https://youtu.be/YErqllhxywg?si=9cM2_8W8DA6ijJqx
నేనంటూ ఉండను రేపటి చోటులో
నాకంటూ ఉండదు స్థానమేది కవనబాటలో
బ్రతికుంటా చితి కాలినా నా ప్రతి పాటలో
నినదిస్తా పాడేగొంతులో స్పందిస్తా ఎద ఎదలో
1.అక్షరమవుతా అక్షరమై లక్షల మంది యాదిలో
నిలిచిపోతా నే నిత్యమై గీతిని మెచ్చే ప్రతి మదిలో
గానమై నర్తిస్తా ఆనందంగా కదిలే పెదవుల వేదికపై
ప్రాణానికే హాయినిస్తా ఆహ్లాదంగా తేలి వచ్చే వీచికనై
2.ఏ కోవెలలోనో హారతి కృతినై స్వామిని ఆర్చిస్తా
ఏ భక్త బృందంలో భజన కీర్తనగా స్వాముల నలరిస్తా
తొలి చూపుల భావనకే ఊతమై ప్రేమికులనే జతజేస్తా
లాలిపాడే అమ్మ పాటనై బుజ్జాయిని నే బజ్జో పెడతా
OK