మురళీ లోలా మువ్వగోపాల
నువ్వు చిందేయగా చిలిపి కృష్ణా
కనువిందాయెరా బాలకృష్ణా
నువ్వు చిందేయగా చిలిపి కృష్ణా
కనువిందాయెరా బాలకృష్ణా
1. కాళింది మడుగులో-కాళీయుని పడగలపై
నర్తనమాడిన తాండవ కృష్ణా
దర్పము నణచిన వంశీ కృష్ణా
2. చిటికెన గోటిపైన గోవర్ధన గిరిని నిల్పి
లోకుల గాచిన గోపీకృష్ణా
ఘనత వహించిన గిరిధర కృష్ణా
3. పొన్నచెట్టుపైన నిలిచి-కన్నెల కోకలు దాచి
కన్నుల పొరమాన్పిన –గీతా కృష్ణా
కన్నెల ఎదదోచిన-మోహన కృష్ణా
4. యమునా నది తరంగాల-భక్తాంతరంగాల
రాసలీలలాడిన రాధా కృష్ణా
రాగడోల లూగిన మీరా కృష్ణా
3 comments:
కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
మీ కవిత. బాగుంది.
చాలా ధన్య వాదాలండీ ఇలాగే నన్ను సదా ప్రొత్సహిస్తారని ఆశిస్తూ
మీ స్నేహాభిలాషి రాఖీ
మీకు కూడా గోకులాష్టమి పర్వదిన శుభాకాంక్షలు
Post a Comment