Saturday, November 23, 2019

https://youtu.be/KkzPG7fBQH4

నా ఊహలు మల్లెపూలు-నీ తలలో తలపులలో
నా ఊసులు విరజాజులు-నీ కలలో కల్పనలో
నా బాసలు బంతిపూలు-ఈజన్మలో ఏడేడు జన్మల్లో
తనువంతా తన్మయమయ్యేంత
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ

1.నా భావన కలువలు-నీ కన్నుల్లో పున్నమి వెన్నెల్లో
నా నందివర్ధనాలు
నీ పెదవుల్లో ముసిముసినవ్వుల్లో-నా స్మృతి మందారాలు
నీ బుగ్గల్లో నునులేత సిగ్గుల్లో-నా స్మరణ దవనాలు
తనువంతా తన్మయమయ్యేంత
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ

2.నా ధ్యాస చేమంతులు-నీమేని ఛాయలో వింతైన మాయలో
నా ధ్యానపారిజాతాలు-నీ తమకంలో ప్రణయమైకంలో
నా జ్ఞాపక రోజాలు-నాపై మోజుల్లో అన్నిరోజుల్లో
నీ విరహ అగ్నిపూలు-ఆరారు ఋతువుల్లో మన రతిక్రతువుల్లో
తనువంతా తన్మయమయ్యేంత
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ

నా ఊహలు మల్లెపూలు-నీ తలలో తలపులలో
నా ఊసులు విరజాజులు-నీ కలలో కల్పనలో
నా బాసలు బంతిపూలు-ఈజన్మలో ఏడేడు జన్మల్లో
తనువంతా తన్మయమయ్యేంత
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ
పరిమళాలు విరజిల్లుతున్నాయి ప్రేయసీ
జీవనవనమంతా మనప్రేమగా విరగబూసీ



No comments: