Saturday, December 5, 2009

Ok

చిట్టిచినుకా నువు తాకగానే
మట్టికూడ పరిమళించులే
రామచిలుకా నువు తలుచుకొంటే
జాతకాలె మారిపోవులే
ఉడతా లేనిదే రామాయణం లేదులే
బుడత లేనిదే భాగవతం చేదులే

1. అణువులోన బ్రహ్మాండం దాగిఉన్నది
తనువులోన జ్ఞానబండారమున్నది
మనసులోన మర్మమెంతొ మరుగున ఉన్నది
తఱచితఱచి చూడనిదే తెలియకున్నది
నింగితారకా నీ రాకతో చందమామ బెంగతీరులే
ఓ చకోరికా నీచిరుకోరికా వెన్నెలమ్మ తీర్చగలుగులే

2. సింధువు మూలము ఒక బిందువేగా
తరువుకు ఆధారం చిన్ని బీజమేగా
కావ్యమెంత గొప్పదైన అక్షరమే కుదురు కదా
దివ్యవేణుగానమైన పలికేది వెదురే కద
ఓకోయిలా ఎందుకోయిలా
నీ పాట వినుటకే వచ్చునే వసంతము
ఓరాయిలా-నే-మారాయిలా
శిల్పివై చెక్కితే-నే-జీవ శిల్పము

1 comment:

మరువం ఉష said...

"సింధువు మూలము ఒక బిందువేగా
తరువుకు ఆధారం చిన్ని బీజమేగా
కావ్యమెంత గొప్పదైన అక్షరమే కుదురు కదా
దివ్యవేణుగానమైన పలికేది వెదురే కద"

ఈ భావవ్యక్తీకరణ బాగుంది.