Saturday, January 8, 2011

“నువ్వెప్పటికీ అర్థంకావు”

“నువ్వెప్పటికీ అర్థంకావు”

ప్రేమ గీతంలో ఏమి దాగుంది
నీ వలపులు నీ పిలుపులు నీ తలపులు
మౌన హృదయంలో ఏమి మిగిలుంది
నీ ఊసులు నీ ఊహలు నీ బాసలు

ఓ సయ్యాటల నెరజాణా
నా జీవితాన మ్రోగని వీణ

1. గిల్లి కజ్జా పెట్టుకుంటావ్
నల్లిలాగ కుట్టుతుంటావ్
లొల్లిలేని క్షణమేదైనా మిగిలిందా మన మధ్య
కల్లబొల్లి మాటల ప్రేమ ఎప్పటికీ ఒక మిథ్య
వల్లకాడుగా మార్చి సేదదీరుతుంటావు
బ్రతుకుగోడుగా చేసి నువ్వు నవ్వుకుంటావు

2. ఎలానడుచుకుంటే మెచ్చుకుంటావో
ఏమాటకు నువ్వు నొచ్చుకుంటావో
ఎడారిలో వసంతమల్లె మల్లెలనే రువ్వుతావు
శరత్తులో తుఫానులాగా భీభత్సం సృష్టిస్తావు
నిన్నువదిలి నిలువలేనే నిమిషమైన నా చెలీ
నిన్ను నేను గెలువలేనే-నీకు వశమైనానె చెలీ