Tuesday, April 22, 2025

 https://youtu.be/908qgrG3CvI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం: మధ్యమావతి

తిరుమలేశు వాసిగొలిపె అన్నమయ్య పదములు
రామభద్రు జాడ తెలిపే శ్రీ రామదాసు కీర్తనలు
ధర్మపురి నరసింహుని ఖ్యాతినిలిపె
భక్త కవి శేషప్ప నుతించిన పద్యములు
నరసింహ శతక పద్యములు
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

భిక్షటన వృత్తిగా హరినామ సంకీర్తనే ప్రవృత్తిగా
నరసింహుని భక్తులలో అపర ప్రహ్లాదుడు
నరహరి త్రిశతి నభినుతించిన నిత్యసిద్ధుడు
నృకేసరి శతపద్యకృతి వెలయించిన ప్రసిద్ధుడు
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

భూషణ వికాస శ్రీ ధర్మపురనివాసా-దుష్ట సంహార నరసింహ దురితదూర
పద్య మకుటమెరుగని మాన్యులేరి సామాన్యులేరి
శేషప్ప కవి ప్రణీత పద్యమేలేని పాఠమేది తెలుగు పాఠమేది
శేషప్పనెరుగని తెలుగు పండితులేరి ధర పామరులేరి
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు

లక్షాదికారికీ లవణమన్నమేయన్నది నానుడిగ వాడబడే
తక్షణ హరినామస్మరణ అగత్యమన్న నుడి నుడివే ఆనాడే
మోక్షమొక్కటే అక్షరసిరి యని దాతృత్వఘనత నెరిగించినాడే
లక్షలాది జనుల నాలుకలపై రోజూ ఆయన పద్యాలు నాట్యమాడే
ప్రాతః స్మరణీయుడు కవి శేషాచల దాసు
మా ధర్మపురీయుడు కాకుత్సమ్ శేషాచలదాసు