ఎంతా సక్క గున్నాడో -సుక్కల్లో సందామావలా/
దినాము పున్నమి లెక్కనే -ఆడు తోడుగ నా పక్కనుంటే/
ఎంత ముద్దు గున్నాడో - తూరుపింటి తొలిపొద్దులా/
బురుదలొ తామర పువులా -సంబుర పడ్తా ఆణ్ణి సూత్తా ఉంటే/
ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే/
కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి
నాకంటా
1.అందని ద్రాచ్చ గుత్తులే ఆని మత్తయిన గమ్మత్తు కైపుకళ్లు/
సూపులు సూపుల్తో కలిత్తే సొత్తాయి గుండెన తుపాకిగుళ్ళు/
కండలు దిరిగిన సేతుల్తో ఆడు ఊపిరాడ నీక కావలిస్తే/
ఊడిగమే నే సేస్త నా బతుకంతా మారు మాటాడక కావలిస్తే/
ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే/
కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి
నాకంటా /
2.ఆడింటి ముంగిట్లోముగ్గునవుతా గొబ్బినవుతా నాకోసం కూసింత నవ్వాడంటే/
పంటికింద సికెన్ నవుతా పడకింట సిలక నవుతా కాసింతనాతో జత గూడాడంటే/
ఆడెదురు పడ్తే బెదురు గొడ్డు నవుతా - అని గాలిసోకిందా ఎగిరే ఎండు గడ్డి నవుతా/
ఏలుకుంటే గంతేసి ఆడికి ఆలినవుతా- పంచన ఉంచు కున్నామానే బాంచ నవుతా/
ఏడేడు జన్మలు ఎదిరిసూత్త బెమ్మ దేవుడో - ఆడు మనువాడుతానంటే /
కమ్మాని ఆ కలగంట నా కంటా -ఇత్తే గిత్తే ఆ భాగ్గె మియ్యాలి
నాకంటా
OK