Monday, May 15, 2023

 

https://youtu.be/8GgQVHm3NvU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:వసంత

ఆరిపోయే దీపమవకు కాంతిగా వెలుగుతూ
మూగవోయే కంఠమవకు వెర్రిగా వదురుతూ
వాదనలు మార్చగలవా  వ్యక్తుల నడవడిని
బోధనలు కూర్చగలవా  సరికొత్త ఒరవడిని
స్వేఛ్ఛగా సాగనీ నియమాల వలలే పన్నక
పావురమై ఎగిరిపోనీ శాంతిగా ఇక తిన్నగా

1.ఎదుగులకు విఘాతమే అహంభావము
అభ్యసన తప్పదు ఎవరికైనా జీవితాంతము
ఉలి దెబ్బలు తినకుండా శిల శిల్పమవుతుందా
ఉమ్మనీరు లేకుండా జన్మంటూ ఉంటుందా
మౌననే కలహం నాస్తని మరచితివా ప్రియనేస్తం
మన్ననే ఒంటబడితే బాంధవ్యమె లోకాస్సమస్తం

2.పరిపూర్ణులు కారెవరూ మనమైనా మందైనా
నిష్ణాతులు లేరెవరూ ఇలలో ఏ కాలమందైనా
సంక్లిష్టత అవసరమా సరదాల వేదికయందైనా
నచ్చినట్టు పాడుతూ వెనకాడకు వేయగ చిందైనా
చల్నేదో రామకిషన్  పట్టువిడుపు నేర్చుకో
గింజుకునుడు మానివేసి లైఫంటే లైట్ తీసుకో