Monday, March 30, 2020

ఏ దివ్య లోకాలనుండో దిగివచ్చినావే చెలీ
రస రమ్య సోయగాలే సంధించినావే సఖీ
వెన్నెలనంతా దోచుకొచ్చి వెల్లెవేసావు నీమేనికి
కన్నె పరువం దాచుకొంటూ వన్నెలూనేవె నేటికీ
ప్రౌఢలోనీ గూఢపొంకం సాటిరాదది నీకే సొంతం
నీ అంగాంగం మన్మథరంగం నిత్యవసంతం  జీవితాంతం

1.అందంగా జన్మించడం  లలనకు అదృష్టం
కలకాలం సవాలే యవ్వన పరిరక్షణం
ఏపూటన తిన్నావొ పస్తులే ఉన్నావో సౌష్ఠవానికి
వ్యాయామమె చేసావో ఆరోగ్యమె కాచావో సొగసుకి
సౌందర్యపోషణే నిష్టాగరిష్టమైన యజ్ఞం
ఏమరుపాటులేక కాచుకున్నావు సౌందర్యం

2.ఏచోటన తమ అందపు కేంద్రముందొ ఎరుగరు
ఏవర్ణం సొబగుల ఇనుమడించునో తెలియరు
కనులు వీక్షణలు అధరాల విరుపులు బుగ్గసొట్టలు
నాభి నడుమొంపులు పయోధరాలు కురులు  జఘనాలు
ఎదగుట్టు కనిపెట్టి కనికట్టు చేసే కప్పుర గంధీ
తాపసులకు కసిరేపి రతికై ఉసిగొలిపే కలశస్తనీ

No comments: