Monday, September 16, 2024

 *ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం*


సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।

ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥

పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।

సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥

వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।

హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥


ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।

సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం: 


ద్వాదశ జ్యోర్లింగాలు భారతావనిలో 

ద్వాదశ స్వరస్థానాలు సంగీత స్వనిలో 

సంగీత శాస్త్ర స్రస్టవు కదా నీవు శివా 

సహజమే సారూప్యత భవా ప్రణవ సంభవా 

నమః శివాయ గురవే ప్రణతి దక్షిణామూర్తయే మహాదేవా 


1.షడ్జమ సాకారం భజే సోమనాథమ్ 

శుద్ధ ఋషభం శ్రీశైల మల్లికార్జునమ్ 

చతుశ్శ్రుతి ఋషభం ఉజ్జయినీ మహాకాలమ్ 

సాధారణ గాంధారస్థావరం ఓంకారమమలేశ్వరమ్ 

అంతర గాంధార విలసితం పరళి వైద్యనాథమ్ 


2.శుద్ధ మధ్యమాశ్రితం ఢాకినీ భీమశంకరమ్ 

ప్రతిమధ్యమ స్వరవరం సేతుబంధ రామేశ్వరమ్ 

పంచమం అచల స్వరాక్షరం దారుకావన నాగేశ్వరమ్ 

శుద్ధ ధైవత సంస్థితం వందే వారాణసీపుర విశ్వనాథమ్ 

చతుశ్శ్రుతి ధైవతాన్వితం  గౌతమీతట త్రయంబకేశ్వరం 


3.కైకసీ నిషాదయుతం తం హిమగిరి కేదారేశ్వరం 

కాకలీ నిషాద సంయుతం  సతతం నమామి గృష్ణేశ్వరమ్ 

గతి సంగతీ నటరాజ నర్తనం - గమకం నమక చమకావర్తనం 

లయకారం రాగవిరాగం వందే ధర్మపురీ రామలింగేశ్వరమ్ 

సాంగనుతిర్మృదంగతాళ భంగి చలిత అభంగ  శుభాంగ  ఉత్తుంగ తరంగ గంగాధరమ్ 


 

https://youtu.be/x6hkrdAFdqs?si=-4wLZ1XlvfShARPx

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: కానడ

మరపురాని చిరునవ్వువు
మాటల మల్లెపువ్వువు
మైత్రికి ఇలలో మరో పేరువు
మా మాడిశెట్టి గోపాల్ నువ్వు

1.ఉద్యోగం కొనసాగింది జీవితభీమాగా
వేదికపై నీ వ్యాఖ్యనం ఎంతో ధీమాగా
ప్రతివారికి నీ పలకరింపు మనసారా ప్రేమగా
నీ కవనం దవనమై నెత్తావిని చిమ్ముగా
బహుముఖ ప్రజ్ఞాశాలివీ మహా వినయశీలివి

2.పలు సాహితీ సంస్థల నిర్వహించి
సాటి కళాకారులెందరినో ఆదరించి
దేశ విదేశీ పురస్కారాలెన్నో గ్రహించి
అనంతచార్య తో కరినగరం బ్రదర్స్ గా భాసించి
కీర్తి గొన్నావు వాఙ్మయసేవనే శిరసా వహించి