Wednesday, July 1, 2009

ఈ మూగ గొంతులో –సంగీతం పలుకునా
ఈ మోడు గుండెలో-వాసంతం చిలుకునా
నాలో చెలరేగే దావానలమిక ఆగునా
ఆగని కన్నీరే ఇల గోదారిగ పారునా

1. చేసిన ఆబాసలు-రేపెను పలు ఆశలు
ఆ బాసలు నా బ్రతుకును బలిపశువుగ చేసెనా
ఆ ఆశలు మరునిమిషము అడియాసగ మారెగా
మనసులు ఎడబాసెగా

2. ఇది ఎంగిలి విస్తరాకు-
ఈ ముంగిలి చేరరాకు
చితికే చినదాని బ్రతుకు
చితికే ఇది చేరు తుదకు

2 comments:

Padmarpita said...

కొంచెం భాధ ఎక్కువైనట్టుందండి...

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీరు చక్కగా నా గీతాలకు స్పందిస్తున్నందులకు నా కృతజ్ఞతలు!
విషాద గీతాలే కాదు ,అనంద,ప్రేమ,భక్తి,దేశభక్తి,అభ్యుదయము ఇలా అన్ని రకాల భావాలు నా గీతాల్లో ప్రతిఫలిస్తాయి.జీవితమంటే సుఖదుఃఖాల భావోద్వేగాల సమాహారమే కదా!ఒక్కొక్కటి గా అన్నింటిని అనుభవించి పలవరించండి
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ
rakigita9@gmail.com

rakigita9@yahoo.com