Wednesday, September 21, 2011

https://youtu.be/OMmSdYe5UGM

ఎన్నసొంటి మనసునీది ఎములాడ రాజన్న
ఎముకలేని సెయ్యినీది ఏదడిగిన ఇత్తువన్న

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

1. పామునైన ఏనుగునైన పావురంతొ సూసావు
సాలెపురుగైతేనేమి-మోచ్చమిచ్చి వేసావు
కోడికీ కోతికీ రాజభోగ మిచ్చినావు
సివరాత్రిన కుక్క సస్తె ముత్తినిచ్చినావు నీవు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

2. ఎదిరించిన అర్జునునికి పాశుపతము నిచ్చావు
సెరణని నినుపట్టుకుంటె మార్కండేయు గాచావు
కన్నిచ్చిన తిన్ననికీ కైవల్యమునిచ్చావు
రాజన్నా పబ్బతంటె అండగ నీవుంటావు

గంగనీళ్ళు తలన బోస్తె-సంబరపడిపోతావు
పత్తిరినీ నెత్తినెడితె-పరవసించి పోతావు

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

3. భక్తికి నువ్వెప్పుడైన బంధీవై పోతావు
ఇవ్వరాని వరములైన ఇట్టే ఇచ్చేస్తావు
అడిగాడని రావణుడికి ఆలినైన ఇచ్చావు
ఆపైన పట్టుబడితె ఆత్మలింగమిచ్చావు

నీకన్న జాలిజూపు దైవమేది శంకరా
(మావంటి)దీనులకీవె ఆప్తుడవన లేదు మాకు శంకరా

“గుండంల తానాలు నీకయ్యా-గండాదీపాలింక నీకయ్యా
కోడెమొక్కులిగొ నీకయ్యా-నిలువెత్తు బెల్లాలు నీకయ్యా||”

2 comments:

ఆత్రేయ said...

" రాజన్న- మనసు వెన్న" శీర్షిక పేరు చూసి ఇదేదో ఓదార్పు వెన్నగాచిన నెయ్యి తాలూకు వ్యాపారం అనుకున్నా.
పొరపాటు!!
నిజంగా.. ఆవు పాలంత స్వచ్చంగా.
పెరుగంత వెచ్చంగా,
వెన్నంత మెత్తంగా,
నెయ్యంత కమ్మంగా ఉంది మీ కవితా.
అభినందనలు.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

dhanyavaadaalu aatreyagaaru! pErulone mee manasu poolateru!! sadaa vennati undandagalaru...
_raki