https://youtu.be/L_xDG_BEHPk
పల్లవి: మనలేను
ప్రభూ
నిమిషమైన
నిన్ను గనక
ఏమనలేను
ప్రభూ
అంతా నీ మాయ గనుక
అనుపల్లవి: నీ దృక్కులు ప్రసరించు
నీ దయ కురిపించు
చేయిపట్టి
నడిపించు
కడదాకా విశ్వ జనక
చరణం:1) అందాలను చూపెట్టి
బంధాలలొ
పడగొట్టి
తాయిలాలు ఆశపెట్టి
కావాలని పట్టుబట్టి
లోకమనే మైకంలో
నిర్దయగా నను నెట్టి
చోద్యమింక చూతువేల
ఓ జగజ్జెట్టి....
చరణం:2) నిను చదువగ వేరే
బడికేగుట అవసరమా
నినునిలుపగ ఎదలో
గుడికేగుట సంబరమా
సూత్రధారి వీవని
పాత్రధారి నేనని
మర్మమెరుగునoతలోనే
మరల మరపు చెరలొ
బడితి