రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
అశనిపాతమై విషాద గీతమై
ఆనందపు ఛాయేలేని జీవితమై
అడుగడుగూ అపార దుఃఖభరితమై
ఇదేనా నీ ప్రసాదము ఇంతేనా జన్మాంతము
శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా
పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా
1.జగత్పితవు నీవంటారే నేనే అనాథనా
జగన్నాథ నీవంటూ ఉంటే జనుల కింత క్షోభనా
తప్పుచేస్తె దండించాలి స్వప్నాలు పండించాలి
దారితప్పు వేళల్లో చేయపట్టి నడిపించాలి
శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా
పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా
2.మా ప్రమేయమెంత ఉంది మా మనుగడలో
మా ప్రతాపమేముంది మా గెలుపులలో
గడిచినంత గడిచింది కాలమంత కష్టాల్లో
ఇకనైనా మననీయి నీ చల్లని కనుసన్నలలో
శిలవైన నీకేంతెలుసు వేంకటేశ్వరా
పీడ కలలాంటి బ్రతుకంటే జగదీశ్వరా
No comments:
Post a Comment