Wednesday, April 29, 2009

OK

కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

ఎవరము ఎరుగము దీనివైనం


1. లేనె లేదులే దీనికి గమ్యం

ఎవరు ఆపినా ఆగదు గమనం

ప్రగతి చచ్చినా ప్రళయమొచ్చినా

మార్చుకోదులే తన మార్గం


కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

ఎవరము ఎరుగము దీనివైనం


2. స్వర్ణయుగాలను జీర్ణించుకుంది

రాజమకుటమై వెలుగొందింది

రాచరిక మేమో ఆగుతోంది

కాలమింకా సాగుతోంది-కొన సాగుతోంది


కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

ఎవరము ఎరుగము దీనివైనం


3. ఓడను బండిగ చేసే కాలం

చరిత్ర కోరే పిపాసి కాలం

మహిమ గలదిలే కాలం

దైవానికి ఇది నిజరూపం


కాలం కాలం-ఇది ఆది అంతము లేని కాలం

ఎవరము ఎరుగము దీనివైనం


No comments: