https://youtu.be/zMJcMQhltOI?si=hVWYvOR--awrDX1w
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
ఒద్దికకేమో పధ్ధతిగా అల్లిన పువ్వుల దండ
ఓపిక లో ఎప్పుడు చెదరని తొక్కుడు బండ
నీవే నా పాలిటి చొక్కపు బంగారు కొండ
అడుగడుగున అనునిత్యం నీ అండా దండా
హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నీతో నా జత జీవితమంతా
1.ప్లవించేవు రస గీతమై రాఖీ కలం గుండా
ప్రవేశించినావు నా బ్రతుకున కలలే పండా
కాపురమంతా ప్రేమ ఘుమ ఘుమలే నిండా
కమ్మదనమే ముప్పొద్దులా వలపులు వండ
హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నాతో నీ జత జీవితమంతా
2.నీ నవ్వుల్లో ఇల్లంతా చీకటే లేని చోటై
నీ పలుకుల్లో అందరికీ ఆత్మీయత పరిపాటై
ఉల్లాసం నీలో... ఆమని కోయిల పాటై
నీవే నీవే నడిచే పరిమళలా పూదోటై
హ్యాపీ బర్త్డే టూ యు గీతా
మధురమే నాతో నీ జత జీవితమంతా