చేయగ నా తరమా నీ దీక్ష నిష్ఠగా
చేయించే భారం నీదే - స్వామి అయ్యప్పా-శరణమయ్యప్పా
1. సూర్యోదయ పూర్వమే నిద్రలేవ నావశమా
సుప్రభాత గీతి పాడి నన్ను మేలుకొలుపు సుమా
చన్నీళ్ళతొ తలస్నానం-జివ్వుమంటుంది ప్రాణం
హైమవతీ తనయ స్వామీ –అయ్యప్పా నీవే శరణం-అయ్యప్పానీవే శరణం
2. శ్లోకాలూ స్తోత్రాలూ పలుకలేను స్వామీ
శరణుఘోష ఒక్కటే నోరారా చేతునయా
పడిపూజలు నీ భజనలు వీలవడం లేదయ్యా
మదిలో నీ నామ స్మరణ మరువనులే అయ్యప్పా-
మరువనులే అయ్యప్పా
3. పాపిష్టివి నా కళ్ళు-కోపిష్టిది నానోరు
భ్రష్టమైన చక్షువులు-నికృష్టపు చిత్తము
తప్పించర భవ చెఱనిక స్వామీ హే భూతనాథ
భవతనయా తవ దర్శన అనుభవమే కలిగించు-
అనుభవమే కలిగించు
4. అడుగుతీసి అడుగైనా వేయలేను నేను
పాదరక్షలే లేక కదపలేను మేను
పెద్ద పాదమార్గమతి కష్టంబట కద స్వామీ
చేయి పట్టి నడిపించి శబరి చేర్చరావేమి-నీ చెంత జేర్చుకో స్వామీ
No comments:
Post a Comment