Tuesday, July 23, 2019

OK

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అద్దరాతిరి నిద్దురలేపి  సుద్దులేలనో
లలనా ఈ ముద్దుముచ్చటలేలనో
కలలొ వచ్చి కలతను రేపగ గిచ్చుడేలనో
సుదతి అచ్చిక బుచ్చిక లేలనో
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లోను సాధిస్తావు

1.ఉషోదయం చూడగ నీ- సింధూరం అగుపిస్తుంది
చిరుగాలి తాకగనే నీ స్పర్శనె అనిపిస్తుంది
కొలనులో కలువలు కనబడి నీ కన్నులుగ తోస్తాయి
మందారాలు కోయబోతే నీ బుగ్గలు గురుతుకొస్తాయి
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లోను సాధిస్తావు

2.సాయంత్రం ఇంద్రధనుసులో నీ అందం స్ఫురియిస్తుంది
పున్నమి జాబిల్లి సైతం నీ మోమును పోలుతుంది
దూరాన కోయిల కూసినా నీ గొంతే వినిపిస్తుంది
గగనాన మెరిసే ప్రతి తారా నీ తళుకే చిమ్ముతుంది
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లొ సాధిస్తావు

అద్దరాతిరి నిద్దురలేపి సుద్దులేలనో
లలనా ఈ ముద్దుముచ్చటలేలనో
కలలొ వచ్చి కలతను రేపగ గిచ్చుడేలనో
సుదతి అచ్చిక బుచ్చిక లేలనో
మేలుకొంటే ఊరుకోక ఊహల్లొ చొరబడతావు
నిదురబోతే వీడలేక స్వప్నాల్లోను సాధిస్తావు

No comments: