Monday, April 22, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

తలమీద మాతల్లి ఊరేగంగ
సగమేను మాయమ్మ ఆక్రమించంగ
కన్నుల కురిసే వెన్నెల వర్షంగా
హృదయమంత ఉప్పొంగే కరుణామృతగంగ
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా

1.ఇవ్వాలనుకున్నప్పుడె ఇస్తావు నువ్వు
ఇచ్చేదాకా వదలను నీ పాదాలతావు
బెట్టుజేయబోకురా ఓ మెట్టుదిగితె చాలురా
చావు పుట్టుకలన్నీ నీ కనుసైగతోనెరా
ఆటలాడబోకురా నటరాజ నిన్నె నమ్మితిరా
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా

2.దీనులెలా అయ్యాము నీ దయలేకనే
ఇడుములపాలైతిమెలా నీకృప లేకనే
పక్షపాతివైతివో మము లక్ష్యపెట్టకుంటివో
కొందరికే ఎందులకు ఆవేదన
మరికొందరికేలా ఆనందము
శంకరా అభయంకరా..శంకరా భక్తవశంకరా..
భక్త వశంకరా

No comments: