Saturday, August 26, 2017

https://youtu.be/LVWQdy-LXaI

సేవల పాయసము
చేసి ఉంచాను నీ కోసము
ఆరగించర మూషిక వాహన
నన్నాదరించర దీనజనావన

1.కమ్మని వాసన రావాలని
తుమ్మెద వాలని మల్లెలని
ఎరుపంటె నీకెంతొ ఇష్టమని
విరిసిన మందార పూవులని
సిద్ధపరిచాను సిద్ధివినాయక
చిత్తగించర శ్రీ గణనాయక

2.పంచామృత సమ నీనామగానం
పంచమ స్వరమున పలికించు వైనం
తలపోయ తెలిసే పికగాత్ర మర్మం
పులిమితి నామేన ఆకృష్ణ వర్ణం
ఆలపించితి నీ దివ్య గీతి
ఆలకించర ఓ బొజ్జ గణపతి

3.నా నయనాలే దివ్వెలుజేసి
వెలిగించానిదె మంగళ హారతి
నా హృదయము జే గంటగజేసి
మ్రోయించానిదె మంజుల రవళి
నా మనసే గొను నైవేద్యము
కరుణించి వరమిడు కైవల్యము

Wednesday, August 16, 2017

గుండె లో గుచ్చుకున్న పూబాణం నీవు
తలపులో చిక్కుబడిన తూనీగవు నీవు
నవ్వుతో చంపుతున్న ప్రియవైరివి నీవు
చూపులతో లోబచే మంత్రగత్తెవే నీవు

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..

1.సౌందర్యం మోహినిదే అదికాదు నీ ఘనత
మాధుర్యం కోయిలదే గాత్రం కాదు ప్రథ
ఔదార్యం శిబి దేలే అది ఓ పాత కథ
సహచర్యం నీదైతే విశ్వంలో నవ్య చరిత

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..

2.అధరాలకు అడ్డుగా తుమ్మెదలతొ ఒక బాధ
నయనాలకు సీతాకోక చిలుకలే ఎపుడు జత
కపోలాల నందబోగ కందిరీగలతొ చింత
నాభి చెంతచేరనీక తేనెటీగలే రొద

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..

OK
స్మృతులే మధురం
మదిలో పదిలం
మృతి త్రెంచని బంధం
స్నేహం స్నేహం స్నేహం

1.అలనాటి బాల్యం
అపురూప కావ్యం
విలువే అమూల్యం
చెలిమి సదా నవ్యం

2.విద్యార్థి లోకం
వింతైన మైకం
దరిరాదు శోకం
సర్వస్వమే నేస్తం

3.నిండైన హితుడు
గుండె నిండ మిత్రుడు
ఏకైక ఆప్తుడు
నిజప్రేమ పాత్రుడు

Wednesday, August 9, 2017



వృధా చేయబోకు నేస్తం-ఏఒక్క క్షణము చేజార్చుకున్నావంటే-దొరకడమిక దుర్లభము

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

1.అంగడిలో కొనగలేనిది
వ్యసనాలతొ పొందలేనిది
ఎంతగాలించినా ప్రపంచాన దొరకనిది
ఏడేడు లోకాల్లోనూ లభ్యమవనిది
నీలోకి తొంగి చూడు నిత్యమూ కనబడుతుంది                            నీ అంతరంగానా నివాసమై ఉంటుంది

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

2.ఆరోగ్యం ఆత్మబంధువు-
ఉత్సాహం ప్రాణమిత్రుడు
దరహాసపు తోటలోన సంతోషమె అమరపుష్పము
సంతృప్తి తామరాకుపై గెలుపే తుషార బాష్పము
పంచుతూ పోయే కొద్దీ పదింతలై పెరిగేదీ
ఓటమన్నదిలేకున్నా ఒదిగి ఒదిగి ఉండేది

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

Tuesday, August 1, 2017



చీకటి రేయి తెల్లవారదు,
వెన్నెల హాయి నన్ను చేరదు
ఎదురుతెన్నులే జీవితమంతా
అశనిపాతమే బ్రతుకంతా!!

చెలగాటం చెలియ నైజము
ఆరాటం నిత్యకృత్యము
తీరేనా నా మధుర స్వప్నము
తీరానా..కన నవ్యలోకము

వలపన్నె వలపుతోనే
ఎరవేసే సొగసుతోనె
మీనం మేషం లెక్కలెంచక
మీనము నైతి బెట్టుసేయక
నుదుటి పైన ముద్దు పెడితె నందివర్ధనం
కనులపైన ముద్దు పెడితె కమల కోమలం
ముక్కు పైన ముద్దు పెడితె సంపంగి పరిమళం
పెదవి పైన ముద్దుపెడితె పారిజాత పరవశం

చెక్కిలి పైముద్దు పెడితె ముద్దమందారం
చుబుకముపై ముద్దుపెడితె
శ్రీగంధ చందనం
చెవితమ్మెన ముద్దుపెడితె సన్నజాజి సోయగం
మెడవంపున
ముద్దుపెడితె
మొగిలిరేకు సౌరభం

ఎదపైన చుంబిస్తే
బంతిపూల మెత్తదనం
నాభిమీద చుంబిస్తే
పున్నాగ పులకరము
నడుము మడత ముద్దెపుడు
నిద్రగన్నేరు
గులాబి గుభాళింపు
తమకాల ముద్దుతీరు

తనువణువణువు ముద్దు తంగేడు పువ్వు సొగసు