https://youtu.be/NUluLxSipO8?si=a54W8biTqtnH1kH5
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:హిందోళం
దేవ ఋణం ఋషి ఋణం పితృ ఋణం
తీర్చుకోగ వదిలాలి మనం తిలా తర్పణం
వంశాభివృద్ధికి పెద్దల దీవెనలే మూలకారణం
వసురుద్రాదిత్య రూపులవుదురు పితరులు మరణానంతరం
పిండప్రదానాలతో సంతృప్తి పరచాలి పితరులను
ప్రతీ సంవత్సరం
1.ఊర్ధ్వ లోక పయనమౌను-దేహమునొదిలిన ఆత్మ
ఉత్తమగతులను అశించును కోరుకోక మరే జన్మ
సత్కర్మల ఫలితముతో ప్రాప్తించును స్వర్గవాసము
పున్నామ నరకం దాటించడమే పుత్రుల కర్తవ్యము
2.పితృ పక్షాలలో సంతుష్టులవ్వాలి పితరులు బ్రాహ్మణ భోజనాలతో
ఉత్తరాయణ పుణ్య సమయాన సద్గతులు పొందాలి పెద్దలు తిలా దానాలతో
పుష్కరాలందున గతించిన బంధుజనులకూ సంతర్పణ చేయాలి పిండ ప్రదానాలతో
పితృయజ్ఞమొనరించి ఆశీస్సుల నొందలి తరాలు అంతరించి పోకుండా శ్రద్ధాసక్తులతో