Saturday, November 7, 2009


నిష్ఠగ నీవుండకుంటె దీక్షలెందుకు
నియమాలు పాటించక వ్రతములెందుకు
నోరారా పలుకనిదే శరణుఘోష ఎందుకు
మనసారా పాడనిదే స్వామి భజనలెందుకు

1. తొలికోడి కూయకనే –ఉలికిపడిలేవనపుడు
నియమాలమాల నీ మెడలొ ఎందుకు
ఒళ్లుజివ్వుమననప్పుడు-స్వామిశరణమననప్పుడు
గోరువెచ్చనైననీటి స్నానమెందుకు

2. మనసులో వర్ణాలు మాయమే కానప్పుడు
నీలివస్త్రధారణతో తిరుగుటెందుకు
ఒడుదుడుకులతో నడవడి-గడబిడగా తడబడితే
పాదరక్షలే లేని ఫలితమెందుకు

3. అలంకారప్రాయమే-విభూతి చందనాలు
భృకుటిపైన దృష్టి నీవు సారించనపుడు
చిత్తచాంచల్యమై –ఇంద్రియ చాపల్యమై
స్వామిపూజచేసినా సాఫల్యం కాదెపుడు

4. షడ్రుచులతొ భిక్షలు-ఉపహార సమీక్షలు
నాలుక నీ ఏలికైతె ఏకభుక్తమెందుకు
భుక్తాయసమైనపుడు ఏకభుక్తమెందుకు
అర్ధా-పావూ మండలాలు-వాటంకొద్ది వైష్ణవాలు
మోజుకొరకు దీక్షలైతె మోక్షమెందుకు-శబరి లక్ష్యమెందుకు
మండలదీక్ష కానప్పుడు మాలెందుకు-నియమాలెందుకు
5. అమ్మ ఆజ్ఞ లేనప్పుడు-భార్య కుదరదన్నప్పుడు
అయ్యప్ప ఆనతీ దొరకదెప్పుడు
గుండెయె గుడియైనప్పుడు-ఎద సన్నిధానమెపుడు
నీ శరీరమే శబరిధామము
తోడునీడస్వామినీకు సదా శరణము
స్వామి సదా శరణము-స్వామిశరణము
రచన:రాఖీ -9849693324

3 comments:

బుజ్జి said...

chala bagundi superbbbbbbbbbbbbb

బుజ్జి said...

superrrrrbbbbbb chala bagundi.... తొలికోడి కూయకనే –ఉలికిపడిలేవనపుడు నియమాలమాల నీ మెడలొ ఎందుకు
ఒళ్లుజివ్వుమననప్పుడు-స్వామిశరణమననప్పుడు
గోరువెచ్చనైననీటి స్నానమెందుకు.... adiri poyeendi... chala baga chepparu....

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

dhanyavaadaalu bujji gaaru mee pratispandanalu naa kavitala eda ilage kalakaalam konasaagaalani akaankshistoo............
sadaa mee snehabhilaashi
raki