Wednesday, October 30, 2019

https://youtu.be/Hbnjwpe3gF0?si=_KvT_ఫకిజర్మసో

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:శివరంజని

సోదరుడు:

అక్కయ్య అంటె మెరిసే చుక్క
చెల్లెమ్మ అంటే విరిసిన మల్లి
స్నేహానికి ప్రతిరూపం సహోదరే
అనురాగ దీపమంటే ఆడకూతురే

సోదరి:

అన్నంటే నా ఆరో ప్రాణం
నా తమ్ముడంటె తానే సర్వం
కంటిరెప్ప తానే సోదరుడు
చంటిబిడ్డ లాంటి సహజుడు

సోదరుడు:

చ1.అమ్మలాగ లాలిస్తుంది
నాన్నలాగ నడిపిస్తుంది
ఆటపాటలెన్నో నేర్పుతుంది
అంతలోనె అత్తారింటికి తుర్రుమంటుంది

సోదరి:

గొడుగులాగ నీడౌతాడు
అడుగడుగున తోడౌతాడు
కళ్ళు తడుచు చేయి తానౌతాడు
కన్నుమూసి తెరిచేలోగా వదినమ్మకు జతఔతాడు

సోదరుడు

చ.2.పండుగ శుభహారతి తానే
ఆడపడుచు అధికారంతానే
పుట్టినింటి గౌరవం తానే
 మెట్టినింటి ఆర్భాటం తానే

సోదరి:

ఆపదకు సంపదకు ఆప్తుడుతానే
కష్టసుఖాల్లో కాచే తోబుట్టువు తానే
ఏకాకిని నేను కాదను ధైర్యం తానే
బామ్మర్దుల బలమైన అనుబంధం తానే

No comments: