Tuesday, July 21, 2009

గోదావరే నా ఎదురుగ ఉన్నా
తీరదులే నా దాహం
తీర్చదు ఏ ప్రవాహం
1. మండే వేసవి కాదు
ఇది ఎండమావే కాదు
పారే ఈ ఏరు –తీయని ఈ నీరు
తీర్చదులే నాదాహం-తీరనిదీ సందేహమ్
గుండెల మంటలు ఆర్పే కోసం
కురియదేల ఈ వర్షం
కాదా ఇది శ్రావణ మాసం
2. దాహంతోనే పయనం-ఈ జన్మకిదే శరణం
ఆశల నణిచేసి –ఊహల నలిపేసి
జీవశ్చవమై పోవే- మనసా శిలవై పోవే
కలిమీ లేముల కయ్యములోన
కట్టుబాట్ల సంఘర్షణ లోనా
ఎక్కడున్నదీ ప్రగతీ –మనసా నీ కింకేగతి
ఓ మనసా నీ కింతే గతి

2 comments:

ఆత్రేయ కొండూరు said...

బాగుందండీ.. అభినందనలు. కొన్ని అచ్చు తప్పులున్నాయి సరి చూసుకోగలరు.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీ సద్విమర్శకు నా సహస్ర వందనాలు!అచ్చుతప్పులేవో మచ్చుకు చెబితే సవరించుకోగలుగుతాను.భవిష్యత్తులోకూడ ఇలాగే మీ స్పందన తెలుపగలరు