"శివపాద రజం"
రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ)
భోభో భోళాశంకరా శాంభవీ విభో
సామగానలోల సాంబసదా శివా ప్రభో
మహా లింగ రూపా విశ్వేశా స్వయంభో
భవా మాం పాహి పాహి పాహి నమశ్శంభో
శరణు శరణు శరణాగతవత్సల హరహరా
1.హరిబ్రహ్మార్చిత అభిషేక ప్రియ ఈశ్వరా
మునిజన వందిత బిల్వదళాలంకార సుందరా
దేవ దానవ మానవ పూజిత పన్నగ ధరా
వృషభవాహన పంచానన హిమవన్నగ చరా
శరణు శరణు శరణాగతవత్సల హరహరా
2.దిగంబరా ఋతంబరా చర్మాంబర ధరా
కాలకంఠ హే నీలకంఠ హే గరళకంఠ శబరా
త్రయంబకా వైద్యనాథా మృత్యుంజయ శశిధరా
జటాఝూటధర గంగాధర వర జంగమ దేవరా
శరణు శరణు శరణాగతవత్సల హరహరా
No comments:
Post a Comment