Wednesday, March 16, 2011

చేత కాని నేతలు

చేత కాని నేతలు

చేనేత విధికి ఎదురీత
చేనేత వక్రించిన నుదుటి గీత
చేనేత అనునిత్యం ఒక వెత
చేనేత ఎన్నటికీ మారని చరిత

1. మానం కాచే నేతన్నకు-అవమానం మిగిలింది ఈ జన్మకు
కళాకారుడైన ఈ బ్రహ్మకు-కళంకమే ఒరిగింది తన ప్రజ్ఞకు
పెట్టుబడే భార్య పుస్తెల తాడై-అమ్ముడవని సరుకంతా తన గోడై
బ్రతుకలేక ఛస్తుంటే-ఛస్తూ బ్రతుకుతుంటె
చేనేత తీరని వెత-చేనేత ఎన్నటికీ మారని చరిత

2. తీసుకున్న ఋణమే దారుణమై-తీర్చలేని మోయలేని భారమైంది
రద్దుపరచు ఋణపద్దుల వాగ్దానమే-చేతకాని ప్రభుతకది ఋజువయ్యొంది
వసంతాలు రాని చోట తానొక మోడై-తా నేసిన చీరే మెడకురితాడై
మరణమే శరణమైతె-ప్రభుతే కారణమైతె
చేనేత ఒక గుండెకోత- చేనేత నేతల వంచిత

1 comment:

veera murthy (satya) said...

చాలా బాగారాసారు సార్... మీకు ధన్యవాదాలు.
సామాజిక స్పృజ ఉన్నోడే నిజమైన కవి!

మొసలికన్నీరు కార్చ మంటే కారుస్తరు నేతలు
బతుకుబాధలు తీర్చ మంటే చాలు పారిపోతరు ద్రోహులు.
లాకర్ లో మాత్రం అవినీతి కట్టలు పేరుస్తరు నేతలు
తోడినిలిచి రమ్మంటే ఒక వైపు చేరిపోతరు ద్రోహులు.

-satya