Sunday, February 14, 2010

https://youtu.be/BMkD9plxUeY

నాన్నా నీవేలే త్యాగానికి ప్రతిరూపం
నాన్నా నీవేమా ఈ ఉన్నతి తార్కాణం
ఏమి చేసినా గాని తీరిపోదు నీ ఋణం
ఈయగలము మనసారా మా అశ్రుతర్పణం

1. అనురాగ మూర్తియైన అమ్మను నా కిచ్చేసి
ఆనందలోకమైన అమ్మఒడిలొ నను వేసి
కాలుకంది పోకుండా భుజాన నను మోసి
అందమైన బాల్యాన్ని అందజేసావు వెఱసి

2. దొంగబుక్కలెన్నెన్నో కుడిపించావు
అంగలేయ వేలుపట్టి నడిపించావు
కంటి చూపుతోనే క్రమశిక్షణ నేర్పావు
మౌనదీక్షతోనే నిరసన ప్రకటించావు

3. మా పోషణె ధ్యేయంగా బ్రతుకు ధార పోసావు
రేయిపవలు మాకోసం నీరెక్కలు వంచావు
ఎంతకష్టమైనా సరె నవ్వుతు భరియించావు
నీ బిడ్డలమైనందుకు గర్వపడగ పెంచావు
నాన్న అంటె ఇలాగే ఉండాలనిపించావు

2 comments:

పరిమళం said...

"అనురాగ మూర్తియైన అమ్మను నా కిచ్చేసి
ఆనందలోకమైన అమ్మఒడిలొ నను వేసి
కాలుకంది పోకుండా భుజాన నను మోసి
అందమైన బాల్యాన్ని అందజేసావు వెఱసి"
అక్షర సత్యాన్ని అందంగా చెప్పారు సర్ !

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీ రాకతో మా బాగు(అచ్చుతప్పుకాదు..హిందీ లో తోట అనేభావనలో..)అయిన మా బ్లాగు మాబాగు(తెలుగు)అయిన పరిమళాలతో నిండిపోయింది..సాహితీ సౌరభాలు ..ఎద సుగంధాలు..భావనా రోజాలకు సహజమే కదా..!
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ