https://youtu.be/HFGocHtWfnU?si=ET0FsNtVzfQYr3sG
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చంద్ర కౌస్
రాగం:చంద్ర కౌస్
మేలుకొనవు అదేమి స్వామీ⁉️
మేము పాడే మేలుకొలుపులన్నీ వృధానా ఏమీ
ఉన్నావో లేవో అనెడి శంక మా కిపుడింక
ఉండీమిన్నకుంటూ చూడవేమో మా వంక
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా
1.శచీపతి వంచనకు గురియైన ఆ అహల్య నాదరించలేదా
సీతామాతను చెఱబట్టిన రావణుడినీ మట్టుబెట్టలేదా
వేచిచూచిన శబరిని బ్రోచితివన్నది కట్టు కథేనా
స్త్రీ పక్షపాతివే నీ ప్రతీ అవతారమునందునా
ఉదాసీనమేలయ్యా కలి సుదతుల కడగండ్ల ఎడల
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా
2.దుశ్శాసన దుర్యోధనాదుల తుదముట్టించలేదా
కీచకుడి పీచమణచగ భీముడి తోడై నిలువగలేదా
ద్రౌపదిని పదేపదే ఆదుకొన్నది నీవెనన్నది నిజంకాదా
నీవేగద మార్చినది కుబ్జనొక స్పర్శతో సుందరిగా
నిర్లక్ష్యము నీకేల కలి కోమలాంగుల కాపాడగా
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశా
ఊరకుండిన నేరమౌను నీదే ఓ శ్రీనివాసా
OK
No comments:
Post a Comment