https://youtu.be/8jJ0iyy5SP4
దిన దినమూ ఇనుమడించె నీమేని మిసమిస
అణువణువూ పెట్టసాగె గోముగా గుసగుస
తట్టుకోలేనీ పడుచు వయసు నసనస
చూడకలా రుసరుస వదిలి వెళ్ళకే విసవిసా
1.పారాడే మేఘాలో తారాడే భ్రమరాలో నీకురుల దెస
వెన్నెల గనులో ఇంద్రనీలమణులో కనుగవల పస
ఊరించే బూరెలో గులాబీ నిగ్గులో నీ సిగ్గుల వరస
దానిమ్మగింజలో ముత్యాల దండలో నీ పలువరుస
2. కనుదోయి నే దో చేసే పెను చనుదోయి
మదిహాయిని పెంచేసే నీ నడుమే సన్నాయి
దోసగింజ తలపించే నాభిగాంచ మతిపోయి
కాసేపైన చాలు బ్రతుకు - నీకడ బానిసయి
No comments:
Post a Comment