Wednesday, July 15, 2009

నామది నీ రథము-స్వామి యోగము నా పథము
సారథి నీవేలే- స్వామి నాగతి నీవేలే-శరణాగతినీవేలే
స్వామి శరణం అయ్యప్పా -స్వామి శరణం అయ్యప్పా

1. ఈ జగమే కురు క్షేత్రం-జీవనమే సంగ్రామం
నా అస్త్రము నీవేలే-స్వామి శస్త్రము నీవేలే
స్వామి శరణం అయ్యప్పా -స్వామి శరణం అయ్యప్పా

2. అరిషడ్వర్గాలే స్వామి నాకిలలో శత్రువులు
ధైర్యము నీవేలే-మనస్థైర్యము నీవేలే
స్వామి శరణం అయ్యప్పా -స్వామి శరణం అయ్యప్పా

3. చేసే నరుడవు నీవే-చేయించే హరియూ నీవే
కార్యము నీవేలే స్వామి-కైవల్యము నీవేలే
స్వామి శరణం అయ్యప్పా -స్వామి శరణం అయ్యప్పా

1 comment:

Anil Piduri said...

భక్తుని హృదయ సరస్సున విరబూసిన విరబూసిన శ్రీనివాస స్తోత్రము,
Nice!