అతను: నందనవనమే నీతో జీవనం
ఆమె: బృందావనమే నీతో సహగమనం
అతను: మండువేసవైనా నీతోఉంటే కులూమనాలి
ఆమె: పూరి గుడిసెలొ మనమున్నా అది స్వర్గం కాక ఏమనాలి
1..అతను: పచ్చడి మెతుకులు సైతం నీచేత పంచభక్ష్య పరమాన్నాలు
ఆమె: నూలు చీర కూడ నువు కొని తెస్తే నాకది కంచి పట్టు పీతాంబరం
అతను: ఎంతగా కష్టించివచ్చినా నీ ఒడిలో సేదదీరితె అలసట మటుమాయం
ఆమె: చేతిలోచేయుంచి దూరమెంత నడిచినా నాకది పుష్పకవిమాన పయనం
2.ఆమె: భరించరాని తలపోటైనా నీచేతి స్పర్శతో నాకుపశమనం
అతను: సమస్యల సుడిగుండమందైనా నీతోడుంటే నాకది ఆనంద తీరం
ఆమె: అమవాస్య రాత్రులైనా నీ సావాసం లో వెన్నెల విరజిమ్మేను
అతను: నువు చెంత ఉన్నంత శిశిరాలు వసంతాలై పూలు వెదజల్లేను
No comments:
Post a Comment