Tuesday, September 22, 2020

 రెప్పపాటులోనె గడిచే- షష్టిపూర్తి జీవితం

గిర్రుమంటు తిరిగింది- కళ్ళముందె కాలచక్రం

మరలిచూసుకొంటుంటే ఎన్నెన్ని జ్ఞాపకాలో

తీపిచేదు కలబోసిన ఎన్ని అనుభూతులో


1.మొన్నమొన్ననే కదా అమ్మ బువ్వ తినిపించింది

నిన్నటికి నిన్నేగా నాన్న నన్ను నడిపించింది

సీతక్క గిల్లిన నొప్పి ఇప్పటికీ తగ్గకుంది

శీనుగాడు తోసినగాయం మచ్చగ మిగిలేఉంది

చిటికెలొన గడిచిన వయసున అనుభవాలెన్నెన్నో

కోల్పోయిన నా బాల్యం మూల్యమెన్నెన్నికోట్లో


2.రాధకీయని  ప్రేమలేఖలు రాశులుగా పెట్టెలొ మూల్గే

మధుగాడితొ పోటీపడ్డా ఆమాత్రపు కొలువే దొరికే

గీతతో మనువైతేనేం బ్రతుకు బృందావనమై సాగే

పుట్టిపెరిగి అంతలోనే సంతతి ననుమించి ఎదిగే

పదోన్నతులు పొందీపొందగ పదవి విరమణా అయిపోయే

రెక్కలొచ్చి పిల్లపక్షులు భృతివెతుకుతు ఎగిరిపాయే


మాకు మేమై నాకునేనై అనంత జీవయాత్రాయే

No comments: