Wednesday, April 29, 2009

రంగుల పండుగరా- ఎదలు పొంగే పండుగరా

రంగుల పండుగరా- 
ఎదలు పొంగే పండుగరా /
చిందుల పండుగరా- 
కనువిందుల పండుగరా /
అందాలు చింది అనుభూతి నింపి 
ఆనందసాగ రాలందు ముంచే…

 1. మరుమల్లెతెలుపు-రోజాల ఎరుపు 
-మురిపాలు చిందగా/
చామంతి పసుపు-కనకాంబరాల-వర్ణాలు కురియగా/
 ఆనింగినుండి ఈనేలవరకు హరివిల్లు విరియగా /
దివి భువికి నేడు దిగివచ్చె చూడు సౌందర్య లహరిగా

 2. చల్లాదనాల మామీడి తోట ఒక వేదికై నిలువగా/ పచ్చాదనాల వరిపైరు తాను తలయూచి మురియగా/ కమ్మాదనాల కోయీల పాట కచ్చేరి సాగగా/ నాల్గూదినాల ఈ బ్రతుకులోన ఈ హాయి చాలుగా

No comments: