Thursday, July 2, 2009

అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
నీ నామ భజన నేనుదప్ప
స్వామి శరణ మయ్యప్ప
దిక్కెవరూ నాకు నీవుదప్ప
1. నల్లబట్టకట్టినాను-కల్లబొల్లి మాటలే మానినాను
తులసిమాల వేసినాను-కల్లు బీడి వ్యసనాలు వీడినాను
ఉదయం లేచింది మొదలు-రేయి నిదురించు వరకు
నీ నామ భజన నేనుదప్పా- స్వామి శరణ మయ్యప్ప
2. కన్నెస్వామినైనాను-కలికి ధ్యాస వదిలినాను
గురుస్వామి సేవచేసినాను-గుండెలొ నిను నింపినాను
దీక్షగైకొన్నదిమొదలు-మోక్షము దొరికేటివరకు
దిక్కెవరూ నాకు నీవుదప్ప- స్వామి శరణ మయ్యప్ప
3. నెయ్యాభిషేకమే- కన్నులార గాంచితి
మకరజ్యోతినే స్వామి మైమరచి నే జూసితి
నేలపై జీవించింది మొదలు-హాయిగ నీ సన్నిధి చేరువరకు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పా - స్వామి శరణ మయ్యప్ప

No comments: