Friday, April 20, 2018

OK

నిద్దురమ్మా రావమ్మా నీకు వందనం
సిద్ధపరచి ఉంచానమ్మా కలల అందలం
మత్తు మత్తుగ నన్నూ హత్తుకోవమ్మా
చిత్తమంతా ఆక్రమించి చుట్టుకోవమ్మా

1.మెత్తనైన పరుపును వేశా -నా గుండెసొంటి దిండునుంచా
హాయిగొలుపే జోలపాటలు-అల్లనల్లన ఆలపించా
నల్లనైన తెరలు దించా-కళ్ళఅలసట నంత తీర్చా
దోమలేవీ దూరకుండా గట్టి బందోబస్తే చేసా
నీఒడిలో చోటునివ్వు నిద్దురమ్మా
సేదదీరగ చేరదీయవె నిద్దురమ్మా

2.ఉక్కపోతను దూరం చేసా-అగరు బత్తుల ధూపం వేసా
ఎంతగానో బ్రతిమిలాడి రెప్పల్నీ వాలగజేసా
తీపి కబురుల ఊసులు తెలిపా-వింత వింత కథలే చెప్పా
తలను నిమిరి వెన్నుజో జోకొట్టి-వెచ్చగా నే అక్కున జేర్చా
 రాక తప్పదు నీవింక నిద్దురమ్మా
కరుణజూడవె నావంక నిద్దురమ్మా


No comments: