓటు వలన
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ

1.విశిష్ట ప్రజా స్వామ్య వాద దేశము మనది
ప్రపంచఖ్యాతినొందిన రాజ్యాంగము మనది
అంబేద్కర్ మహాశయుని మేధాశక్తితో
అవిరళంగ ప్రగతి బాట సాగుతున్నది
దేశపౌరులందరికీ పాలనలో సమభాగము
ఓటుహక్కు వాడుకతో కలిగిన సౌలభ్యము
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ

2.ఓటువిలువ మారిపోదు వ్యక్తి వ్యక్తికీ
ఓటు లొంగిపోనెపోదు ఏ దుష్టశక్తికీ
కులమతాలు మార్చలేవు అభిమతాలను
ప్రలోభాలు తార్చలేవు మనోగతాలను
జాతినిర్మాణమందు ఓటొక ఇటుక
ఆత్మాభిమానాన్ని పెట్టబోకు తనఖా
ఎనలేనిది కొనలేనిది ఓటుకున్నవిలువ
వినియోగించితీరు తగు ఏలిక గెలువ

Monday, September 24, 2018

రచన,స్వరకల్పన& గానం:రాఖీ

అతి సుందరం నీ వదనం
మతిపోగొట్టును అనుక్షణం
అప్సరసలకైనా విస్మయం
సృష్టికర్త  చూపిన పక్షపాతం

పొరబాటుగ భువికి పంపె ఆ దైవం
నను జేరగ కలిగె నాకు అదృష్టం

మాయలోన ముంచేవు
మిథ్యగతలపించేవు
ఇంద్రజాలమేదొచేసి
నాఎదనుకొల్లగొట్టావు

1.పురాణాలు వెదకినా
చరితలు శోధించినా
కనరాదు ఏచోట ఇంతటి సౌందర్యవతి
నీ అంతటి సౌందర్యవతి
ఊర్వశే కలతజెందు
వరూధినే ఈర్ష్యనొందు అపు'రూప లావణ్యవతి

మాయలోనముంచేవు
మిథ్యగతలపించేవు
ఇంద్రజాలమేదొచేసి
నాఎదనుకొల్లగొట్టావు

2.రవివర్మ గీయలేని చిత్రానివి
జక్కన్న చెక్కలేని శిల్పానివి
బాపు వడ్డాది కుంచెలు దించక తలవంచెనులే
కాళిదాసు శ్రీనాథ నాయికలను నీ అందం మించెనులే

మాయలోనముంచేవు
మిథ్యగతలపించేవు
ఇంద్రజాలమేదొచేసి
నాఎదనుకొల్లగొట్టావు

https://www.4shared.com/s/fOGEXMZfKgm

Thursday, September 20, 2018

రచన,స్వరకల్పన,గానం&శిల్పం:రాఖీ

ఆత్మవిశ్వాసమంటె నీవే
ఆటంకం తొలగించే దైవమీవే
ఏకాగ్రత మాలొపెంచె స్వామి నీవే
దృఢమైన సంకల్పం గెలుపునీవే

జైజైజైజై జైగణేశనీకు దండాలయ్యా
జైజైజైజై జైగణేశ మాకలలు పండించవయ్యా

1.నీ వాహనమేమో ఓ చిట్టి ఎలుక
ముల్లోకాలను చుట్టిరాగ వినాయకా
నీ విగ్రహమేమో భారీయే కనగా
పిడికెడంత మాగుండెన సర్దుకోర లంబోదర
సిద్ది బుద్ధి నీ సతులు చక్కదిద్దు మా మతులు
సద్బుద్ధిని ప్రసాదించు వాక్సిద్ది ననుగ్రహించు

జైజైజైజై జైగణేశనీకు దండాలయ్యా
జైజైజైజై జైగణేశ మాకలలు పండించవయ్యా

2.పాశము అంకుశమూ నీ ఆయుధములు కదా
మా మనసూ ఇంద్రియాలు నియంత్రించవయ్య సదా
నిశితమే నీకన్నులు విశాలమే నీ చెవులు
మా వినతులు పరికించు మా మొరలనాలించు
అణువణువున నీ రూపే అడుగడుగున నీతలపే
వదలము నిను వక్రతుండ దరిజేర్చర ఏకదంత

జైజైజైజై జైగణేశనీకు దండాలయ్యా
జైజైజైజై జైగణేశ మాకలలు పండించవయ్యా

https://www.4shared.com/s/fnYEb4ec6ee
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కొందరు నిన్నూ కొలిచేరు తలచేరు పిలిచేరు
చిన్ని కృష్ణుడిగా చిలిపి కృష్ణుడిగా
దొంగ కృష్ణుడిగా కొంటె కృష్ణుడిగా
కొందరు నిన్నూ పొగడేరు వేడేరు పాడేరు
తాండవ కృష్ణుడిగా యశోద కృష్ణుడిగా
మురళీ కృష్ణుడిగా గిరిధర కృష్ణుడిగా
భజరే భజే భజే గోపాలా
కహోరే కహో కహో నందలాలా

1.కొందరు నిన్నూ వలచేరు మురిసేరు మైమరచేరు
గోపీ కృష్ణుడిగా రాధాకృష్ణుడిగా
సత్యా కృష్ణుడిగా మీరా కృష్ణుడిగా
కొందరు నిన్నూ మోహించేరు స్వప్నించేరు శ్వాసించేరు
మోహన కృష్ణుడిగా ప్రణయకృష్ణుడిగా
బృందా కృష్ణుడిగా యమునా కృష్ణుడిగా
భజరే భజే భజే రాధేశ్యాం
కహోరే కహో కహో మేఘశ్యాం

2.కొందరు నిన్నూ భావించేరు కీర్తించేరు ధ్యానించేరు
సోదరతుల్యునిగా నటనా చతురునిగా
 జీవన సారథిగా ఇహపర వారధిగా
కొందరు నిన్నూ నమ్మేరు మ్రొక్కేరు ఎరిగెదరు
గీతా కృష్ణుడిగా జగన్నాథుడిగా
విశ్వ విఠలుడిగా  జగద్గురుడిగా
భజరే భజే భజే ముకుందా
కహోరే కహో కహో గోవిందా

https://www.4shared.com/s/f8BrlRptMgm
ఎప్పుడు తీరేను శివయ్యా నీ కష్టాలు
ఎవ్వరు మాన్పేరు సాంబయ్యా నీ బాధలు
చెప్పుకోగ దిక్కులేదు చెప్పకుంటె చక్కిలేదు
అందరూ ఉన్నా అనాథ నీవు
కక్కలేని మ్రింగలేని గరళగాథవైనావు
నీకునేనున్నాను రుద్రయ్య
నేస్తమై ఓదార్చగ  లింగయ్య

1.ఊరేమో కైలాసం ఉనికేమో స్మశానం
ఆలి చూస్తె భద్రకాళి తలన గంగ నాట్యకేళి
కరిశిరముతొ ఒక తనయుడు
ఆరు తలల ఒక కుమరుడు
ఎంతవింతదయ్య భవా నీ సంసారం
కనులవిందు బహుపసందు ప్రతి వ్యవహారం

2.పీతాంబరమేది చర్మాంబరముదప్ప
మణిమయ మకుటమేది నెలవంక జటలు దప్ప
కస్తూరి తిలకమా నుదుట రగులు నేత్రమాయే
శయనతల్ప శేషుడా వాసుకిని మోసుడా
బూడిద బుశ్శన్నవయ్య మల్లయ్య
పుర్రెల విశ్శన్నవయ్య రాజయ్య

https://www.4shared.com/s/fyzzKBnXbgm

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అక్షరమే నీ రూపము అక్షరమే నీ భావము
అక్షరమే నీ మంత్రము అర్చించెద భాషాలక్ష్మీ
వర్ణము నీ ఆకృతి వర్ణము నీ ప్రకృతి
వర్ణము నీ సంస్మృతి వర్ణించెద  వాఙ్మయ ధాత్రి

1.పలక మీద హొయలొలికే వయ్యారము నీవే
కలమునుండి సుధలు చిలుకు సింగారము నీవే
విద్యార్థుల తపన దీర్చె మేధావిని నీవే
కవిగాయక వరదాయిని వేదాగ్రణి నీవే

పదములతో నీ పదముల నలరించెద మాతా
కవితల నీ గుణగణముల ప్రణుతించెద జననీ

2.ఛందస్సు నువు ధరించు తెల్లనైన రంగు చీర
వ్యాకరణము నీ నడుమున కమరిన వడ్డాణము
శబ్దార్థ మణిమయకాంచనాలు నీకలంకారాలు
భావశిల్ప సొబగులు నీ సాహితి సౌందర్యాలు

సుస్వరాల పూలు జల్లి పూజించెదనమ్మా
గీతాల మాలలల్లి భూషించెదనే  తల్లీ

https://www.4shared.com/s/fljbDYCV3da

Friday, September 14, 2018

రచన:రాఖీ

"ప్రాణం ఖరీదు"

(కొండగట్టు బస్సు దుర్ఘటన నేపథ్యంలో)

కారకులెవరు కర్తలు ఎవరు
నమ్మి నిశ్చింతగా ఉన్నందుకా
వేరు దిక్కులేక బస్సునెక్కినందుకా
క్షతగాత్రులు కొందరు
విగతజీవులింకొందరు
ప్రతి నిర్లక్ష్యము మరలిరాని జీవితం
ప్రతి ప్రమాదము తీరని పెను విషాదము

ముక్కుపచ్చలారని పసివాళ్ళు
పారాణీ ఆరని పెళ్ళికూతుళ్ళు
ఆశలమూటతో నవ యువకులు
బాధ్యలే తీరని కుటుంబ యజమాన్లు
ఏ పాపం చేసారని ఈ శాపం
ఏనేరం చేసారని ఈఘోరం
విధివిలాసమంటూ సరిపుచ్చుకోవడమా
విధినిర్వాహణలో యంత్రాంగ వైఫల్యమా

కాలం చెల్లినా నడిపే వాహనాలు
తనిఖీలు మరమ్మత్తులు దాటేసే వైఖరులు
రహదారుల పట్ల ప్రభుత ఉదాసీన విధానాలు
మద్యపాన చరవాణులు ఘాతుక హేతుకాలు
కారణమేదైతేం బ్రతుకులె కద మూల్యము
పరిహారమెంతైనా పోయగలమా ప్రాణము
ఇకనైనా మేలుకొంటె నివారించగలమేమో
జాగ్రత్తలు తీసుకొంటె నియంత్రించగలమేమో


https://youtu.be/YvlrXzF9LeY?si=Di9oi5ZnETf77HGM

తెలంగాణ గుండెలోన నిండైన పండగ
దేశమంత జరుపుకొనె ఘనమైన పండగ
నవరాత్రి సంబరాల మెండైన పండగ
భామలంత బతుకమ్మలాడేటి పండగ
వచ్చింది వచ్చింది దసరా పండగ
తెచ్చింది జనులకు సంతోషాలు దండిగ

1.మహిషుడి మస్తకము తెగిపడ్డ దసరా
దశకంఠుడిలమీద కూలిపడ్డ దసరా
అర్జునుడికి విజయాన్ని అందించిన దసరా
పాలకడలి అమృతాన్ని చిందించిన దసరా
వచ్చింది వచ్చింది దసరా పండగ
తెచ్చింది జనులకు సంతోషాలు దండిగ

2.మైసూరు పట్టణాన కాంతుల దసరా
గుజరాతి గర్భా నాట్యాల దసరా
కలకత్తా కాళీమాత ఉత్సవాల దసరా
కనకదుర్గ బాసరమాత జాతరాల దసరా
షిర్డీసాయి సమాధి నొందిన దసరా
వచ్చింది వచ్చింది దసరా పండగ
తెచ్చింది జనులకు సంతోషాలు దండిగ

3.జమ్మిచెట్టు స్పర్శనం జయమస్తు దసరా
పాలపిట్ట దర్శనం శుభమస్తు దసరా
అలయ్ బలయ్ దోస్తీల మస్తుమస్తు దసరా
విందులకు చిందులకు జబర్దస్తు దసరా
వచ్చింది వచ్చింది దసరా పండగ
తెచ్చింది జనులకు సంతోషాలు దండిగ
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సార్థకమవ్వాలినీ నామధేయాలు
ఉధ్ధరించవయ్యా స్వామి మా జీవితాలు
ఆర్తితో పిలిచేము అవతరించవయ్యా
ఆశగా కొలిచేము కనికరించవయ్యా
తిరుమల తిరుపతి పురవాసా
కలి కల్మష నాశా
సప్తగిరీశ ఈశ దాసపోష

1.పాపాలు శాపాలు మసిచేయర వేంకటేశ
ఆపదలను ఆపవయ్య ఆపదమొక్కులవాడ
సందలను కలుగజేయీ హే  శ్రీనివాసా
ఋణబాధల తొలగించు వడ్డికాసులవాడ
తిరుమల తిరుపతి పురవాసా
కలి కల్మష నాశా
సప్తగిరీశ ఈశ దాసపోష

2.దాంపత్య సౌఖ్యమీయి అలమేలు మంగాపతి
అనురాగము ఇనుమడించు పద్మావతి ప్రియపతి
కనులయందు చెరగనీకు బాలాజీ నీ ఆకృతి
తోడునీడవై చేర్చు గోవిందా మమ్ము సద్గతి
తిరుమల తిరుపతి పురవాసా
కలి కల్మష నాశా
సప్తగిరీశ ఈశ దాసపోష

Monday, September 10, 2018

సిద్ధి వినాయక స్వామీ స్వామీ
నా మీద నీకింక దయరాదేమి

పాడితి నీ గీతి ప్రతి నిమిషమ్మున
వేడితి గణపతి నిను వేవిధముల
కొలిచితి నిన్ను శతకోటి రీతుల
తలచితి నీనామ మనంత మారుల

లయనేనెరుగను కరతాళములే
రాగములెరుగను భవరాగములే
తపముల నెరుగను తాపత్రయములె
వేదములెరుగను నీ పాదములే

https://www.4shared.com/s/fvA2XehuDfi

Sunday, September 9, 2018

అనుగ్రహిస్తే పొగడేను-ఆగ్రహిస్తే తెగడేను
ఇది గ్రహిస్తే అదిచాలు-నారసింహా చేయి మేలు
ధర్మపురి మా నారసింహా-పక్షపాతివె పక్షివాహన

1.పుట్టకముందే పొట్టలోనే-భక్తినంతా నూరిపోస్తే
నామజపమే గొప్పతపమని-అడుగుఅడుగున నీవు కాస్తే
నాకు  సైతం నీవె లోకం-కాకపోదువ జీవితాంతం
ప్రహ్లాద వరదా నీదె దోషం-చేయబోకు నన్ను మోసం
ధర్మపురి మా నారసింహా-పక్షపాతివె పక్షివాహన

2.బిచ్చమెత్తి బతుకు నీడ్చే-తిరుగుబోతును చేరదీస్తే
శతక రచనను చేయులాగ-కవన శక్తిని ఇనుమడిస్తే
నాకు మాత్రం లేదా ఆత్రం-కనికరించవు అదియె చిత్రం
శేషప్ప పోషా నీదె లోపం-నేను చేసిన దేమి పాపం
ధర్మపురి మా నారసింహా-పక్షపాతివె పక్షివాహన


https://www.4shared.com/s/ftZDYj_QEee

మ్రొక్కితి మొక్కులు-కట్టితి ముడుపులు
ఏలరా చుక్కెదురు-నిను వినా దిక్కెవరు
కైలాస వాసా శంభో మహాదేవా
జాగేలరా శివా శరణనంటిని నను బ్రోవ

1.కోడెను కడితె నీవు కొడుకుల కాచేవట
తులాభారమేస్తె మమ్ము చల్లగ చూస్తావట
తలనీలాలిస్తేనూ తరియింప జేస్తావట
అభిషేకిస్తె చాలు అండగ ఉంటావట
వేములవాడవాసా రాజరాజేశ్వరా
జాగేలరా శివా శరణనంటిని నను బ్రోవ

2.పత్రిదళము తలనిడితే పరవశించిపోతావట
తుమ్మిపూల పూజిస్తే తన్మయమొందేవట
ఉపవాసదీక్షకే వశమైపోతావట
శివరాత్రి జాగరణకు కైవల్య మిస్తావట
కాళేశ్వరా హరా ముక్తీశ్వరా భవా
జాగేలరా శివా శరణంటిని నను బ్రోవ

Saturday, September 8, 2018



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అమృతాలనందగా..క్షీర జలధి చిలుక నేల
అధరసుధలు వసుధనుండ...స్వర్గసీమనేగనేల..

అంతఃపుర కాపురాల చింతల దాంపత్యమేల
బృందావన యమునచెంత ఏకాంతకాంతనేల

కలలవలల చెలి తలపుల వలపునెరపి వగచనేల
కలువల నెలరాయుని కళల తెలుపు కవనాల

ప్రియుని కనగ వడిగచనగ కానలకోనల వెదకనేల
నొవ్వ కుండ నీ పదాలు గుండె పరిచె తొవ్వగుండ పరికించునేల

అమరసుఖములందుకో,క్షణములన్ని జుర్రుకో ఇంక జంకనేల
చెలి కౌగిలి కలి ఆకలి మనసారా తనివి దీర తీర్చుకోగ శంకయేల

https://www.4shared.com/s/fUmWtWJTOee

Friday, September 7, 2018


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నిలువునామాల వాడా
నిలువలేను నినుచూడక కలనైనా ఇలనైనా
వేల నామాలవాడ
రావేలవేవేగ గిరులువీడి సిరినిగూడి
సప్తగిరీశా.. భక్తపోష.. శ్రీనివాస..

1.నిను మదిలో తలచినంత
ఆపదలకు తావుండదు ఎవరి చెంత
నీ పదములు కొలిచినంత
సంపదలకు కొదవుండదు అదియె వింత
తలనీలాలా ముడుపులందుకొంటావు
తనువు పైన ఇచ్ఛనొదులు తత్వబోధచేస్తావు
తిరుమల గిరిరాయా..కొండల కోనేటిరాయా..

2. ఋణబాధలునీ వెరుగనివా
కరుణతోడ కావరా వడ్డికాసులవాడ
రుజల వెతల రుచిని నీవు
అనుభవిస్తె తెలియురా గోవిందా గోవిందా
మోకాళ్ళ పర్వతాన ముల్లోకాలు చూపేవు
దర్శనమే ప్రసాదించి మా శోకాలు బాపేవు

పద్మావతి నీకు సతి సవతులతో వేగే అలిమేలు మంగాపతి
 https://www.4shared.com/s/f8m-0hDD_gm

రచన,స్వరకల్పన&సంగీతం:రాఖీ

"సప్తస్వర పదార్చన"

స త్యశివ సుందరి దేవి-రి పు క్షయకరి
గ జగామిని-మ ధుసూదన ప్రియంకరి
ప రదాయిని-ద యామయీ-ని త్యసంతోషిణి
సర్వార్థసాధికే దేహీ...మాం పాహిపాహిపాహీ

1.స ర్వాభీష్ట ప్రదాయిని సౌభాగ్యదాయినీ
అష్టసిధ్ధి ఫలదాయిని నవనిధిదాయిని
ఆరోగ్యదాయిని వంశాంకుర సంరక్షిణీ
సర్వార్థసాధికే దేహీ...మాం పాహిపాహిపాహీ

2.ప రమేశ్వరీ పరాశక్తి  ధైర్యసాహస వరదే
భవాని శరణాగతవత్సల బిరుదాంకితే
విశ్వాస వర్ధకే విజయ ప్రదాయికే
సర్వార్థసాధికే దేహీ...మాం పాహిపాహిపాహీ

3.సా రస్వత సంరంభే సంభాషణ చాతుర్య ప్రదే
విద్యాదేవీ పరాపర విద్యావిశేష ప్రదాయకే
సంగీతామృత యుత మధురగాత్ర దాయకే
సర్వార్థసాధికే దేహీ...మాం పాహిపాహిపాహీ

https://www.4shared.com/s/fu5tOxzUcd

Thursday, September 6, 2018

నేలకున్నంత సహన శీలత
గాలికున్నంత సర్వ వ్యాపకత
కడలికున్నంత నర్మగర్భత
రోదసికున్నంత విశాలత
చేసుకోవాలి నీసొంతము
అనితరసాధ్యమనగ నీ మార్గము

తరువుచెంత త్యాగ నిరతి
త్రాసువలన ధర్మనిరతి
హంసతోటి న్యాయ స్ఫూర్తి
పికమునుండి విజయార్తి
అలవర్చుకోవాలి అనవరతం
ఆదర్శవంత మవ్వాలి జీవితం

పిచ్చుక లోని కౌశలత
పిపీలికానికున్న దక్షత
బకమునకున్న ఏకాగ్రత
మూషకానికున్న రీతి విజ్ఞత
సాధన చేయాలి నిరంతరం
సాధించాలి జీవిత లక్ష్యం

https://www.4shared.com/s/fzbxFMcDwfi

Sunday, September 2, 2018

ఎందుకా నిట్టూర్పు
ఏలారా ఓదార్పు
రానీయి నీలో మార్పు
భవితకీయి చక్కని తీర్పు

1.సంశయాలు వదిలివెయ్యి
సాధనే తప్పక చెయ్యి
వెన్క నుయ్యి ముందుగొయ్యి
ఏదున్నా దాటివెయ్యి

2.అడ్డుపుల్ల లేస్తారు
కాళ్ళులాగేస్తారు
శల్యులెంత గేలిచేసినా
గుండెదిటవు వీడకురా

3.కెరటమోడి పోదుకదా
గట్టుచేర పోరాడదా
యత్నాలు ఎన్నైతేమి
గెలుపుతోనె చెయ్యి చెలిమి

https://www.4shared.com/s/fAiRfJLMfgm

Friday, August 31, 2018


స్నేహానికి నిర్వచనం మనం
కలనైనా కలుసుకోక మనం
దేహాలు వేరైనా మనదొకటే ప్రాణం
కనని వినని చెలిమికి మనమేగా ప్రమాణం

1.నీటిలో ఇమిడిఉన్న ఉదజని ఆక్సీజనులం
గుండెకు నెత్తురు చేర్చే సిరాదమనులం
చలామణీ నాణానికి బొమ్మాబొరుసులం
మైత్రీ రథానికీ అరిగిపోని చక్రాలం

2.సౌహార్ద గీతికీ మనమే శ్రుతిలయలం
సోపతి సింగిడికే అందమద్దు రంగులం
సావాసపు దీపానికి వత్తీ చమురులం
సఖ్యత పుష్పానికి మనమే తేనియ గంధాలం

Thursday, August 30, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

వినినంతనే ఎంత హాయి నీ లీలలు
చదివినంతనే మధురమ్మోయి నీ గాథలు
ఏనాడో పాతబడే నువు చేసిన గారడీలు
మరోమారు చూపరాద నీ మహిమలు
సాయినాథ సాయినాథ
నీ అద్భుత చరితం
పారాయణతోనైనా మారునా జీవితం


1.బల్లి భాష సైతం తెలిసిన నీకు
భక్తుని బాధ మాత్రమెరుగలేనని అననేఅనకు
తాత్య తల్లి మనసు చదివిన నీకు
ప్రతి తల్లి ఎదలో వేదన పట్టదెందుకు

సాయినాథ సాయినాథ నీ
దివ్య దర్శనం
దీన జనుల మానధనుల దుఃఖ భంజనం

 2.ధునిజ్వాలలొ చేయినిడి పసివాణ్ణి కాచావు
మా గుండెల మంటనేల ఆర్పకున్నావు
విరిగిన ఇటుకనైన గురువన్నావు
నా వెతల బ్రతుకెందుకొ బరువన్నావు

సాయినాథ సాయినాథ మోతునీ పల్లకిభారం
కరుణతొనువు చేతువనగ కన్నీటిని దూరం

3.నీటితో దీపాలువెలిగించావే
పాటిగా మా దోషాలు తొలగించరావేఁ
గాలిలో ఉయ్యాలలూగినావే
లీలగానైన మాకష్టాలు తీర్చ రావేఁ

సాయినాథసాయినాథ ప్రతి గురువారం
 ఉపవసించి చేసుకొందు నే పరిహారం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నియంత్రించలేవా గంగాధరా
నీ ప్రియురాలిని
నిగ్రహించలేవా సాంబశివా నీ అర్ధాంగిని

తరుణి మనసు వెన్నకన్న మెత్తనందురే
తల్లిప్రేమకేది సాటి రాదనందురే
కట్టడి సేయవేల కపర్దీ
కాసింత చెప్పవయ్య కామారి

1.నీ వలపుల వలనబడి
కరువుకాటకాలనిడి
కంటనీరు తెప్పించెడి
గంగమ్మకు చెయ్యవయ్య తెలిపిడి
నీతోటి తగవు పడి
అలకబూని నినువీడి
అవనికంత వరదనిడీ..
ఎరుకపరచు ముంచెయ్య తగదని

తరుణి మనసు వెన్నకన్న మెత్తనందురే
తల్లిప్రేమకేది సాటి రాదనందురే
కట్టడి సేయవేల కపర్దీ
కాసింత చెప్పవయ్య కామారి

2.అన్నపూర్ణ ఉన్నతావు
సాధ్యమా ఆకలి చావు
గణపతికే మాతకదా
ప్రగతి ఆగిపోతుందా
భద్రకాళి ఉన్నచోట
ఆడపిల్లకే చేటా
మదనాంతక మరిచావా
కామాంధుల తెగటార్చ

తరుణి మనసు వెన్నకన్న మెత్తనందురే
తల్లిప్రేమకేది సాటి రాదనందురే
కట్టడి సేయవేల కపర్దీ
కాసింత చెప్పవయ్య కామారి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జనని  జగదుద్ధారిణి
జ్ఞానదాయిని వేదాగ్రణి
హంసవాహిని పరమహంస వందిని
కరుణా వీక్షణి కఛ్ఛపి వీణా గానవినోదిని

నమోస్తుతే చంద్ర హాసిని
నిత్య సంస్తుతే నిఖిల నిరంజని

1.మాలా పుస్తక హస్త భూషిణి
లలిత లలిత మృదు మధుర భాషిణి
అద్వైత తత్వ సమన్విత రూపిణి
శంకర సేవిత శృంగేరి వాసిని

ప్రణమామ్యహం పారాయణి
పరిపాలయమాం ప్రణవనాదిని

2.కవిగాయక భావ సంచారిణి
విద్యార్థి స్థిర బుద్ది ప్రదాయిని
అజ్ఞానకృత దోష నివారిణి
అతులిత నిరుపమ దయావర్షిణి

శరణ్యామహం హే శ్రీవాణి
సదా సంపూజితాం సనాతని
రచన:రాఖీ

మహితము మతరహితము
సాయినీ అవతారం
సకలదైవ సమ్మిళితము
నిర్వాణ పర్యంత నీ జీవనసారం

1.మహావిష్ణువేగ సాయి నీవు
నీ పాదాల గంగపుట్టినందుకు
పరమశివుడివైనావు సాయినీవు
అనునిత్యం బిచ్చమెత్తినందుకు

దత్తుడివే తప్పక సాయినీవు
తత్వం బోధించినందుకు
రాముడివే షిర్డిసాయినీవు
మాట ఇచ్చి తప్పనందుకు

2.నిను వినా కొలవనింక
సాయీ వినాయకా
మరవనే మరవనింక
మారుతివి నీవె గనక

నీసమాధి నమాజ్ కై
అల్లాగా భావింతు
బ్రతుకు దారపోసితివే
నిను జీసస్ గా ప్రార్థింతు

https://www.4shared.com/s/foberaXV9fi

Friday, August 24, 2018


నీకు సాధ్యం కానిది లేదు
ఎవరు నీకూ సాటిరారు
చేయగలవు ఎన్నెన్నో అద్భుతాలు
మార్చగలవు మంచిగా మా జీవితాలు
కొండగట్టు మారుతీ.. నీకు వందనాలు
మా ఇంటి దైవమా గొను... నీరాజనాలు

1.అమ్మ అంజనా దేవిని రంజింప జేసావు
గురువు రవిని మించిన శిష్యుడివైనావు
ఇంద్రుడితో పోరైనా   బెదరకుండినావు
బ్రహ్మవరమునే పొంది చిరంజీవి వైనావు
కొండగట్టు మారుతీ.. నీకు వందనాలు
మా ఇంటి దైవమా గొను... నీరాజనాలు

2.సీతమ్మ జాడనే కనుగొన్నావు
రామయ్య ప్రేమను చూరగొన్నావు
సంజీవని గిరినైనా మోసుకొచ్చావు
లక్ష్మన్నకు నీవే ప్రాణదాతవైనావు
కొండగట్టు మారుతీ.. నీకు వందనాలు
మా ఇంటి దైవమా గొను... నీరాజనాలు

https://www.4shared.com/s/fLiiCdN2Eda

Thursday, August 23, 2018

వరదాయిని వరలక్ష్మి
సిరులీయవే స్థిర లక్ష్మి
కరుణించరావే కనక మహా లక్ష్మి
మొరాలించవే తల్లి సౌభాగ్య లక్ష్మి

1.పతి ఎదలో కొలువు దీరినావు
సంపతిగా శ్రీ వారికి నీవైనావు
కుల సతులకు ఇలలోన బలమునీవే
ముత్తైదువు లెల్లరకు భాగ్యమీవే సౌభాగ్యమీవే

2.మనసారా కోరితిమి మాంగల్యము కావుమని
నోరారా నుడివితిమి సంతతి రక్షించమని
భక్తిమీర వేడితిమి సంపద లందించమని
నీరాజన మిడితిమి మము చల్లగ చూడుమని

3.వైభవ లక్ష్మి వ్రతము వాసిగా జేసేదము
వరలక్ష్మీ వ్రతమును. బహు నిష్ఠతొ చేసెదము
మాంగల్య గౌరి వ్రతము నీమముతో చేసెదము
శ్రీ లలితా అనుక్షణము నీ నామము తలచెదము

Friday, August 17, 2018


రచన:రాఖీ

మెరవాలి మెరుపు తీగ
కురియాలి వలపు వాన
తడవాలి తరుణి ధరణి చిత్తుచిత్తుగా
మెలకెత్తాలి ఆశలెన్నొ కొత్తకొత్తగా

1పచ్చదనం బ్రతుకంతా విరబూయాలి
కలల సాగు భవితంతా
సిరులే పండాలి
పెదవుల గగనంలో
చంద్రికలే వెలయాలి
ఆనందం మనతోఇక
బాంధవ్యం కలపాలి

2.వేదనలై వేధించే దాహాలే తీరాలి
సెగలకాగు తనువులకిది
నవనీతం కావాలి
ధారలై వాగులై నదుల వరద పొంగాలి
తన్మయాల మమేకమై కడకు కడలి చేరాలి
ఇరువురమను భావానికి చరమ గీతి పాడాలి

https://www.4shared.com/s/fZFqJxfZefi
వెర్రివాళ్ళమా సాయీ నిన్ను నమ్మికొలిచేది
పిచ్చివాళ్ళమా బాబా నిన్ను మదిన తలిచేది
ఉలకవు పలకవేల రాయిలాగా
ఆదుకోవయ్య నన్ను కన్నతండ్రిలాగా

1.వేలంవెర్రిగా షిరిడీ పయనాలు
క్రమమే తప్పక గురువారం దర్శనాలు
ప్రార్థనలు అర్చనలు పంచహారతులు
పడిపడి చేసేరు పల్లకీ సేవలు

మిన్నకుందువెందుకయ్య మౌనిలాగ
ఆదుకోవయ్య నన్నుకన్నతండ్రిలాగ

2.దీక్షలు వ్రతములు నిత్యాభిషేకాలు
పండుగలు ఉత్సవాలు అన్నదానాలు
ఏవిధి సంతుష్టి చేస్తె కరుగుతుంది నీ మనసు
ఏ రీతిగ నివేదిస్తె పడుతుంది నీ చూపు

పట్టు వీడవేలనయ్య మొండి లాగ
ఆదుకోవయ్య నన్నుకన్నతండ్రిలాగ

3.సమయమంత వృధాచేస్తు సతాయించకు
తెగేదాక లాగునట్లు పరీక్షించకు
శరణని నీచెంతకొస్తె ఇంత నిరాదరణా
గొంతుచించు కున్నాగాని చూపవేల కరుణ

బ్రతుకుల బలిచేయకూ కసాయిలాగ
ఆదుకోవయ్య నన్ను కన్నతండ్రిలాగ


https://www.4shared.com/s/fbKZtN5_igm

Wednesday, August 15, 2018

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

భారతీయతే మన సౌభ్రాతృత్వం
జాతీయతే మన అందరితత్వం
భిన్నత్వంలో ఏకత్వం మన లౌకిక తత్వం
మనని మనం ఏలుకొనే గణతంత్ర ప్రభుత్వం
వందనాలు స్వాతంత్ర్య భారతావనికి..
శుభాభినందనాలు నా దేశ పౌరులందరికి...

1.మువ్వన్నెలజండాను చూడగనే
గర్వపడుతుచేసేము అభివాదము
జనగణమనఅనుగీతం వినినంతనే
తన్మయముగచేసేము సహగానము

ఉత్తేజమొందునట్లుగా కోట్లగొంతులొకటైమ్రోగ
ఎలుగెత్తి చేసేము జైహింద్ నినాదము

2.ఈనాడు పీల్చే మన  స్వేఛ్ఛా వాయువులు
ఎందరో    త్యాగధనులువదిలిన ఆయువులు
విడిపించగ పరపాలన నరకచెఱలను
భరియించినారు..  బంధీఖానాలను

జోహారులర్పిద్దాం స్వారాజ్య యోధులకు
జేజేలు నినదిద్దాం వారి బలిదానాలకు

3.దేశభక్తి  భావనయే ఎద ఎదలో నిండగ
ఇది ప్రజలంతా జరుపుకొనే ఘనమైన పండగ
పరస్పరం ఒకరికిఒకరు సదా అండదండగా
మనుగడసాగించాలి జగము మురియుచుండగా

జయహో జయహో జయ భరతమాత
జయము జయము జయము నీకు విశ్వవిజేత..

అందుకో మా చేజోత అందుకో మా చేజోత మాచేజోత...మాచేజోత
జై హింద్..జైహింద్..జైహింద్..

https://www.4shared.com/s/fu-vyL6Lyee

Monday, August 13, 2018

శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో…

॥రాఖీ॥వ్యసన హనన గణపతి

అమ్మనిన్ను మలిచింది పిండి బొమ్మగా
నమ్మి నిన్ను కొలిచేము మట్టిబొమ్మగా
తండ్రినే మెప్పించిన గణనాయకా
మాతండ్రివి నీవయ్యా శుభదాయకా
స్వాగతమయ్యా నవరాత్రి సంబరాన
నెలకొనవయ్యా మా హృదయ
మందిరాన
జైగణపతి జైజై గణపతి
అందుకో వందనాలు సిద్ధి గణపతి

1.వక్రబుద్ధి తొలగించర వక్రతుండ
పందాలకు దూరముంచు గజవదన
మద్యమునే మాన్పించర లంబోదరా
వ్యసనాలను మసిచేయర హే మూషక వాహన

2.ధూమపాన లాలసనే పరిమార్చర హేరంబ
పరుష భాషణమ్మునే పలికించకు ఉమాసుతా
పైశాచిక హింస ధ్యాస రానీయకు వినాయకా
వ్యసనాలను మసిచేయర
హే మూషక వాహనా

3.దుబారా నరికట్టర హే ధూమ్రవర్ణ
మత్తుమందు బానిసగా మారనీకు విఘ్నేశా
చరవాణి చెఱ వదలగ
దీవించు హే సుముఖ
వ్యసనాలను మసిచేయర
హే మూషక వాహనా

Saturday, August 11, 2018

వీణాపాణీ శ్రీ వాణీ సుహాసిని సదా
సుహృదయ నివాసిని దేవీ శారదామణి గీర్వాణీ

1. సృష్టికర్తయే నీ పతి
నీవే కాదా జ్ఞాన భారతి
కనులు మూసినా కనులు తెఱచినా
అణువణువునా నా కగుపించవే

2. చదువుల మాతవు నీవే కదమ్మా
స్వరముల నేతవు నీవే కదమ్మా
సకల కళలను సర్వ విద్యలను
అనుక్షణము నా కందించవమ్మా

3. నా నాలుక పైనా వసియించవే
నాలోని కల్మషము తొలగించవే
అజ్ఞానతిమిరము రూపుమాపి
జ్ఞాన దీప్తులే  వెలిగించవే

https://youtu.be/pD2wPoquiBE?si=KgTUwr58I9i37Uua


పదములతో కొలిచాడు అన్నమయ్యా
పరమ పదమొసగెడి నీ దివ్యపదములను
కీర్తనలతొ కీర్తించెను త్యాగయ్యా
నీ అతులిత మహిమాన్విత గుణగణాలను

నీ లీలల నెరుగని నేనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

1.వాల్మీకి వాసిగా వ్రాసినాడు నీ చరిత
వ్యాసుడు వెలయించినాడు మహితమౌ నీ ఘనత
శుకుడూ సూతుడూ ప్రవచించిరి నీ గాథ
ప్రస్తుతించ నాతరమా ఇసుమంతయులేదు ప్రతిభ

నీలీలలు లిఖించని నెనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

2.జయదేవుడు నుడివినాడు నిరతిన నీ రమ్యరతి
పురంధరుడు ఆలపించె కృతుల నీ ప్రతీతి
నారద తుంబురులు నుతియించిరి నీ గణుతి
అలవిగాదు నాకు తెలుప అద్భుతమౌ నీ ఖ్యాతి

నీలీలలు పాడుకోని నేనెంతటి మందమతి
తోగువేంకటాపురపతి చూపర ఇక సద్గతి

https://www.4shared.com/s/f2b1UQEwAgm
గడ్డిపూవైతెనేమి భక్తితో పూజిస్తే
రేగుపండైతె నేమి శ్రద్ధగా నివేదిస్తె
పిడికెడటుకులైన చాలు ప్రీతిగా బహుకరిస్తె
తులసీదళమైతె నేమి విశ్వసించి కొలిస్తే

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎద నెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

1.సతతము స్మరియించే హృదయ పీఠాలు
స్వామి అధిష్ఠించే పసిడిసింహాసనాలు
దర్శించగ ధారలుగా ఆనంద భాష్పాలు
స్వామికి అందించే అర్ఘ్యపాద్యసలిలాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

2.తీయని పలుకుల స్తవనమైతె చాలు
స్వామిని అభిషేకించే తేనియలు పాలు
ధ్యానమందు ప్రజ్వలించు ఉచ్వాసనిశ్వాసలు
ప్రభుని ఎదుట వెలిగించే ధూపదీపాలు

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం

3.నయనాలు కలువలు కరములు కమలాలు
స్వామి అలంకరణకై పూవులూ మాలలు
అనవరతము సోహమై ప్రభవించే ఆత్మజ్యోతి
పరమాత్మకు అర్పించే కర్పూర హారతి

భౌతికమేదైనా భావనయే ప్రధానం
ఎదనెప్పుడు చేయాలి స్వామి సన్నిధానం



Wednesday, August 8, 2018

ముడుచుకోకు సోదరా
గుప్పిటినిక విప్పరా
బావిలోనికప్పకున్న
భ్రాంతినీకు ముప్పురా
విచ్చుకున్న మొగ్గలాగ
పరిమళాలు గుప్పరా

1.కలచివేయు బాధలున్నా
నీలొనీవె కుమిలి పోకు
వెతలు పంచుకోకనీవు
సతమతమై చింతించకు
చేయిసాచు చెలిమికెపుడు
తివాచీలు పరచిఉంచు
నువు నమ్మిన నేస్తాలకు
మదిగదినిక తెరచిఉంచు

2.అత్తిపత్తి ఆకులాగ
ముట్టుకుంటె జడుసుకోకు
తాకబోతె నత్తలాగ
గుల్లలోకి జారుకోకు
నీటబడిన చమురు తీరు
పాత్రనంత విస్తరించు
వామనుడి అడుగురీతి
భూనభముల నాక్రమించు

3.పారదర్శకత ఎప్పుడు
జటిలము కాబోదురా
స్పష్టమైన వ్యక్తీకరణ
చిక్కులు తేబోదురా
సమాచారలోపమే
సమస్యలకు మూలమురా
సకాలాన స్పందిస్తే
విపత్తులైనా తేలికరా


Sunday, August 5, 2018

మేలుకొంటె మేలురా మత్తునింక వదలరా
బ్రతుకులోని సగభాగం నిదురలోనె వృధారా
సోయిలేని సమయమంత మృతికి భిన్నమవదురా

1.బ్రహ్మీ ముహూర్తపు అనుభూతిని కోల్పోకు
ఉషఃకాల శకుంతాల కువకువలను వదులుకోకు
సుప్రభాత కిరణాల హాయిని చేజార్చకోకు
వేకువనెప్పుడు లోకువగా తలచకు

2.యోగా చేయగలుగు యోగమె యోగమురా
గుండెను నడుపగలుగు నడకయే యాగమురా
వ్యాయామం వేడుకైతె దుర్వ్యసనము చేరదురా
ఆహారపు నియతితో ఆరోగ్యము చెదరదురా

3.కాలుష్యపు నాగుల కోఱలు పీకెయ్యరా
కల్తీ ఆంబోతుల కొమ్మలు విరిచెయ్యరా
ప్లాస్టిక్ మహమారినిక వేయరా పాతరా
పచ్చదనం స్వచ్ఛదనం నీకు ఖురాన్ గీత రా


హరి యొకడు హరుడొకడు
పరిపాలించెడివాడొకడు
పరిమార్చెడివాడొకడు
నరలోక నరకపు చెరలకు కారణుడెవడు కారణకారణుడెవడు

1.మురహరి యొకడు
పురహరుడొకడు
శార్గ్ఙ పాణియొ
పినాకపాణియొ
ధరనిపుడసురుల దునుమగ ఎవడు
మదమణచగనెవడు

 2.శ్రీనివాసుడొకడు
సాంబశివుడొకడు
సంపద వరదుడొ
త్యాగ ధనుడొ
సిరులను కురిపించునెవడో
వరముల మురిపించునెవడో

 3.ధన్వంతరియే నొకడు
వైద్యనాథుడొకడు
రుజలను తెగటార్చునొకడు
స్వస్థత చేకూర్చునొకడు
కరుణ మానిన కర్కశుడొకడు
దయను మరచిన పశుపతి యొకడు

4.జలశయనుడొకడు
జాహ్నవి వరుడొకడు
పాలకడలి తేలేది యొకడు
గంగలో ఓలలాడేది యొకడు
భవజలధిని దాటించునెవడో
కైవల్యతీరం చేర్చేది ఎవడో

https://www.4shared.com/s/fkz0SXN9Sda

Friday, August 3, 2018


శాంభవి హారతి-గొనుమిదె నెమ్మది
చేసెద అభినుతి నిలువవె మా మతి
శాంభవి హారతి..

1.తొలికిరణం సాక్షిగా-నిను తలతును ఆర్తిగా
పగలు రేయి ఎపుడైనా - నీ స్మరణే చేసెద
మరువకమ్మ కరుణ జూడ -మరలమరల వేడెద

2.పూజలు వ్రతములు-నోచక యుంటిని
తీర్థము క్షేత్రమును -తిరుగకుంటిని
అన్యమేది ఎరుగనమ్మ నిన్నె నమ్ముకొంటిని

3.తెలిసీ తెలియకో -చేసిన దోషము
మన్నన చేసి మమ్ము -కావవె కాత్యాయణి
నీ దయకవధి లేదు-ఎన్నగనా తరముగాదు

Wednesday, August 1, 2018

అనుక్షణ మొక వధ్యశిల
ప్రతినిమిషం ఉరికొయ్య
దినందినం గరళపానము
నూరేళ్ళూ సజీవదహనము

చితికె నాబ్రతుకు
ఇక చితికే నా బ్రతుకు
మరణమెకటె శరణము
మృత్యువె నా గమ్యము

1.ఓటమి నెరిగి పోరాటము
అందని దానికై ఆరాటము
కడదాకా వీడని గ్రహదోషము
కడతేర్చగ వేచిన నా దేహము

మరణమెకటె శరణము
మృత్యువె నా గమ్యము

2.వెతలకు నేనే విలాసము
అడుగుఅడుగునా పరిహాసము
ప్రతిసారి విధిచేయను మోసము
ఏకన్ను కారదు నాకోసము

మరణమెకటె శరణము
మృత్యువె నా గమ్యము


కాలభైరవా భవా-
మహా కాల హే శివా
నీ సరి పిసినారి ఇలలోలేడు
నీ అంతటి లోభి దొరకనే దొరకడు

లేనివెలాగూ ఈయనే ఈయవు
తీయగలిగినా తీయవు ఆయువు

1.గొంతులో దాచావు గరళము
రెప్పక్రింద కప్పావు జ్వలనము
వాడితే అరుగునా త్రిశూలము
ముంచితే తరుగునా గంగా జలము

పేరుకే మదనాంతకుడవు
వేడినా దయసేయవు మృత్యువు

2.కరిపించగ కరువా పన్నగములు
తోస్తెచాలు చుట్టూరా హిమనగములు
నందికొమ్ముచాలదా పొడిచి చంపడానికి
ఢమరుకం ధ్వనించదా గుండె ఆగడానికి

రుసుము కూడ ఉచితమే రుద్రభూమి నీదెగా
పైకమీయ పనిలేదు కాపాలివి నీవేగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కరకు హృదయ ముంటుందా కన్నతల్లికి
కరుణకు లోటుంటుందా కల్పవల్లికి
జగన్మాతవన్న మాట అనృతమేనా
అమ్మలకే అమ్మవంది అది నిజమేనా
ఎలా ఊరుకుంటావు మావెతలు చూసి
మిన్నకుందువెందుకు మా యాతన తెలిసి

దయను కురియ జేయవమ్మా దాక్షాయిణి
ఎద మురియగ కాయవమ్మా నారాయణి

1.బ్రతుకునింత ఇరుకు చేసి బావుకున్నదేమిటి
మనసుకింత మంటబెట్టి వినోదింతువేమిటి
నిధులడిగానా నిన్ను ఎన్నడైనా
పరమ పదమడిగానా నేను ఎప్పుడైనా
మామూలుగ మమ్ములనిల గడపనిస్తే అది చాలు
సంతృప్తితొ కడదాకా మననిస్తే పదివేలు

వెతలు త్రుంచవమ్మ మావి వాగధీశ్వరీ
మమత పంచవమ్మ మాకు మాధవేశ్వరి

2.అల్లుకున్న పొదరిల్లును మరుభూమిగ మార్చావు
కట్టుకున్న కలలమేడ నిర్దయగా కూల్చావు
పదవిమ్మని కోరలేదె పొరబాటుగను
ఆస్తికొరకు పోరలేదె నాహక్కుగనూ
ఒంటికెపుడు నలతనైన కలిగించకు తల్లీ
ఇల్లంతా తుళ్ళింతలు నింపివేయి మళ్ళీ

దండించిన దిక చాలు కాత్యాయణి
పండించవె భవితనైన బ్రహ్మచారిణి

https://www.4shared.com/s/f2JD540r_fi


తొలి గురువే అమ్మా శిక్షకుడే నాన్నా
ఓనమాలు నేర్పించే బడిపంతులు విద్యాగురువు
నడవడికను నేర్పించే సమాజమూ సహజగురువు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

1.ఆదిగురువు పరమ శివుడు జగద్గురువు శ్రీ కృష్ణుడు
అయ్యప్ప హన్మానులు అభిమత గురుదేవులు
వేదాలనందించిన వ్యాసుడే వసుధ గురువు
కలియుగాన సద్గురుడు షిరిడి సాయినాథుడు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

2.త్రిమూర్తిస్వరూపమైన శ్రీదత్తుడు పరమ గురువు
ఆదిశంకరాచార్యుడు అద్వైత మతగురువు
మహ్మదూ జీససూ పరమతముల ప్రవక్తలు
ఉద్ధరింపజేయు మనల ఉపదేశ గురువు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

3.జిజ్ఞాస కలిగియన్న ప్రకృతే ప్రథమ గురువు
పంచభూతాలు సైతమెంచగ తా గురువులు
చెట్టూ పిట్టా గుట్టా నదీ కడలి గురువులు
నిశితదృష్టి గమనిస్తే బోధపరచు నిర్జీవులు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

4.అజ్ఞాన తిమిరాన్ని తొలగించును గురువు
సత్యాన్ని ధర్మాన్ని విశదపరచు గురువు
తనను  మించువానిగా తర్ఫీదునిచ్చు గురువు
పరమపదము సులభంగా చేర్పించును గురువు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

5.బుద్ధుడు నానకూ మహావీరుడూ గురువులు
రమణుడు రామకృష్ణ రాఘవేంద్రులు గురువులు
మహావతార్బాబా మెహరు బాబా గురువులు
మానవరూపంలో మనియెడి ఇల దైవాలు గురువులు

కర్మను పరిపూర్తి జేయ పురికొల్పువారె గురువు
జన్మను తరియింపజేయు మార్గ దర్శియే గురువు
వందనాలు వందలాది గురువులందరికీ
గురు పౌర్ణమి ప్రణామాలు ఆ మహనీయులకి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చుంబనాల వాన ఇది
ఆలింగనాల గంగ ఇది
తడవనీ తనువులనీ తపనలు దీరా
మునగనీ మేనులనీ తమకములారా

చ 1.వికసించని మల్లిక
ఎదురైనా..మరీచిక
విధివిసిరిన పాచిక
ఒడలు వడలు వీచిక

ఎడారిలో తడారినా నాలుకా
సరస్సులో ఈదాడదా అలువకా

2.అహరహము విరహము
అంతెరుగని మోహము
ఎంతవింత దాహము
చింతపెంచు తాపము

కరుగనీ కాలమై కాయము
కాలనీ కర్పూరమై సాంతము

https://www.4shared.com/s/fnnSPkvXdee

Monday, July 30, 2018


గోవింద గోవింద అభివందనం
పాహిముకుందా పరిమార్చు భవబంధనం
తిరుమల గిరివాస ఇదెనీకు శ్రీచందనం
వేంకటాచలమిల నవనందనం

1.నిత్యవైభోగ నీ నిజ దర్శనం
జన్మాంతర కృతదోషభంజనం
కృష్ణవిగ్రహనీ రూపేమనోరంజనం
దుఃఖహారక నీహాసమే నిరంజనం

2.ఆపదమొక్కుల వాడ
సార్థకనామధేయుడ
శ్రీనివాసుడ సిరిరేడ
సంపద వరదుడ
నామస్మరణతొ నామాలవాడ
దరిజేర్చుకోనా ఎదమాలవాడ

Saturday, July 28, 2018

https://youtu.be/7zalZd09Vh0?si=dn6NGtiDAq_VKd7F


అలుపుసొలుపు లేక
నిమిషమాగిపోక
చెయ్యాలి సాధన
గెలుపొకటే భావన
జీవఝరే నీకు గుఱి
జలధి వరకు సాగు మఱి

1.ప్రయత్నమే ప్రశస్తము
పాల్గొంటెనె ప్రాప్తము
ఓటమి నూహించి
ఆటమానుకోకు
నెగ్గేవరకెపుడూ
తల ఒగ్గి ఉండకు
విత్తనమై మొలకెత్తు
వృక్షమల్లె రేకెత్తు

2.విజయలక్ష్మి కొరకు
ఊపిరున్న వరకు
అనుయోగమే చెయ్యి
అనుమానం వదిలెయ్యి
నెరవేరును సంకల్పం
విజితి కైపు అనల్పం
పిపీలికం నీకు ప్రతి
పట్టుదలకు ప్రతినిధి

Friday, July 27, 2018

మరచినావ మహేశా
నీకు మహిమలున్న సంగతి
బధిరునివైపొయినావా
నీ భక్తులకెవరు గతి
(పర)ధ్యానమింక వీడరా
ధ్యాసపెట్టి చూడరా
ముక్కుమూసుకొంటు మమ్ము
లెఖ్ఖచేయవేలరా

1.మరణము తప్పించినావు మార్కండేయునికి
ముక్తి ప్రసాదించినావు శ్రీ కరి నాగులకు
మొరలిడినదె తడవుగా ఆపదల్లొ కాచేవు
పరమదయాళువన్న బిరుదెపుడో పొందినావు

2.(పార్వతమ్మకైన)అమ్మకైన వినిపించద
ఆర్తజనుల వినతి
తొలిపూజలు గొనుటకేన నీతనయుడు గణపతి
షణ్ముఖునికి తెలియదా చేరదీయు పద్ధతి
అయ్యప్పా ఎరుగడా ఏమిటొ శరణాగతి

3.అంతులేని వేదనను భరించాను మౌనంగా
గుండెకోతనైన స్వీక రించాను నీ వరంగ
హద్దుఅదుపు లేదా నువు పెట్టే పరీక్షకు
ఈ తీవ్రత సరిపోదా  నువువేసిన శిక్షకు



Tuesday, July 24, 2018


అనివార్యమేఅని తెలిసినా ఉద్యోగధర్మమే ఐనా
బంధాలనొదలలేకా బదిలీని సైచలేకా
అతలాకుతలం ప్రభుత్వ ఉద్యోగి జీవితం
సర్కారు వేతనజీవి సతమతమే సతతం సతతం

1.బ్రతుకు పోరాటంలో వలసలు అతిసామాన్యం
బాధ్యతలను నిర్వహించగా అనుబంధం పద్మవ్యూహం
ఉన్నతకాలం ఆనందం పంచాలి
విడిచివెళ్ళినా గాని మధుర స్మృతులు మిగల్చాలి
మనదైన ముద్రను శాశ్వతంగ వేయాలి
ఎన్నినాళ్ళు ఐనాగాని గుర్తుండిపోవాలి

2.విద్యార్థులందరికీ విజ్ఞానం అందించాలి
మానవత్వ విలువలను ప్రతివారికి బోధించాలి
పెదవుల పూదోటల్లో నవ్వులు పూయించాలి
సాటి ఉద్యోగులతోనూ సఖ్యతగా మెలగాలి
ఉన్నతాధికారుల మెప్పుపొందగలగాలి
ఫలానా వారంటూ ప్రజలు మనను కొనియాడాలి

Saturday, July 21, 2018

కలనైన కలుసుకుందాము
వెతలన్ని పంచుకుందాము
జతగూడ నోచలేకున్నా
చితిదాక తోడు ఉందాము

1.గతస్మృతులు  నెమరు వేసుకుంటూ
అనుభూతులు కల బోసుకుంటూ
ముడి వడని బంధం మనదన్నా
సంఘమంత చోద్యమనుకున్నా
అనిర్వచనీయమైన అనురాగం ఆలపిద్దాం
అమలినభావుకతతో స్నేహగీతి  వినిపిద్దాం

2.నీ కష్టం నాదిగ తలపోస్తూ
నా వేదన నీదిగ భరియిస్తూ
అవసరాల్లొ ఆసరానందిస్తూ
ఆపదల్లొ ఆదుకొంటుంటూ
నిజమైన మైత్రికి పర్యాయపదమౌదాం
చెలిమి అంటె ఏమిటో లోకానికి నేర్పిద్దాం

Tuesday, July 17, 2018

పలుకుతోనె జీవితం
మాటతోనె మనుగడ
నా వాక్కున తేనియలే చిలికించవె శ్రీవాణి
నా నుడుగులు మీగడలా తలపించవె గీర్దేవి


1.శరముల కానీయకు నాఅక్షరమ్ముల
ఎదుటివారి గుండెలను గాయపరచగ
పదముల నను పదిలముగా వాడగజేయి
ఎద ఎద కవి నవనీతముగా తోచగా

వందనాలు గొనవే వీణాపాణి
నా నాలుక  స్థిరవాసము చేసుకోగా
ప్రణతులందుకొనవే వేదాగ్రణి
నా గళమే అవనీ ఇక నీ దేవళముగా

 2.నా కవనము నువు మనియెడి పూవనమైపోనీ
పాఠకులకు సుమగంధము మకరందము పంచగా
నా గీతములన్ని నీకు నగలై ఒప్పారనీ
సాహిత్యము సంగీతము ధగధగలతొ మెరియగా

నమస్సులివిగో సారస్వత సామ్రాజ్ఞి
క్రీగంటనైన నన్ను నువుకాంచగా
చేజోతలందుకోవె పారాయణి
నాతలపై చేయుంచి దీవెనలందించగా

Monday, July 16, 2018



తొలిపూజ గైకొనే ఘన దైవమా
మా గణపతి కావుమా
పలువిధముల నీకు పబ్బతులివె గొనుమా

1.మేలుకొన్న వెంటనే విఘ్ననాయకా
నీ రూపమె చూసెదము మరియేది కనక
మొదటి మాట పలికెదము శ్రీ గణనాయకా
నీ నామమొక్కటే ఇంకేది అనక

కష్టమొచ్చినా కడకు నిట్టూర్చినా
తలుచుకునేది నిన్నె సిద్దీ వినాయకా

2.ఏ చోటికి పనిమీద బయలుదేరినా
ముందుగ మొక్కేదినీకె మూషక వాహన
శుభకార్యమేదీ తలపెట్టినా
తొలుత నిన్నె కొలిచేము గజాననా

అణువణువున నీవుగ మా బ్రతుకువైనావు
కడతేర్చి దరిజేర్చు కరుణాంతరంగా

https://www.4shared.com/s/fINaOK3KNee

Sunday, July 15, 2018



హితము కూర్చని మతములేల
మానవత నేర్పని బోధలేల
హిందువైనా ముస్లిమైనా
బంధుజనులమె అందరం
రాముడైనా రహీమైనా అందకోరా మనసలాం
కృష్ణుడైనా క్రీస్తువైన అందుకోరా వందనం


1.శిశువుకెక్కడ గురుతులుండును
కులముమతముజాతులెరుగ
మనిషికెవ్వరు మార్గదర్శి
సాటిమనిషిని ద్వేషించగ
నేల సర్వుల తల్లిరా
అన్నమే మన నాన్నరా
ఎరుపువర్ణపు రక్తమే
ఎల్లరుల కలిపెడి బంధమౌరా

2. గీత బైబిల్ ఖురానెప్పుడు
భేదభావము నూరిపోసే
ఇరుగు పోరుగు ఎదలనెప్పుడు
గుడి మసీదులు వేరుచేసే
భారతీయత జాతిరా
ప్రేమతత్వమె నీతిరా
ఒకరినొకరు గౌరవించే
ఆనవాయతి మేలురా
వచ్చీనప్పూడల్లా నిన్ను వాటేసుకుంటానె పిల్లా
ముట్టీనప్పూడల్లా నిన్ను ముద్దెంటుకుంటానె పిల్లా
కలలోకొచ్చీనప్పుడల్లా
నిన్నుహత్తూకుంటానె పిల్లా
కబురు ముట్టీనప్పూడల్లా
పెరుగు ముద్దెట్టుకుంటానె పిల్లా

తగవూ నాతోనా  పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ

1.పొద్దూ పొద్దంత నిన్నూ బ్రతిమాలుకున్నా గాని
సుద్దుల సద్దే లేకా  మూతిముడుచూకుంటుంటావు
అద్దారాతిరి నువ్వు గుర్తూకొస్తుంటావు
వద్దూవద్దన్నగాని నన్ను గిచ్చీపోతుంటావు

తగవూ నాతోనా పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ

2.చుక్కలమల్లేలన్ని తుంచి సిగలో తురిమెదనమ్మి
వెన్నెల దుప్పటితెచ్చి పడకన పరిచెద నమ్మి
నీచేతి గాజులు మీటి కొత్తపాటలు కట్టెదనమ్మి
పూచేటి నవ్వులతోటి
సరసాల ముంచెద నమ్మి

తగవూ నాతోనా  పిల్లా ఆపిక అలకలను
తగదే నీకిదీ అమ్మీ సరదాకైననూ


విషాదమే పలికే వీణను మ్రోగించకు
వివాదమే రేపే వాదన పొడిగించకు
మరపునీకు హాయినిస్తే తలపు తలుపు తీయకు
రేపు నిన్ను భయపెడుతుందని నేడు నగవు వీడకు

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక

సంస్కారం నేర్పుతుంది నీకు దువ్వెన
శిఖరాన్ని చేర్చుతుంది నిన్ను నిచ్చెన
మానవతకు కావాలి నీవె వంతెన
అసాధ్యమే సాధ్యమురా చేయగ నువు సాధన

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక


దాహాన్ని తీర్చుతుంది పారేసెలయేరు
త్యాగాన్ని బోధిస్తుంది పచ్చనైన చెట్టు తీరు
మడమతిప్పనప్పుడే గమ్యాలు నిను చేరు
చిత్తశుద్ధి ఉన్నపుడే లక్ష్యాలు నెరవేరు

చింతగూర్చి ఎందుకురా అనవరత చింతన
సంతసాల నందుమురా సమయం చేజార్చక

***   ***   ***  ***   ***   ***   ***   ***  

ఏది ఆనందమో
ఎవరికేది మోదమో
ఏది సుధలు వర్షించే
రసరమ్య రాగమో
ఏది దిగులు తొలగించే
భవభవ్యయోగమో

1.తుషారమే మణులై మెరిసే
ఉషాకిరణ దర్శనమో
సమీరమే తనువు తడిమే
ఆత్మీయ స్పర్శసౌఖ్యమో
సీతాకోకచిలుకలు ఎగిరే
పుష్పవన దృశ్యమో
గిరిశిఖర చుంబనతో
పులకించే మేఘమైకమో

2.లేడికూనలా దుమికే
జలపాత పరవశమో
చిరుజల్లుకు తడిసిన నేలన
గరికవిరుల సంబరమో
విరిసిన హరివిల్లుకు మురిసే
ప్రకృతికాంత ఆహ్లాదమో
వెన్నెల రేయి కొలను కలువకు
కలిగే కడు తన్మయమో
https://www.4shared.com/s/ffzpUKgJCgm

Friday, July 13, 2018

ఫలించిన కలవే నీవు-వరించిన వరమే నీవు
హృదయాంతరాలలోని-ప్రణయ భావన నీవు
జన్మాంతరాలనుండి-పెనవేసిన బంధము నీవు
త్వమేవాహమైన వేళ-తన్మయత్వమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే-అనుభూతివి నువ్వు
జీవన 'గీత'వు నువ్వు

1.నన్ను లాలిస్తూ అమ్మవైపోతావు
నడవడికను సరిదిద్దుతూ నాన్నగా మారుతావు
లౌక్యాన్ని బోధిస్తూ గురుతుల్యవౌతావు
నీడలాగ తోడుంటూ నేస్తమే నీవైనావు
బేలగా అడుగిడినావు భార్యామణివైనావు
ఆలిగా ముడిపడినావు అర్ధాంగివైనావు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే
అనుభూతివి నువ్వు జీవన 'గీత'వు నువు

2.ఇంటికే వన్నెలుతెచ్చే-ఇల్లాలివైనావు
మాటకే పదుగురు మెచ్చే-మమతవే నీవైనావు
మా చిన్ని సామ్రజ్యాన మహారాణివే నీవు
పలు చింతల కాపురాన చింతామణివైనావు
ఊరుఊరంతా బాంధవ్యం కలిపేస్తావు
ఆతిథ్యం అన్నపదానికి మరో అర్థమేనీవు

ఆనందము నువ్వు ఆహ్లాదము నువ్వు
తలపులకే పులకరమొలికే అనుభూతివి నువ్వు
జీవనగీతవు నువ్వు

Tuesday, July 10, 2018

మెరిసి కురిసె ఘన మేఘం..
తడిసి మురిసె అవని దేహం
పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం

1.పిల్ల తెమ్మెరలు అల్లన వీచగ
నీటి తుంపరలు ఝల్లన తాకగ
మోడులు సైతం చివురులు వేయగ
వర్ష ఋతువు హర్షాల నీయగ

పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం


2.కరువు కాటకముల దరిరానీయక
చెరువులు నదులు
కళకళలాడగ
విశేషమ్ముగా పంటలు పండగ
కృషీవలుడి కిల కలలు పండగ

పాడెను ప్రకృతి అమృతవర్షిణి రాగం
పరవశించి నర్తించెను హృదయ మయూరం


https://www.4shared.com/s/fx3PCSyP_gm

Saturday, July 7, 2018

నిద్దురతో దూరము
మనసుకున్న భారము
శయనమె పరిహారము
వెతల చితుల హననము

గాయాలకు ఔషధము
బడలికకుపశమనము
మేను నేను పరస్పరం
మెలకువయే వరకు ఎరికివారం

కలలకు ఉద్యానము
కథలకు ఉద్దీపనం
వరించినంత భాగ్యము
దరిజేరకున్న  వైరాగ్యము

నిద్ర ఒక రోగము
నిద్ర వైభోగము
నిద్ర ఒక యోగము
నిద్ర మనిషికి యోగము

Friday, June 29, 2018

వెన్ననీకు వ్యసనము
మన్ను నీకు అశనము
వన్నెల గోపికలు
వెన్నెల వీచికలు
కన్నయ్యా నీకు
కడు ప్రీతికరములు
కృష్ణయ్యా నీకివే
మా ముకుళిత కరములు

1.ఇంటిసొమ్ము పంచుతావు
పరులది ఆశించుతావు
చోరుడ వను పేరునీకు సార్థకమే
కొల్లగొట్ట ప్రతి బ్రతుకు పారమార్థికమే

2.వెదరునూద సుధలు చిలుక
రాసలీల మధురమొలక
యమున తాను స్థాణువవద
బృందావని మురిసిపోద

3.సమాగమాన తాత్వికతను
అంతానీదగు భావుకతను
అడుగడుగున తెలిపినావు
అనిగీత నుడివినావు
లాలిపాట ఇది
జాలిపాట ఇది
జోలపాట ఇది
విధిలీల పాట ఇది
లాలి జో ...జోలాలిజో

1.సమసిపోని వెత ఇది
ముగిసిపోని కథ ఇది
మరపురాని గతమిది
అంతులేని పథమిది
లాలిజో.. జోలాలిజో..

2.గెలువలేని ఆట ఇది
నిలువరాని చోటు ఇది
పలుకలేని మాట ఇది
చెల్లలేని నోటు ఇది

లాలిజో..జోలాలిజో..

3.మందేలేని నొప్పిది
తీర్చలేని దప్పిది
రాయలేని కవిత ఇది
మోయలేని బ్రతుకిది

లాలిజో..జోలాలిజో..

పరాయి వాడివనా నిన్ను నేను పదేపదే ఏమని వరాలు కోరను
ఇలవేల్పువు నీవేకద అడగక ఈడేర్చనూ
పవనాత్మజా నీ పాదాలు కలనైనా వదలను

కొండగట్టుమీద దండిగ కొలువైనావు
గుండెధైర్యమీవె మా గండాలు తొలుగగను

1.నిన్ను నమ్మితే చాలని చెప్పినారు
చిన్ననాటినుండి మా అమ్మానాన్నలు
కంటికి రెప్పవై కాచెద వంటూ
కథలుకథలుగా నీమహిమలు తెలిపినారు
భూతాలు ప్రేతాలు మనోఉన్మాదాలు
నీపేరు పలికినంత తోకముడుచు వైనాలు
కొండగట్టు మీద దండిగ కొలువైనావు
గుండెధైర్యమీవె మా గండాలు తొలగగను

2.అలనాడుసీతమ్మకంగుళీయకమ్మిచ్చి
ముదమార దీవెనలు అందుకొన్నావు
ఎడబాసిన దంపతులకు ఊరట కలిగించి
రామబంటువైనీవు కీర్తిపొందినావు
రోగాలు పీడనలు ఏఈతి బాధలైన
తొలగిపోవునయ్య స్వామి పాడుకుంటె నీ గాథలు

కొండగట్టు మీద దండిగ కొలుమైనావు
గుండె ధైర్యమీవె మా గండాలు తొలుగగను

"పర్యావరణం"

ప్లాస్టిక్కవరు మానండి బాబులూ -
క్లాత్ బ్యాగు వాడండి
పేపర్ ప్యాక్ మేలండి తల్లులూ 
ఇకనైనా కళ్ళుతెరవండి


నశించి పోనట్టి వస్తువేదైనా
వసుధకు భారమె ఏనాటికైనా
మట్టిలో కలిసిపోని దేదైనా
ముప్పే ఈ ప్రకృతికి ఎప్పటికైనా

నదులు సముద్రాలు 
కలుషితమౌతున్నాయి
జీవజాలమెంతో 
అంతరించిపోతోంది

శతాబ్దాల ముందెంతో 
హాయిగా ఉండేది
పర్యావరణమే తానుగ
సమతుల్యత నొందేది

మట్టి, లోహ పాత్రలదే
ప్రముఖ పాత్ర బ్రతుకున
నూలువస్త్రాలతో మేనికి
హానిలేని సుఖపోషణ

రాబోయే తరాలనూ 
భూమి మీద మననిద్దాం
హాని అంటూ లేనేలేని
స్వర్గాన్నిలపై సృష్టిద్దాం


వెదికినా దొరకదు దయ నీ లోన
కనుగొనలేదెపుడు కరుణ నీహృదయాన
భోలా శంకరా మార్చుకో పేరైనా
భక్తవ శంకరా సవరించకో తీరైనా

1.తండ్రివి నీవని తలిచాను ఇన్నాళ్ళు
దాతవు నీవని మొక్కాను మొక్కుళ్ళు
నీకూ ఉన్నారుగా ఇరువురు సుతులు
వారివైన చూస్తావా అతీగతీ స్థితులు
పట్టించుకోకనే ముక్కుమూసుకున్నావా
ఇల్లుచక్కబెట్టలేక దేశద్రిమ్మరైనావా
పరమ దయాళా మార్చుకో పేరైనా
కాళహస్తీశ్వరా మరువకు నీ తీరైనా

2.పగవాడు కూడ పెట్టడయ్య ఇంత హింస
మరణమే మేలని భరించక ఈవింత గోస
విషం మ్రింగి కాచినావు లోకాలను సైతం
విషమైనా ఈయలేవ తీర్చకుంటె నా దైన్యం
చక్కదిద్దలేకుంటే నీ పిల్లల జీవితాలు
మన్నుబుక్కనా స్వామినీ కిన్నిగుళ్ళుగోపురాలు

గోకర్ణేశ్వరా ఇదేనా నీ భూకైలాసం
ఎంతకాలమయ్యా నీ ఈ కౄరవిలాసం

Sunday, June 17, 2018

రచన:రాఖీ

నటియించలేనురా నీయంత చతురతన
నేనాడలేనురా నీ రీతి నిపుణతన
జగన్నాటక సూత్రదారీ
జగన్నాథ హే మురారీ
హద్దంటు లేదా ప్రభూ నీ సయ్యాటకు
తెరదించవేలరా ఇకనైనా నా బ్రతుకు ఆటకు

1.అడుగడుగున సుడిగుండాలు
పథమంతా కడుగండాలు
ఊహించని ఎన్నో మలుపులు
ఉత్కంఠతొ ఓటమిగెలుపులు
రసకందాయమయ్యేలా నా కథను
అనుక్షణమూ పెంచేయాలా నా వెతను

పద్ధతే లేదా స్వామీ నీ దొంగాటకు
నిచ్చెనల ఊసేలేకా బలేనా పాముకాటుకు

2.కష్టాల కడలిన నను తోస్తే
శరణంటా ననుకున్నావా
వేదనల ఊబిలో పడవేస్తే
వేడెదనని భావించావా
ముంచినా తేల్చినా దిక్కెవ్వరు నువ్వు వినా
ఇచ్చింది ఏదైనా పొగడగ నే ఘన కవినా

వెంటాడి క్రీడించకు చదరంగ బంటును
సుధామధురమాశించకు నేను చొప్పదంటును

https://www.4shared.com/s/ft4HLZH5uee

Tuesday, June 5, 2018

బాధ్యతలను పంచుకొని బంధనాలు తెంచుకొని
ఎగిరిపోతుందిగా చిలుకా
దీని మర్మమేమిటో ఎవరికి ఎరుకా

1.ఉన్నంతకాలమే
ఐనవాళ్ళు కానివాళ్ళు
నాదినాదనుకుంటూ
ఈ ఇళ్ళూ వాకిళ్ళూ
నూలుపోగైన వెంట
తేలేదని మరచిపోయి
గడ్డిపరకైన మోసుకెళ్ళమనే
నిజం విడిచి

ఆరాటమెంత,ఎంత చింతరా
అద్దెకొంప దేహమెంత వింతరా
వదలాలని లేకున్నా నిస్సహాయంగా
ఎంతగింజుకున్నాగాని
గత్యంతరమేలేకా

ఎగిరిపోతుందిగా చిలుకా
ఏడవాలుతుందో ఎవరికి ఎరుకా

2.వచ్చిన పని ఏమిటొ
ఎంతకూ గ్రహించక
సాటిమనిషి నిలలో
ఎందుకో ప్రేమించకా
ఉఛ్ఛ నీచాలస్థాయి
నసలే మరి ఎంచక
కూడనివన్నిచేసి
తప్పని తానొప్పక

ఎదుటివారు బాగుపడితె
ఏమాత్రం ఓర్వక
మంచికొరకు ఇంచుకైన
సమయం వెచ్చించక
చేయగలుగు సాయమైన
ఏనాడూ చేయక
రేపు చూద్దామనుచు
వాయిదాల నొదలక

ఎగిరిపోతుందిగాచిలుకా
బ్రతుకు వృధా అయ్యిందని తెలియకా