Thursday, August 27, 2009

మంచితనం రుచిమరిగితె మరువలేమురా
మానవత్వ విలువెరిగితె వదలలేమురా
దానగుణం అలవడితే చింతదూరమగునురా
ప్రేమైక జీవనమే సచ్చిదానందమురా
1. గెలుపు గుఱ్ఱమెక్కితే మడమతిప్పలేమురా
పనిలో తలమునకలైతె పరవశాలె సోదరా
నీడనిచ్చు గూడును కాపాడుకోవాలిరా
కన్నతల్లి ఋణము కాస్తైన తీర్చుకోవాలిర
2. ఎదుటివారి మనసునెరిగి మసలుకోవాలిర
నాణానికి అటువైపును లెక్కతీసుకోవాలిర
నీవు కోరుకునే ప్రతిది ఇతరులు ఆశించేరుర
వారిస్థానమందు నిలిచి నిన్నూహించుకోర
3. లోటుపాట్లు అగచాట్లు అన్నిట ఉంటాయిరా
పొరపాట్లు గ్రహపాట్లు ఎదురౌతుంటాయిరా
అధిగమించి సాగు నీవు ఆత్మవిశ్వాసముతొ
చేరగలవు ఒకనాటికి మహితాత్ముల మధ్యలో