https://youtu.be/miTiw-09Z_Y
సాకారం పృథ్వీ తత్వం
నిరాకారం ఆకాశ తత్వం
ఫాలానేత్రాన అగ్నితత్వం
గంగాధరునిగ జలతత్వం
జీవేశ్వరునిగ వాయు తత్వం
పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
1.ఏకామ్రేశ్వర నీ స్వరూపం పృథ్వీ లింగం
చిదంబరేశ్వరా నీ చిద్రూపం ఆకాశ లింగం
అరుణాచలేశ్వరా నీ ఆకారం అగ్నిలింగం
జంబుకేశ్వరా హరా నీ మూర్తి ఇల జలలింగం
శ్రీ కాళ హస్తీశ్వరా నీ అకృతి వాయు లింగం
పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
2. ద్రాక్షారామాన భూతత్వంగా నమో భీమేశ్వరమ్
అమరారామానా ఆకాశ తత్వంగా అమరేశ్వరమ్
కుమార భీమా రామానా అగ్ని తత్వంగా కుమరేశ్వరం/కుమర భీమేశ్వరమ్
క్షీరారామానా జలతత్వంగా స్వామి రామలింగేశ్వరమ్
సోమారామాన వాయుతత్వంగా వందే సోమేశ్వరమ్
పంచభూతాత్మకం ప్రభో నీ శివ తత్వం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ