https://youtu.be/PgrPc-3MDUU
తెలుపుతుంది-నినదించే హృదయ ఘోష
1. కంటిసైగలే వర్ణాలు-ఒంటి చేష్టలే ...పదాలు
మూతివిరుపులు-ముసిముసి నవ్వులు వాక్యాలు
ఎర్రబడిన కళ్ళు -గులాబి చెక్కిళ్ళు వ్యాకరణాలు
తిప్పుకొను తల ఛందస్సు-చిలిపి చూపే లిపి
2. నిదుర రాస్తుంది కలల కావ్యాలని
కలత నిదుర తెలుపుతుంది కావ్య భాష్యాలని
అలక, ప్రణయ మొలక కావ్యానికి వస్తువులు
ఒలికే బుసలు ఓర చూపులు కావ్య శిల్పాలు
3. జగమంతా ఎరుగుతుంది మూగ భాష
జనులంతా వాడ గలుగు మౌన భాష
అపరిమితం అనంతం చిత్రమీ భాష
చెప్పకనే నేర్చుకొన్న చిన్ననాటి భాష
2 comments:
>>"మౌనం మాట్లాడుతుంది-వింత భాష
తెలుపుతుంది-నినదించే హృదయ ఘోష"
Beautiful.
పైన శీర్షిక వద్ద ఉన్న ఫోటో సూపర్బ్.
ఈ టపాకి టైటిల్ కూడా పెట్టి ఉంటే బాగుండేది.
DHANYAVAADAALU NAGAPRASAD GAAROO!
NIJAANIKI IDE "TAPAA"..KAADU "PAATA" KANUKA TITLU PETTALEDU..AYINAA TITLE "MAUNAM MAATLAADUTUNDI"ANE DE SHEERSHIKAGAA TEESUKOVACCHU..
IKA POTE AA PHOTO MAA VOORU KONERU NA
KAARTEEKA PUNNAMI REYINA
VELIGINCHINA DEEPAALA CHTRANA..
MEEROO TILAKINCHANDI AKKADAKU VACCHI SWAYANAA
Post a Comment