“అనురాగిణి “
గుండె తావే ఔదార్యం –గొంతు తావే మాధుర్యం..( తావు-తావి )
అనునాదం బహు సౌందర్యం –నీవు పాడితే
పాటకు ధైర్యం
ఓ రూపు దాల్చిన గీతమా- పాదాభివందనం
ఓ చెలిమి పంచిన నేస్తమా-స్నేహాభినందనం
1.
వెదక బోయిన తీగలాగా తారసిల్లినావే
ఎదుట నిలిచి స్వరనిధివీవై వరములిచ్చినావే
గమకాలు సంగతులన్నీ – అలవోకగ పలికించావే
అనుభూతులు భావాలన్నీ – పన్నీరుగ
చిలికించావే
ఓ సంగీత శారదా –శిరసు వంచేను సదా
ఓ ప్రత్యక్ష భారతీ –నీ భక్తుడనైతి కదా
2.
అక్షర సుమ మాలికతో అలరించెద నిన్ను
పదముల మధు ఫలములనే నివేదింతు నీకు
కవితల గేయాల హారతుల౦దించెద నీకు
కృతులూ కీర్తనలెన్నో ఆర్తిగ విన్పించెద
నీకు
ఓ అపర వాణీ –నీకు గీతాంజలి
అభినవ గీర్వాణీ-ముకుళిత హస్తాంజలి
No comments:
Post a Comment