Tuesday, May 26, 2020

OK

ప్రాణమై పోయింది గానమే
అనుక్షణం మమేకమై పోతోంది మనమే
అభేదమాయె సంగీతముతొ జీవనమే
మరణానంతరమంతా అనంత మౌనమే

1.ఉఛ్వాస షడ్జమమై నిశ్వాసనిషాదమై
ప్రాణోపానవ్యానోదాన సమానాలే
రిషభ గాంధార మధ్యమ పంచమ ధైవతాలై
లబ్ డబ్ యనిమ్రోగే హృదయ లయతొ లయమై
బ్రతుకే భావ రాగ తాళ సంయుతమై
అమ్మలాలి పాటతోనే ప్రభావితమై

2.వెలువరించిరి గీతాలు సాహితి స్రష్టలు
మధురిమలద్దిరి గేయాలకు సంగీత విధాతలు
సంగీత సాహిత్య లహరిలో తరించిరి వాగ్గేయకారులు
ఎంతటి సాధన చేయాలో పొందగ స్వరవరములు
అనుగ్రహించాలి వీణాపాణి శ్రీ వాణి
గురువై నేర్పాలి హరుడే కరుణించి

No comments: